News
News
X

Manoj Bajpayee On Samantha: ‘ఫ్యామిలీ మ్యాన్’ మనోజ్ బాజ్‌పేయిని భయపెట్టిన సమంత, ఇంతకీ ఏమైంది?

మనోజ్ బాజ్‌పేయి, సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ సమయంలో తను కష్టపడే విధానం భయపెట్టిందన్నారు. అందుకే, మరీ ఎక్కువ కష్టపడకూడదని చెప్పారు.

FOLLOW US: 
Share:

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు పొందారు నటుడు మనోజ్ బాజ్‌పేయి, నటి సమంతా రూత్ ప్రభు. ఇద్దరు కలిసి ఇప్పటి వరకు రెండు సీరీస్ లలో నటించి మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్, సమంత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ (2021) షూటింగ్ సమయంలో సమంత వర్కింగ్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. 

సమంత పని విధానం భయపెట్టేది-మనోజ్ బాజ్‌పేయి

ప్రస్తుతం ‘ఫ్యామిలీ మ్యాన్3’ విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్జే సిద్ధార్థ్ కన్నన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనోజ్ పలు విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సమంతా గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. తను కష్టపడే విధానం తనను చాలా భయపెట్టిందన్నారు. “సమంత షూటింగ్ సమయంలో చాలా కష్టపడుతుంది. ఫిజికల్ గా చాలా శ్రమ పడుతుంది. చూసే మాకే అంత బాధ కలిగితే, తనకు ఎంత బాధ కలుగుతుందో? అందుకే, కాస్త శ్రమ తగ్గించుకోవాలి” అని చెప్పారు. మనోజ్ బాజ్ పేయి సూచన పట్ల సమంత రియాక్ట్ అయ్యింది. “తప్పకుండా ప్రయత్నిస్తాను సర్” అంటూ రీ ట్వీట్ చేసింది. 

టెర్రరిస్ట్ రాజీ పాత్రతో సమంత అద్భుత నటన

“ది ఫ్యామిలీ మ్యాన్”  స్పై థ్రిల్లర్ సిరీస్ ను  ప్రైమ్ వీడియో కోసం రాజ్ నిడిమోరు,  కృష్ణ డికె రూపొందించారు. ఇందులో మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి, శరద్ కేల్కర్, నీరజ్ మాధవ్, షరీబ్ హష్మీ, దలీప్ తాహిల్, సన్నీ హిందూజా, శ్రేయా ధన్వంతరి నటించారు. రెండవ సీజన్‌ “ది ఫ్యామిలీ మ్యాన్2”లో సమంత రాజీ అనే టెర్రరిస్ట్ పాత్రతో నటించింది. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఈ పాత్ర చేసేందుకు తను ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. సీన్లు అద్భుతంగా వచ్చేందుకు తను పడే కష్టం అందరినీ ఆశ్చర్యపరిచేదని మనోజ్ వెల్లడించారు. ‘ఫ్యామిలీ మ్యాన్’  మొదటి సీజన్ 2019లో ప్రసారమైంది. రెండవ సీజన్ 2021లో స్ట్రీమైంది. మూడవ సీజన్ కు సంబంధించిన డేట్ ఇంకా అనౌన్స్ కాలేదు. తొలి సీజన్ లో ఢిల్లీపై ఉగ్రదాడి, రెండో సీజన్ లో ఎల్టీటీఈ ఫైట్ ను చూపించిన ఈ సిరీస్ ఇక ఇప్పుడు మూడో సీజన్ లో ఏం చూపిస్తారనేది ఆసక్తి నెలకొంది.  అయితే ఈ మూడో సీజన్ పై  మనోజ్ బాజ్‌పేయి కీలకమైన అప్‌డేట్ ఇచ్చాడు. “ఈ హోలీకి మీ ఫ్యామిలీ కోసం వస్తున్నాను. నా ఫ్యామిలీని తీసుకొని" అని మనోజ్ వెల్లడించాడు. దీంతో మూడో సిరీస్ హోలికి విడుదల కాబోతోందని అందరూ భావిస్తున్నారు.

Also Read: ముద్దు సీన్లతో షాకిచ్చిన ‘బుట్టబొమ్మ’ స్టార్ అనిఖా సురేంద్రన్, ఆ ట్రైలర్ వైరల్

మనోజ్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం ‘గుల్మోహర్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. రాహుల్ చిట్టెళ్ల దర్శకత్వం వహించిన ఇందులో షర్మిలా ఠాగూర్, అమోల్ పాలేకర్, సిమ్రాన్, సూరజ్ శర్మ, కావేరీ సేథ్ మరియు ఉత్సవి ఝా కూడా నటించారు. మరోవైపు సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.  

Published at : 16 Feb 2023 01:09 PM (IST) Tags: Manoj Bajpayee Samantha Ruth Prabhu The Family man

సంబంధిత కథనాలు

Saindhav: గన్నులు, బుల్లెట్లు, బాంబులతో వస్తున్న వెంకటేష్ ‘సైంధవ్’ - రిలీజ్ డేట్ ఫిక్స్!

Saindhav: గన్నులు, బుల్లెట్లు, బాంబులతో వస్తున్న వెంకటేష్ ‘సైంధవ్’ - రిలీజ్ డేట్ ఫిక్స్!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

Dasara' movie: ‘దసరా’ సినిమా వెనుక 5 ఆసక్తికర విషయాలు, తెలిస్తే మిస్ చేయకుండా చూస్తారు!

Dasara' movie: ‘దసరా’ సినిమా వెనుక 5 ఆసక్తికర విషయాలు, తెలిస్తే మిస్ చేయకుండా చూస్తారు!

Priyanka Chopra: పెళ్లికి ముందే అండాలను దాచిపెట్టాను, అమ్మే అలా చేయమంది: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: పెళ్లికి ముందే అండాలను దాచిపెట్టాను, అమ్మే అలా చేయమంది: ప్రియాంక చోప్రా

Shaakuntalam in 3D: 3Dలో ‘శాకుంతలం’ - ఐమ్యాక్స్‌లో ట్రైలర్ చూసి, ప్రేక్షకులు ఫిదా

Shaakuntalam in 3D: 3Dలో ‘శాకుంతలం’ - ఐమ్యాక్స్‌లో ట్రైలర్ చూసి, ప్రేక్షకులు ఫిదా

టాప్ స్టోరీస్

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం  - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి