By: ABP Desam | Updated at : 21 Jun 2023 02:49 PM (IST)
తాత ప్రతాపరెడ్డి, భర్త రామ్ చరణ్ తో ఉపాసన(Photo@Upasana Kamineni Konidela/Instagram)
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి మహాలక్ష్మి అడుగు పెట్టింది. నిన్న(మంగళవారం) తెల్లవారుజామున ఉపాసన పండంటి పాపకు జన్మినిచ్చింది. అమ్మాయి రాకతో మెగా స్టార్ ఇంట ఆనందాలు వెల్లువెత్తాయి. పలువురు సినీ ప్రముఖులు, మెగా అభిమానులు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. మనవరాలి రాకతో తాత మెగాస్టార్ చిరంజీవి ఆనందంలో తేలియాడారు. హాస్పిటల్ కు వెళ్లి ముద్దుల మనువరాలిని చూసి మురిసిపోయారు. చెర్రీ దంపతులకు పాప పుట్టడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. తమ ఫ్యామిలీకి ఎంతో ఇష్టమైన రోజే మనవరాలు జన్మించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
2012లో ఉపాసనను, రామ్ చరణ్ పెట్టి చేసుకున్నారు. ఇద్దరు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఈ దంపతులు రీసెంట్ గానే తమ 11వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. తాజాగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. ఈ నేపథ్యంలో ఉపాసనతో బిజినెస్ వ్యవహారుల, నికర ఆస్తుల విలువ సహా పలు కీలక విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఉపాసన కామినేని, రామ్ చరణ్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ.2500 కోట్లు. ఉపాసన సక్సెస్ ఫుల్ బిజినెస్ వుమెన్ గా కొనసాగుతోంది. ఆమె స్వంత నికర ఆస్తుల విలువ రూ. 1,130 కోట్లు. అదే సమయంలో, రామ్ చరణ్ నికర ఆస్తుల విలువ రూ.1,370 కోట్లు. ఉపాసన కామినేని అతిపెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి. ఉపాసన వ్యాపార దిగ్గజం సి ప్రతాప్ రెడ్డి మనువరాలు. ప్రతాపరెడ్డి ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన నికర ఆస్తుల విలువ రూ.21,000 కోట్లు. భారతదేశంలోని 100 మంది బిలియనీర్లలో ఆయన కూడా ఒకరు. అపోలో హాస్పిటల్స్ మార్కెట్ వ్యాల్యూ రూ.70,000 కోట్లు. ఉపాసన తల్లిదండ్రులు అనిల్ కామినేని, శోభన కామినేని. అనిల్ 9 కంపెనీలలో భాగస్వామిగా ఉన్నారు. శోభన.. అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఉపాసన అపోలో హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు.
ఇక ఉపాసన విద్యాభ్యాసం విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో పట్టా అందుకుంది. ఆమె చదువు పూర్తయిన తర్వాత వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. ఉపాసన అపోలో హాస్పిటల్స్ లో ఉన్నత పదవితో పాటు, 'బి పాజిటివ్' అనే మ్యాగజైన్‌కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా కొనసాగుతున్నారు. ఉపాసన కామినేని కుటుంబ ఆరోగ్య పథకం బీమా కంపెనీ అయిన TPA మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ఉపాసన తండ్రి అనిల్ కామినేని KEI గ్రూప్ వ్యవస్థాపకుడు.
వాస్తవానికి ఉపాసన వ్యాపార రంగంలోకి రాకముందు ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకుంది. ఇందుకోసం కావాల్సిన స్టడీ కూడా పూర్తి చేసింది. కానీ, ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది. చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో జనరల్ మేనేజర్‌గా చేరింది. ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరింది. ఉపాసన తన స్వచ్ఛంద ద్వారా పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతోంది.
Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!
The Goat Life Release Date: ఎడారి దేశంలో భారతీయ కూలీ కష్టాలు - మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సినిమా విడుదలకు రెడీ!
ఫ్రీగా ‘సలార్’ టికెట్లు, ‘కాలింగ్ సహస్ర’కు థియేటర్ల కరువు - నేటి టాప్ సినీ విశేషాలివే!
Allu Arjun: విడివిడిగా ఓటు వేసిన అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ - వేర్వేరుగా వెళ్లడంతో...
Allu Arjun: అభిమాని కోసం బన్నీ సెల్ఫీ వీడియో - 30 వేల ఫాలోవర్లు టార్గెట్!
Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!
Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్
Best Bikes Under Rs 1 lakh: రూ.లక్షలోపు బెస్ట్ బైకులు - బడ్జెట్ ధరలో డబ్బులకు న్యాయం!
Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్
/body>