Ishwari Deshpande Death: బాయ్ ఫ్రెండ్ తో ట్రిప్ కి వెళ్లి.. కారు ప్రమాదంలో మరణించిన నటి..
ప్రియుడితో కలిసి హాలిడే ట్రిప్ కోసం వెళ్లిన నటి కారు ప్రమాదంలో మరణించడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.
ప్రియుడితో కలిసి హాలిడే ట్రిప్ కోసం వెళ్లిన నటి కారు ప్రమాదంలో మరణించడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. మరాఠీ ఇండస్ట్రీకి చెందిన ఈశ్వరి ప్రియుడితో కలిసి సెప్టెంబర్ 15న గోవా హాలిడే ట్రిప్ కు వెళ్లింది. సోమవారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారు అర్పారో గ్రామానికి సమీపంలోని బాగా కలాంగుట్ వంతెనపై అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. కారు సెంట్రల్ లాక్ చేసి ఉండడంతో ఇద్దరూ కారులో నుంచి బయటకు రాలేకపోయారు.
Also Read: ఎన్టీఆర్ హీరోయిన్ పై యాసిడ్ ఎటాక్.. అంతా ప్లాన్ ప్రకారమే..
ఈ ప్రమాదంలో ఈశ్వరి(25)తో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ శుభమ్ డెడ్జ్(28) కూడా ప్రాణాలు కోల్పోయారు. చిన్నప్పటినుంచి నటిగా రాణించాలని కలలు కన్నా ఈశ్వరి దేశ్ పాండే హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె నటించిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక శుభమ్ తో ఈశ్వరికి చాన్నాళ్లుగా పరిచయం ఉంది.
వీరిద్దరికీ వచ్చే నెలలో ఎంగేజ్మెంట్ చేయాలని నిర్ణయించారు కుటుంబసభ్యులు. కానీ ఇప్పుడు కారు ప్రమాదం జరగడంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ట్రిప్ వెళ్లి సంతోషంగా తిరిగి వస్తారనుకుంటే ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం బంధువులను, స్నేహితులను షాక్ కు గురిచేసింది. ఆమె మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు.
View this post on Instagram
Also Read: లహరి మావయ్యగా రవి.. ఫన్నీ టాస్క్ తో నవ్వించే ప్రయత్నం..
Also Read: 'బేబమ్మ' బర్త్ డే స్పెషల్.. వరుస సినిమా అప్డేట్స్..
Also Read: కృతి శెట్టి.. అందానికే ఆకృతి ఉంటే నీలా ఉంటుందేమో! ‘ఉప్పెన’ బ్యూటీ బేబమ్మ బర్త్‌డే నేడు
Also Read: బిగ్ బాస్ ప్రోమో: నోరుజారిన ఫలితం.. ప్రియాను వెంటాడుతున్న లహరి, రవిల లేట్ నైట్ హగ్!
Also Read: అర్ధరాత్రి రెస్ట్ రూమ్‌లో లహరి, రవి హగ్.. ప్రియా కామెంట్స్‌తో హీటెక్కిన బిగ్ బాస్ హౌస్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.