అన్వేషించండి
Advertisement
Krithi Shetty Birthday: 'బేబమ్మ' బర్త్ డే స్పెషల్.. వరుస సినిమా అప్డేట్స్..
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తన క్యూట్ లుక్స్ తో యూత్ ని ఫిదా చేసింది. దీంతో ఈ టీనేజ్ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే యంగ్ హీరో నాని సరసన 'శ్యామ్ సింగరాయ్', సుధీర్ బాబు నటిస్తోన్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్ హీరోగా చేస్తోన్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలతో పాటు రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు నాగార్జున 'బంగార్రాజు' సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటించనుంది. ఈరోజు కృతిశెట్టి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె నటిస్తోన్న సినిమాల నుంచి పోస్టర్లను విడుదల చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు మేకర్స్.
నాని 'శ్యామ్ సింగరాయ్' సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాను రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Thank you so much @NameisNani garu 🤗 and a big thanks to the entire team!!! https://t.co/lcnPhYa9g2
— KrithiShetty (@IamKrithiShetty) September 21, 2021
సుధీర్ బాబు-ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో వస్తోన్న లేటెస్ట్ సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ సినిమా యూనిట్ కూడా కృతికి బర్త్ డే విషెస్ చెబుతూ ఓ పోస్టర్ ని విడుదల చేసింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సుధీర్ ప్రేమించిన అమ్మాయి పాత్రలో కృతిశెట్టి నటిస్తోంది.
Many many happy returns of the day @IamKrithiShetty. Wishing you luck and good health
— Sudheer Babu (@isudheerbabu) September 21, 2021
I'm sure that #AaAmmayiGurinchiMeekuCheppali will be a wonderful experience for you & you will be left with memories to cherish forever 🤗😊
Stay safe & blessed always!! pic.twitter.com/qLvZfEw3mF
రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇందులో కూడా కృతినే హీరోయిన్ గా నటిస్తోంది. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఈరోజు కృతి బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలో కృతి ఫస్ట్ లుక్ ను రివీల్ చేస్తూ పోస్టర్ ను వదిలారు.
Team #𝐑𝐀𝐏𝐎𝟏𝟗 wishes a very happy birthday to the gorgeous and talented @IamKrithiShetty.May you have a blessed year ahead.#HBDKrithiShetty @ramsayz @AadhiOfficial @dirlingusamy @srinivasaaoffl @iAksharaGowda @SS_Screens @ThisIsDSP @sujithvasudev @PeterHeinOffl @anbariv pic.twitter.com/A4BoEhi81D
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 21, 2021
నితిన్, కృతి శెట్టి జంటగా 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను నితిన్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తిరుపతి
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion