By: ABP Desam | Updated at : 07 Jun 2023 10:38 PM (IST)
మహేంద్ర సింగ్ ధోని నిర్మిస్తున్న ఎల్జీయం టీజర్ విడుదల అయింది.
Lets Get Married Teaser: ప్రముఖ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సినిమా నిర్మాణంలోకి దిగిన సంగతి తెలిసిందే. ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ‘LGM (Let's Get Married)’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్‌పై ఇదే మొదటి సినిమా. ‘జెర్సీ’ ఫేం హరీష్ కళ్యాణ్, ‘లవ్ టుడే’ ఫేం ఇవానా జంటగా నటించిన ఈ సినిమాకు రమేష్ తమిళ్‌మణి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ‘ఎల్జీయం’ టీజర్‌ను ఇప్పుడు యూట్యూబ్‌లో విడుదల చేశారు.
ఒక ప్రేమ జంటకు వచ్చిన సమస్య నేపథ్యంలో ఈ సినిమా కొనసాగనుందని తెలుస్తుంది. కానీ అసలు కథేంటి అన్నది మాత్రం ఏమీ రివీల్ చేయలేదు. కొన్ని ఫన్ డైలాగ్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ మాత్రం చూపించారు. నాగచైతన్యతో ‘కస్టడీ’ సినిమా తీసిన వెంకట్ ప్రభు కూడా ఈ సినిమాలో నటించారు. ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ అని వెంకట్ ప్రభు డైలాగ్ చెప్తారు. దీన్ని బట్టి ఆయనది కొంచెం పెద్ద పాత్రే అనుకోవచ్చు. నదియా, వీటీవీ గణేష్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాలు ఎలా ఉండాలి అనుకుంటున్నారో ధోని సతీమణి సాక్షి ఇప్పటికే వెల్లడించారు. మంచి కథల ద్వారా దేశం నలుమూలలో వున్న ప్రేక్షకులకు చేరువవ్వడమే ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ లక్ష్యమని తెలిపారు. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే ‘ఎల్‌జీఎం’ సినిమా రూపొందుతోందని సాక్షి వివరించారు.
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కామెడీ, కుటుంబ కథాచిత్రంగా ‘LGM (Let's Get Married)’ తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటిస్తున్న యోగిబాబుకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యేకమైన బహుమతిని అందించారు. ధోని సంతకం చేసిన బ్యాట్ ను ప్రత్యేకంగా యోగిబాబుకు పంపించారు. ఆ బ్యాట్ ను పట్టుకుని యోగిబాబు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
యోగి బాబుకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. తీరిక దొరికినప్పుడల్లా ఆయన క్రికెట్ ఆడుతూ కనిపిస్తుంటారు. మూవీ లొకేషన్లలోనూ అప్పుడప్పుడు బ్యాట్ పట్టుకుని దర్శనమిస్తుంటారు. యోగి క్రికెట్ ఆడుతున్న వీడియోలు అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుంటాయి.
We are thrilled to share the teaser of #LGM- a fun filled entertainer to warm your hearts.
— Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) June 7, 2023
Coming to cinemas soon!https://t.co/F1oA65cAVJ pic.twitter.com/83o60KLzoZ
#LGMteaser to be launched tomorrow, 7th June, by Namma Thala @msdhoni on his Facebook handle and @SaakshiSRawat on Instagram.
— Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) June 6, 2023
Stay tuned for a sneak peak of our #LGM journey! pic.twitter.com/kFXhJ0xetY
Chandramukhi 2: ‘చంద్రముఖి 2‘ విడుదలకు ముందు రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న రాఘవా లారెన్స్
Prema Entha Madhuram September 26th: ఆర్య సహాయంతో ఉట్టిని కొట్టిన అక్కి - అనుని చూసిన ఆర్య!
Gruhalakshmi September 26th: విక్రమ్-జానూ వేషాలు, దివ్య ఫైర్, తులసికి రత్నప్రభ స్వీట్ వార్నింగ్!
Trinayani September 26th: సలహా వినకుండా సమస్యలో చిక్కుకున్న సుమన, కౌంటర్ ఇచ్చిన విక్రాంత్!
Krishna Mukunda Murari September 26th: ముకుందకి చుక్కలు చూపిస్తున్న కృష్ణ- కొడుకు మీద చెయ్యెత్తిన రేవతి!
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు
Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా
/body>