Bigg Boss 5 Telugu: లహరి మావయ్యగా రవి.. ఫన్నీ టాస్క్ తో నవ్వించే ప్రయత్నం..
బిగ్ బాస్ సీజన్ 5 మూడో వారంలోకి ఎంటర్ అయిపోయింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ఎంత పెద్ద రచ్చ జరిగిందో తెలిసిందే.
బిగ్ బాస్ సీజన్ 5 మూడో వారంలోకి ఎంటర్ అయిపోయింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ఎంత పెద్ద రచ్చ జరిగిందో తెలిసిందే. లహరి-రవి బంధాన్ని తప్పుబడుతూ ప్రియా చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈరోజు కూడా ఆ డిస్కషన్ కంటిన్యూ అవ్వనుంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా ఇప్పటికే వచ్చింది. ఇందులో రవి-లహరి-ప్రియాల మధ్య డిస్కషన్ జరుగుతున్నట్లు కనిపించింది.
Also Read: బిగ్ బాస్ ప్రోమో: నోరుజారిన ఫలితం.. ప్రియాను వెంటాడుతున్న లహరి, రవిల లేట్ నైట్ హగ్!
ఇక ఈరోజు ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ కూడా ఇచ్చారు బిగ్ బాస్. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇంతకీ టాస్క్ పేరేంటంటే.. 'హైదరాబాద్ అమ్మాయ్.. అమెరికా అబ్బాయ్'. ఈ టాస్క్ లో లహరి.. హైదరాబాద్ అమ్మాయిగా, రవి.. అమ్మాయి మావయ్యగా, శ్రీరామ్.. అమెరికా నుంచి తిరిగొచ్చిన అబ్బాయ్ గా, హమీద.. శ్రీరామ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా, షణ్ముఖ్.. మ్యారేజ్ బ్రోకర్ గా నటించబోతున్నారు.
వీరికి ఇచ్చిన రోల్స్ ను సిరి చదువుతూ ఉంటే హౌస్ లో ఉన్నవారంతా పడిపడి నవ్వారు. ఇక తన క్యారెక్టర్ కి తగ్గట్లు.. బొజ్జ వేసుకొని కనిపించారు రవి. ఆ తరువాత సన్నీ-కాజల్ కలిసి పెళ్లి చూపుల్లో ఉన్నట్లు, ఫీల్ అవుతున్న హామీదను.. శ్రీరామ్ ఓదారుస్తున్నట్లు కొన్ని సీన్స్ కనిపించాయి. ఆ తరువాత మానస్.. మ్యారేజ్ బ్రోకర్ అయిన షణ్ముఖ్ దగ్గరకు వెళ్లి.. 'అమ్ము(లహరి)తో తనకు పెళ్లి అవ్వాలని.. దానికి ఎంత డబ్బైనా ఇస్తానని' ఆఫర్ చేస్తాడు. అనంతరం బిగ్ బాస్ రవిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశాన్ని సీక్రెట్ టాస్క్ ద్వారా ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటో.. రవి ఎలా ఆడబోతున్నాడో ఈరోజు ఎపిసోడ్ లో చూడొచ్చు!
Captaincy contender task "Hyderabad ammayi - America abbayi" and Surprise for #Ravi #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/hNtgAYznjB
— starmaa (@StarMaa) September 21, 2021
Also Read: అర్ధరాత్రి రెస్ట్ రూమ్‌లో లహరి, రవి హగ్.. ప్రియా కామెంట్స్‌తో హీటెక్కిన బిగ్ బాస్ హౌస్
Also Read: ‘నాగార్జున’ అనేసి నాలుక కరుచుకున్న సమంత.. ఆ తర్వాత ‘మామ’ అంటూ ట్వీట్, సామ్‌కు ఏమైంది?
Also Read: విశాల్ ఆ ఊపుడేంది? తెలుగు డబ్బింగ్‌పై ఫన్నీ వీడియో వదిలిన హీరో
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.