By: ABP Desam | Updated at : 13 Feb 2023 10:20 AM (IST)
Edited By: anjibabuchittimalla
Image Credit: Anikha Surendran/Instagram
బాలనటిగా పలు చిత్రాల్లో కనిపించిన అనిఖా సురేంద్రన్ ‘బుట్ట బొమ్మ’తో హీరోయిన్ గా తెలుగులోకి తెరంగేట్రం చేసింది. మలయాళ చిత్రం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అనిఖా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ మలయాళంలో నటించిన సినిమా ‘ఓ మై డార్లింగ్’. ఇందులో అనిఖా ముద్దు సీన్లతో అభిమానులకు షాకిచ్చింది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ లో అనిఖాను చూసి సినీ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.
అనిఖా తాజా మలయాళ చిత్రం ‘ఓ మై డార్లింగ్’ కు సంబంధించి మేకర్స్ ఇటీవల విడుదల చేసిన ట్రైలర్, సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం కలర్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతోంది. ఈ ట్రైలర్‌లో హాట్ హాట్ లిప్ లాక్ సన్నివేశాలు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి. అనిఖా అప్పుడే హాట్ సీన్లలో రెచ్చిపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడే ఇలాంటి సీన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే మున్ముందు ఇంకెలా ఉంటుందో? అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, అనిఖా మాత్రం ఈ ట్రోలింగ్ కు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ ట్రైలర్ బాగా వైరల్ అవుతోంది. అనిఖా ఇటీవలే 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో హీరోయిన్ అవకాశాల కోసం గట్టిగానే ట్రై చేస్తోంది. ఇకపై చెల్లి, కూతురు పాత్రలకు దూరంగా ఉండాలని అనిఖా భావిస్తున్నట్లు టాక్.
ఈ సినిమాకు ఫ్రెడ్ డి శామ్యూల్ దర్శకత్వం వహించాడు. జినీష్ కె జోయ్ హాస్ ఈ చిత్రానికి కథను అందించారు. అన్సార్ షా సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. షాన్ రెహమాన్ సంగీతం అందించాడు. లిజో పాల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మెల్విన్ జి బాబు, ముఖేష్, లీనా, జానీ ఆంటోని, మంజు పిళ్లై, విజయ రాఘవన్, నందు, అర్చన మీనన్, ఫుక్రు, డైన్ డేవిస్, రీతు, మనోజ్ శ్రీకాంత, షాజు శ్రీధర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యాష్ ట్రీ వెంచర్స్ బ్యానర్‌పై మనోజ్ శ్రీకాంత నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 24న థియేటర్లలోకి రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు.
తమిళ టాప్ హీరో అజిత్ కుమార్ నటించిన సినిమాల్లో బాల నటిగా అనిఖా సురేంద్రన్ నటించి మెప్పించింది. ఇప్పుడు తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. హీరోయిన్ గా తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తోంది. తెలుగులో ఈమె తాజాగా నటించిన సినిమా ‘బుట్టబొమ్మ’. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫొర్టీన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ తో కలిసి నిర్మించింది. శౌరి చంద్రశేఖర్, టి రమేష్ కలిసి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే, బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రాణించలేకపోయింది.
Read Also: నా భర్తకు గతంలోనే పెళ్లైంది, విడాకులకు కారణం నేను కాదు: హన్సిక
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్
Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్గా కన్ఫర్మ్!
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్
BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?
Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !