News
News
X

Hansika Motwani: నా భర్తకు గతంలోనే పెళ్లైంది, విడాకులకు కారణం నేను కాదు: హన్సిక

ఆపిల్ బ్యూటీ హన్సిక షాకింగ్ విషయాలు వెల్లడించింది. తన భర్తకు ఇంతకు ముందే పెళ్లైందనే విషయం తెలుసని చెప్పింది. అయితే, ఆ విడాకులకు కారణం తాను కాదని వెల్లడించింది.

FOLLOW US: 
Share:

ఆపిల్ బ్యూటీ హన్సిక గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘దేశముదురు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత పలు సినిమాలతో ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమల్లోనూ నటించి మెప్పించింది. గత ఏడాది డిసెంబరు 4న తన చిన్ననాటి స్నేహితుడు సోహైల్‌ కతురియాను పెళ్లి  చేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది. జైపూర్‌ సమీపంలోని ముందోటా ఫోర్ట్‌ ప్యాలెస్‌ లో జరిగిన ఈ పెళ్లికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

సోహైల్ విడాకులకు నేను కారణం కాదు- హన్సిక

తాజాగా తన భర్తకు సంబంధించిన పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది హన్సిక. వీరి ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలతో ‘లవ్‌ షాదీ డ్రామా’ అనే వీడియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ వీడియోలో హన్సిక సోహైల్ కు ఇదివరకే పెళ్లైన విషయాన్ని వెల్లడించింది. వాస్తవానికి తమ పెళ్లి గురించి ఎలాంటి విషయాలు బయటకు రాకుండా చూడాలి అనుకున్నామని చెప్పింది. అయితే, మీడియా కారణంగా తమ పెళ్లి గురించి బయటికి తెలిసిందన్నారు. సోహైల్ మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోవడానికి తానే కారణమని గతంలో వార్తలు వచ్చాయన్నది. సోహైల్‌ మొదటి పెళ్లిలో నేను పాల్గొన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా మంది విమర్శించారని వెల్లడించింది. కానీ, సోహైల్ విడాకులకు తాను కారణం కాదని చెప్పింది.

నా భర్తకు ముందే పెళ్లైందని తెలుసు-హన్సిక

“వాస్తవానికి సోహైల్ కు గతంలోనే పెళ్లయిందనే విషయం నాకు తెలుసు. వారికి కోర్టు ద్వారా విడాకులు వచ్చాయి. ఆ తర్వాతే మేము పెళ్లి చేసుకున్నాం. అంతేకాదు, గతంలో నేను కూడా ఒకరితో రిలేషన్ షిప్ లో ఉన్నాను. ఈ విషయం అందరికీ తెలుసు. మళ్లీ అలాంటి సంబంధాన్నికొనసాగించాలి అనుకోలేదు. ఇద్దరం ఒకరి గురించి మరొకరం తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నాం. సోహైల్‌ నా జీవితంలోకి వచ్చిన క్షణాలు చాలా స్పెషల్” అని హన్సిక వెల్లడించింది.   

View this post on Instagram
 
A post shared by Disney+ Hotstar Tamil (@disneyplushotstartamil)

ఆ విడాకులకు హన్సిక కారణం కాదు - సోహైల్

అటు తన తొలి పెళ్లి విడాకులకు దారి తీయడానికి హన్సిక కారణం కాదని సోహైల్ తెలిపారు. “2014లో రింకీ బజాజ్‌ను పెళ్లి చేసుకున్నాను. ఆ వివాహ బంధం కొద్ది కాలం మాత్రమే కొనసాగింది” అని సోహైల్ వెల్లడించాడు. రింకీ, సోహైల్‌కి హన్సిక కామన్‌ ఫ్రెండ్‌. అందుకే వీరి పెళ్లికి వెళ్లింది. ఆ పెళ్లి వీడియోలో హన్సిక డ్యాన్స్‌ చేసింది.  ఈ వీడియోను కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేసి, సోహైల్ విడాకులకు కారణం ఆమేనని విమర్శలు వచ్చాయి. అందుకే ‘లవ్‌ షాదీ డ్రామా’ ద్వారా ఈ విషయంపై హన్సిక, సోహైల్‌ క్లారిటీ ఇచ్చారు.  

View this post on Instagram
 
A post shared by Hansika Motwani (@ihansika)

Read Also: మహేష్ బాబు మేకప్ మెన్ తండ్రి కన్నుమూత, ఇంటికెళ్లి పరామర్శించిన నమ్రత

Published at : 12 Feb 2023 02:32 PM (IST) Tags: Hansika Motwani Sohael Khaturiya Sohael Khaturiya first marriage

సంబంధిత కథనాలు

Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్

Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్

NTR30 Shooting : గోవాకు ఎన్టీఆర్ 30 సెకండ్ షెడ్యూల్ - ఎప్పటి నుంచి అంటే?

NTR30 Shooting : గోవాకు ఎన్టీఆర్ 30 సెకండ్ షెడ్యూల్ - ఎప్పటి నుంచి అంటే?

Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ

Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

టాప్ స్టోరీస్

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204

Rahul Gandhi on PM Modi: LICలో డిపాజిట్ చేసిన డబ్బులు అదానీకి ఎలా వెళ్తున్నాయ్ - ప్రధానిని ప్రశ్నించిన రాహుల్

Rahul Gandhi on PM Modi: LICలో డిపాజిట్ చేసిన డబ్బులు అదానీకి ఎలా వెళ్తున్నాయ్ - ప్రధానిని ప్రశ్నించిన రాహుల్