అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Mohan Babu Home Tour: ఇంద్ర భవనం కాదు మోహన్ బాబు ఇల్లు.. మంచు లక్ష్మి హోమ్ టూర్ వీడియో వైరల్

మంచు లక్ష్మి శంషాబాద్‌లోని తన తండ్రి ఇంటిలో హోమ్ టూర్ చేసింది. ఈ వీడియో చూస్తే.. తప్పకుండా మంచు ఫ్యామిలీకి ఫ్యాన్స్ అయిపోతారు.

ష్టాన్ని నమ్ముకుంటే ఎప్పటికైనా విజయం వరిస్తుందని చెప్పేందుకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబే నిదర్శనం. మనిషి కటువుగా కనిపించినా.. ఆయన మనస్సు మాత్రం ‘మంచు’ అని ఆయన అభిమానులు, సన్నిహితులు అంటారు. మోహన్ బాబు కేవలం నటుడు మాత్రమే కాదు. ఒక సక్సెస్ ఫుల్ నిర్మాత కూడా. ఆయన తీసిన చిత్రాలెన్నో బాక్సాఫీసు వద్దు కలెక్షన్ల వర్షం కురిపించాయి. అలాగే.. ఆయన హీరోగా నటించిన చిత్రాలు ఏ రోజూ నిర్మాతలను నిరాశ పరచలేదు. అదే ఆయనకు ‘కలెక్షన్ కింగ్’ అనే పేరు తెచ్చింది. శ్రమను నమ్ముకున్న మోహన్ బాబు.. తన కాళ్లపై తాను నిలబడి.. తన పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇచ్చారు. ఇన్నాళ్లు మోహన్ బాబు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లోనే ఉండేవారు. అయితే, ఇప్పుడు ఆయన శంషాబాద్‌లోని విశాలమైన ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఇప్పటివరకు ఆ ఇల్లు ఎలా ఉందనేది ఎవరికీ తెలియదు. తాజాగా ఆయన కుమార్తె మంచు లక్ష్మి.. మోహన్ బాబు ఇంటిని తన యూట్యూబ్ చానెల్‌లో చూపించారు. ఈ హోమ్ టూర్ వీడియో యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండవ్వుతోంది.

కొత్త ఇంటి గురించి మంచు లక్ష్మి చెబుతూ.. మోహన్‌బాబుకు ఇది 6వ ఇల్లు అని తెలిపారు. చెన్నైలో రెండు ఇల్లు, తిరుపతిలో రెండు, హైదరాబాద్‌లో ఈ కొత్త ఇంటితో కలిపి రెండు ఇళ్లు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం పంపిన పువ్వు కలిగిన కొబ్బరి కాయలను కూడా లక్ష్మీ చూపించారు. ఆ తర్వాత ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీ.. హాల్‌లో ఉన్న తమ ఫ్యామిలీ, మోహన్ బాబు ఫొటోలను చూపించారు. ఆ తర్వాత గోడలపైన అందమైన పెయింటింగ్స్.. మోహన్ బాబు బార్ రూమ్.. సిట్టింగ్ ఏరియా, డైనింగ్ టేబుల్ లక్ష్మీ చూపించారు. ఆ తర్వాత కిచెన్‌లోకి వెళ్లి.. విష్ణు ఎక్కువగా వంటలు చేస్తుంటారని తెలిపారు. డైనింగ్ ఏరియా నుంచి చెట్లను చూడటమంటే మోహన్‌బాబుకు ఇష్టమని లక్ష్మీ పేర్కొన్నారు. 

ఈ ఇంటికి వస్తే.. సిటీలో ఉన్న ఫీలింగే కలగదు. చెట్లు ఎక్కువగా ఉండే ప్లేస్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ తర్వాత పిల్లలు ఆడుకొనే టాయ్ రూమ్, డ్యాన్స్ ఫ్లోర్, మోహన్ బాబుకు లభించిన అవార్డులను ఈ వీడియోలో చూడవచ్చు. థియేటర్ రూమ్‌ను చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. దాదాపు 35 ఎం.ఎం సైజ్ స్క్రీన్‌.. సోఫాలతో భలే ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లోని సోనా (హాట్ రూమ్), స్టీమ్ రూమ్ కూడా ఉన్నాయి. విష్ణు పంపిన లాస్ట్ టెలిగ్రామ్‌ను ప్రత్యేకంగా ఫ్రేమ్ చేయించారు. సెకండ్ ఫ్లోర్‌లో మోహన్ బాబు ఉండే ఏరియాను చూస్తే ఫిదా అవుతారు. ఇంటిపైన ఇన్ఫినిటీ పూల్ కూడా ఉంది. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్‌లోని పూజ గదిని చూపించింది. గార్డెన్ ఏరియాలో కూరగాయల పంటలు, విష్ణు జిమ్‌ను లక్ష్మీ చూపించారు. చివరిగా.. మోహన్ బాబు గురించి చెబుతూ.. ‘‘మా నాన్నగారు.. చిన్న మారుమూల గ్రామం మోదుగుల నుంచి ఏదో సాధించాలి. లైఫ్‌లో ఏదో ఒకటి చేయాలని ఆయన విలేజ్ నుంచి బయటకు వచ్చి. ఈ స్థాయికి చేరారు. నాకు అద్భుతమైన లైఫ్, ఎడ్యుకేషన్, పేరు, ప్రఖ్యాత అన్నీ ఇచ్చారు నాకు. ఆయన్ని నేను ఇంక ఆయన్ని ఏమీ అడగలేను. ఆయన ఇచ్చినది. ఆయన విలేజ్‌లో చాలామందికి మేలు చేశారు. వంతెన కట్టారు. మీలో ఒక్కరు స్ఫూర్తి పొందినా.. నేను గొప్పగా ఫీలవుతాను. స్వయంకృషితో పనిచేస్తే సక్సెస్ తప్పకుండా వస్తుంది’’ అని మంచు లక్ష్మి చెప్పిన మంచి మాటలకు కూడా నెటిజనులు ఫిదా అవుతున్నారు.

Mohan Babu Home Tour Video: 

Also Read: ప్రేమలో కళ్లు మూసుకుపోయాయ్... కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ లాస్య
Also Read: యువరానర్... వీళ్లే ఈ ఏడాది ఆన్-స్క్రీన్ లాయర్స్!
Also Read: నాలుగు గోడల మధ్య జరిగేది... నచ్చేలా చూపించారు... 2021లో బోల్డ్ అటెంప్ట్స్!
Also Read: కాలర్ ఎగరేసిన కమర్షియల్ సినిమా... దుమ్ము దులిపేసిన స్టార్స్!
Also Read: ప్రేమ‌క‌థ ప్లేస్‌లో 'ఆర్ఆర్ఆర్' ఎలా వ‌చ్చింది? రాజ‌మౌళి వైఫ్ చేసిందేమిటి?
Also Read: సామాన్యుడికి దూరంగా తెలుగు హీరో!? మనలో ఒకడిగా కనిపించలేరా!?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Weather Update Today:తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత - వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత - వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Embed widget