'మిస్టర్ X'లో మంజు వారియర్ - ఫస్ట్ లుక్ చూశారా?
'ఎఫ్‌ఐఆర్' ఫేమ్ మను ఆనంద్ దర్శకత్వం వహించిన 'మిస్టర్ ఎక్స్' లో నటి మంజు వారియర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ మూవీలో ఆర్య, గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Manju Warrier in Mister X : కోలీవుడ్ నటులు ఆర్య, గౌతమ్ కార్తీక్ నటిస్తోన్న 'మిస్టర్ ఎక్స్' చాలా వారాల తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచింది. ఎఫ్‌ఐఆర్ ఫేమ్ మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజా సమాచారం ఏమిటంటే, ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ రాబోయే ఈ స్పై థ్రిల్లర్ 'మిస్టర్ ఎక్స్'లో కీలక పాత్ర పోషించనున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఈ న్యూస్ తెలియజేసిన మూవీ టీం.. దాంతో పాటు ఈ సినిమాలో మంజు వారియర్ కు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మంజు వారియర్ హోమ్లీగా కనిపిస్తోంది. గోధుమ రంగు శారీ, మెరూన్ బ్లౌజ్ లో సన్నని చిరునవ్వుతో ఆకట్టుకుంటోంది.
Elated to announce - @ManjuWarrier4 comes onboard #MrX.
— Prince Pictures (@Prince_Pictures) June 21, 2023
Starring @arya_offl and @Gautham_Karthik.
Directed by @itsmanuanand.@lakku76 @venkatavmedia @dhibuofficial @tanvirmir @rajeevan69 @editor_prasanna @silvastunt @KkIndulal @utharamenon5 @Me_Divyanka @paalpandicinema pic.twitter.com/LqFjCThxZQ
ఇక స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'మిస్టర్ ఎక్స్' ప్రాజెక్టును ప్రిన్స్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ చిత్రానికి దిబు నినాన్ థామస్ సంగీతం అందించారు. తన్వీర్ ఎంఐఆర్ (MIR), ప్రసన్న Gk వరుసగా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. కాగా ఈ సినిమా పలు భాషల్లో 2024లో థియేటర్లలో రిలీజ్ కానుంది.
తమిళనాడులోని కన్యాకుమారిలో జన్మించిన మంజు వారియర్.. మొదట దూరదర్శన్‌లో ప్రసారమైన 'మోహరవం' అనే టెలివిజన్ సీరియల్‌లో కనిపించింది. 17 సంవత్సరాల వయస్సులోనే ఆమె 'సాక్ష్యం' (1995) చిత్రంలో నటించింది. అలా ఒక సంవత్సరం తర్వాత, ఆమె 'సల్లాపం' (1996) చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించింది. అనంతరం దిలీప్‌తో కలిసి నటించింది, ఆ తర్వాత ఆమె అతన్ని వివాహం చేసుకుంది. అలా సినీ రంగంలో ఓ మెరుపు మెరిన మంజు.. 'ఈ పుజయుమ్ కాదన్ను' (1996) చిత్రంలో ఆమె నటనకు గానూ ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. మంజు 'కాళియాట్టం', 'కన్మడం', 'పత్రం' చిత్రాలకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.
దిలీప్‌తో వివాహం తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన మంజు వారియర్.. 15 సంవత్సరాల తర్వాత 2014లో రోషన్ ఆండ్రూస్ తీసిన 'హౌ ఓల్డ్ ఆర్ యు'తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తరువాత జూలై 2013లో, ఆమె అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో నటించింది. ఆ తర్వాత అనేక ప్రకటనలలోనూ తెరపై కనివిందు చేసింది. అదే సంవత్సరం ఆమె 'సల్లాపం' అనే పుస్తకాన్ని కూడా ప్రచురించింది. అనేక భారతీయ సినిమాల్లో మంజు వారియర్ ఎన్నో బలమైన మహిళా పాత్రల్లో నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.
Read Also : Upasana Kamineni News: మీకు తెలుసా? చెర్రీ కంటే ఉపాసనే ధనవంతురాలు - ఆమె ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial