News
News
X

Chiranjeevi: మెగా ధమాకా, అన్నయ్య ‘వీరయ్య’గా వస్తే ఇంతే మరి - ఊరమాస్ టైటిల్‌తో చిరు ఎంట్రీ

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ టైటిల్ ఫిక్సయ్యింది. దీపావళి కానుకగా టైటిల్ అనౌన్స్ చేసింది సినిమా నిర్మాణ సంస్థ. పక్కా మాస్ లుక్ లో చిరంజీవి ఆకట్టుకున్నాడు.

FOLLOW US: 
 
మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న సినిమా టైటిల్ రివీల్ అయ్యింది. మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. టైటిల్ దీపావళి కానుకగా విడుదల చేశారు. మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే పండుగ ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్‌ ‘వాల్తేరు వీరయ్య’ అని ప్రకటించారు. ఈ సందర్భంగా టైటిల్ పోస్ట‌ర్‌ తో పాటు టైటిల్ టీజ‌ర్‌ ను సైతం విడుదల చేశారు.  మెగాస్టార్ చిరంజీవి మాస్ లుక్ లో విలన్ కు ఓ రేంజిల్ వార్నింగ్ ఇస్తూ ఈ టీజర్ లో కనిపించారు.

“ఎక్కడ్రా.. మీ అన్నయ్య వస్తే ఏదో అయిపోతుందని అన్నారు? ఎక్కడ్రా?” అంటూ విలన్ గొంతు చించుకుని అరుస్తాడు. మరుక్షణమే బాంబు పేలుడుతో హార్బర్ మొత మోగుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా స్టైల్‌ గా కళ్లద్దాలు పెట్టుకుని, కాలుతున్న చెక్కతో బీడీ కాల్చుకుంటూ అదిరిపోయే మాస్ గెటప్‌లో ‘వాల్తేరు వీరయ్య’ ఎంట్రీ ఇస్తాడు. ‘‘ఇలాంటి ఎంటర్‌టైన్‌‌మెంట్ కావాలంటే లైక్, షేర్, సబ్ స్క్రైబ్ చేయండి’’ అంటై చిరు చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఇక ఈ టీజర్ కు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. రిచ్ విజువల్స్ కు తోడు అదిరిపోయే మ్యూజిక్ తో డీఎస్పీ వారెవ్వా అనిపించాడు. ఈ టీజర్ మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

 తుది దశకు చేరిన షూటింగ్

ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’కు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అటు ఊర మాస్ హీరో రవితేజ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కొన్ని పాటలు, కొంత టాకీ పార్ట్ మినహా మిగతా సినిమా అంతా షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ వైజాగ్ రంగరాజుగా కనిపించబోతున్నారట.     

సంక్రాంతి బరిలో ‘వాల్తేరు వీరయ్య’

ఇక చిరంజీవి, మాస్ మహరాజ్ రవితేజ కలిసి నటిస్తున్న ఈ తాజా సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది. ఆ దిశగానే దర్శక నిర్మాతలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమాకు బాబీ కథతో పాటు మాటలు అందించారు. కోన వెంకట్, కె.చక్రవర్తిరెడ్డి కలిసి స్క్రీన్‌ ప్లే రూపొందించారు.

Also Read: యాంకర్ అనసూయ షాకింగ్ నిర్ణయం? ఇకపై కనిపించదా?

‘వాల్తేరు వీరయ్య’కు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జీకే మోహన్ సహ నిర్మాత. మెగాస్టార్ సినిమాలకు ఎక్కువగా సంగీతం అందించే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ఆర్థర్ విల్సన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా కొనసాగుతున్నారు. ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌, చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తున్నారు.

Published at : 24 Oct 2022 12:47 PM (IST) Tags: Megastar Chiranjeevi Shruti Haasan Ravi Teja Waltair veerayya Title Teaser Bobby Kolli

సంబంధిత కథనాలు

Bhavadeeyudu Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు - భవదీయుడుపై లేటెస్ట్ న్యూస్!

Bhavadeeyudu Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు - భవదీయుడుపై లేటెస్ట్ న్యూస్!

Inaya in Bigg Boss: క్యారెక్టర్లు మార్చుకున్న హౌస్‌మేట్స్ - మళ్లీ రొమాన్స్ మొదలెట్టిన శ్రీహాన్, ఇనయా

Inaya in Bigg Boss: క్యారెక్టర్లు మార్చుకున్న హౌస్‌మేట్స్ - మళ్లీ రొమాన్స్ మొదలెట్టిన శ్రీహాన్, ఇనయా

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?

FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?

Pawan Kalyan Harish Shankar : పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభాస్ దర్శకుడు

Pawan Kalyan Harish Shankar : పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభాస్ దర్శకుడు

టాప్ స్టోరీస్

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు