Bigg Boss 5 Telugu: అర్ధరాత్రి రెస్ట్ రూమ్‌లో లహరి, రవి హగ్.. ప్రియా కామెంట్స్‌తో హీటెక్కిన బిగ్ బాస్ హౌస్

ఈ రోజు (20.09.2021) బిగ్ బాస్ ఇంట్లో జరిగిన నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. లహరి, రవిపై ప్రియా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

FOLLOW US: 

హమీద-శ్రీరామచంద్ర హౌస్‌లో ఉన్నవారి గురించి ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆ తరువాత రవి.. ప్రియాతో మాట్లాడుతూ.. 'లహరి తనతో క్లోజ్ గా మూవ్ అవుతుందని.. కలిసి ఫుడ్ తిందాం అంటుందని.. బ్యాటరీస్ కలిసి చేంజ్ చేయడం వంటివి చేస్తుందని.. ఇలా చేయొద్దు అని నేను చెప్పలేకపోతున్నా..' అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తరువాత మానస్-కాజల్ కలిసి హమీద-సన్నీలు సరిగ్గా పని చేయరని మాట్లాడుకున్నారు. 

ఉదయాన్నే.. హౌస్ మేట్స్ అంతా.. 'ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్' అనే సాంగ్ కి డాన్స్ చేశారు. ఆ తరువాత షణ్ముఖ్ తో డిస్కషన్ పెట్టాడు విశ్వ. 'ఇక్కడకి వచ్చేముందు వరకు కూడా నా దగ్గర డబ్బులు లేవు.. వైఫ్ కి ఏం కొనలేకపోయేవాడ్ని.. నా కొడుక్కి ఏం కొనలేకపోయా.. 4 నెలలు రెంట్ కట్టలేదు. నా కొడుకు ఫీజు తక్కువయిందని స్కూల్ లో సీట్ రాలేదని' చెప్పుకుంటూ ఏడ్చేశాడు విశ్వ.
 
నామినేషన్ ప్రాసెస్: నామినేషన్ లో ఒక వాల్ ఆఫ్ షేమ్ ని ఎదుర్కోవాల్సి ఉందని చెప్పారు బిగ్ బాస్. లివింగ్ ఏరియాలో ఒక వాల్ ఉంది. ఆ వాల్ మధ్యలో ఒక స్లాట్ ఉంటుంది. ఆ స్లాట్ లో ఒక మార్బుల్ పెట్టి.. దానిపై ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ల పేర్లను స్టాంప్ వేసి.. సుత్తితో పగలగొట్టాల్సి ఉంటుంది. 
  • శ్రీరామచంద్ర - గత వారం గేమ్ లో మానస్ కి తనకు మధ్య డిస్టర్బన్స్ వచ్చిందని.. దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించినా ఆయన వినలేదని.. హేట్రెడ్ పెంచుకున్నాడని తనను నామినేట్ చేశాడు. ఆ తరువాత రవిని నామినేట్ చేశాడు.
  • సిరి - టాస్క్ లో శ్వేతా తనను ఫిజికల్ హర్ట్ చేసిందని రీజన్ చెప్పింది. ఆ తరువాత లహరిని నామినేట్ చేస్తూ.. గేమ్ లో యాక్టివ్ గా ఉండడం లేదని చెప్పింది.
  • సన్నీ - ప్రియాను నామినేట్ చేస్తూ.. 'మీరు అన్న ఆ మాటను తీసుకోలేకపోయాను' అంటూ రీజన్ చెప్పాడు. 'ఏం మాట అన్నాను చెప్పు' అని ప్రియా అడగ్గా.. 'మీకు తెలుసు అది.. నాకు రిపీట్ చేయడం ఇష్టం లేదని' సన్నీ చెప్పగా.. వెటకారంగా చప్పట్లు కొడుతూ 'వాటే సేఫ్ ప్లే..! అంటూ కామెంట్ చేసింది. ఆ తరువాత కాజల్ ను నామినేట్ చేశాడు.
  • నటరాజ్ మాస్టర్ - సిరిని నామినేట్ చేస్తూ.. హౌస్ లో ఉన్నవాళ్లను 'వాడు వీడు అంటుందని' రీజన్ చెప్పాడు. కాజల్ ని నామినేట్ చేస్తూ.. ఆమె 'సెల్ఫిష్' అని అన్నారు.
  • యానీ మాస్టర్ - శ్రీరామచంద్రను, మానస్ లను నామినేట్ చేస్తూ వాళ్లిద్దరూ చాలా స్ట్రాంగ్ అని.. ఫిజికల్ టాస్క్ లలో వాళ్లతో పోటీ పడలేకపోతున్నానని.. వాళ్లు హౌస్ నుంచి వెళ్లిపోతే తనకు ఈజీ అవుతుందని కారణాలు చెప్పింది.
  • యాంకర్ రవి - ముందుగా శ్రీరామచంద్రను నామినేట్ చేశాడు. ఆ తరువాత జెస్సీని నామినేట్ చేస్తూ.. 'ఎన్నిరోజులు చిన్న చెడ్డీలు వేసుకొని ఆ దెబ్బ చూపించి ఇంత మంచి ఫ్లాట్ ఫామ్ ని వేస్ట్ చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది' అంటూ రీజన్ చెప్పాడు. 
  • లహరి - ప్రియాను నామినేట్ చేస్తూ.. అసలు మీరెందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో.. నాకు అర్ధం కావట్లేదు' అని లహరి అనగా.. 'ఎందుకంటే నువ్ హౌస్ లో ఉన్న మగాళ్లతో నువ్ చాలా బిజీగా ఉంటున్నావ్' అని బదులిచ్చింది ప్రియా. 'ఎవరితోనో చెప్తారా..? ప్లీజ్' అని అడిగింది లహరి. దానికి ప్రియా.. 'రవి గారితో బిజీగా ఉన్నావ్.. మానస్ తో బిజీగా ఉన్నావ్..' అని ఆన్సర్ చేసింది. ఆ తరువాత 'నీకు మగాళ్లతో ఎలాంటి సమస్యలు రావని.. విమెన్ తో మాత్రమే సమస్యలుంటాయని' ప్రియా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ తరువాత శ్రీరామచంద్రను నామినేట్ చేసింది.
  • లోబో - ప్రియాంకను నామినేట్ చేస్తూ.. కుకింగ్ మీద ఉన్న ఆసక్తి టాస్క్ లో కూడా ఉండాలంటూ సజెషన్ ఇచ్చాడు. ఆ తరువాత శ్రీరామచంద్రను నామినేట్ చేశాడు.
  • ప్రియాంక సింగ్ - లోబోను నామినేట్ చేసింది. ఆ తరువాత జెస్సీను నామినేట్ చేస్త.. తనతో సరిగ్గా మాట్లాడడం లేదని రీజన్ చెప్పింది.
  • మానస్ - శ్రీరామచంద్రను నామినేట్ చేస్తూ.. నెగెటివ్ గా చూస్తే మొత్తం నెగెటివ్ గానే కనిపిస్తుందని అన్నాడు. ఆ తరువాత రవిని నామినేట్ చేశాడు. 
ప్రియా - లహరిని నామినేట్ చేస్తూ.. హౌస్ లో అమ్మాయిలతో కంటే అబ్బాయిలతోనే ఎక్కువ ఉంటుందని చెబుతుండగా.. 'ఒక నేషనల్ ఛానెల్ లో పదే పదే అదే మాట చెప్పడం కరెక్ట్ కాదంటూ' లహరి మండిపడింది. ఆ తరువాత ప్రియా.. 'లేట్ నైట్ రెస్ట్ రూమ్‌లో రవిని హగ్ చేసుకోవడం నేను చూశాను' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రియా. వెంటనే లహరి.. 'నేను కెమెరా ముందుకు వెళ్లి రవి బ్రో బర్త్ డే ఉంది.. మా ఇంటి నుంచి వైట్ కలర్ షర్ట్ పంపించండి' అంటూ రిక్వెస్ట్ చేశానని.. తనకు, రవికి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ ఉందని బల్లగుద్ది మరీ చెప్పింది లహరి. ఆ తరువాత రవి మండిపడుతూ.. 'నేను సిరితో లహరి కంటే క్లోజ్ గా ఉంటాను. తననొక ఫ్రెండ్ లా, సిస్టర్ లా భావిస్తాను' అని రవి చెప్తుండగా.. వెంటనే ప్రియా.. 'ఇప్పుడు మీరందరి సపోర్ట్ గురించి ఎక్స్పెక్ట్ చేయొద్దు' అని కామెంట్ చేసింది. అలానే 'లహరి సింగిల్ అని.. తను ఏమైనా చేయొచ్చు.. మిగిలిన వాళ్లకు ఫ్యామిలీస్ ఉన్నాయని' రవిని ఉద్దేశిస్తూ చెప్పగా.. దీనికి రవి ఫైర్ అయ్యాడు. 'మీరు రాంగ్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఇవ్వడానికి వీల్లేదు' అంటూ అరిచిచెప్పాడు. అదే సమయంలో లహరి కూడా 'మీకు నా గురించి మాట్లాడే రైట్ లేదు' అంటూ ప్రియాపై మండిపడింది.
 
ఆ తరువాత సన్నీని నామినేట్ చేసింది ప్రియా. ఏదో రీజన్ చెప్తూ ఉండగా.. 'ఒక ఆడపిల్లను అనేముందు ఆలోచించి అనండి. ఒక మనిషి హగ్ చేసుకుంటే బూతు కాదు. ఒక హగ్ రాంగ్ గా ఎలా పోట్రెట్ చేస్తారు' అంటూ మండిపడ్డాడు. వెంటనే రవి ఇన్వాల్వ్ అవుతూ.. 'మీరు చెప్పే విధానం సరిగ్గా లేదని.. ఈ స్టేట్మెంట్ నా కూతురికి అర్ధమైతే ఏం అనుకుంటుంది అది. మీకు పిల్లలు ఉన్నారు' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు రవి. ఆ తరువాత ప్రియా అందరి ముందు మోకాళ్లపై నుంచొని క్షమించని కోరింది. దానికి లహరి-రవి అసలు ఒప్పుకోలేదు. ఈ నామినేషన్ ప్రక్రియ రేపటి ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ కానుంది. 
Published at : 20 Sep 2021 11:07 PM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 anchor ravi Lahari Priya

సంబంధిత కథనాలు

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ - టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ - టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?

Bigg Boss OTT Telugu: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!

Bigg Boss OTT Telugu: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్ - రచ్చ మాములుగా లేదు!

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్ - రచ్చ మాములుగా లేదు!

Anasuya In Bigg Boss: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అనసూయ, పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నటరాజ్ మాస్టర్!

Anasuya In Bigg Boss: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అనసూయ, పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నటరాజ్ మాస్టర్!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం