News
News
X

HariHara Veeramallu: 'నవరాత్రులలో నవ ఉత్తేజం' - పవన్ లుక్ అదిరిపోయింది!

'హరిహర వీరమల్లు' సినిమాకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లుగా దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ట్వీట్ చూస్తుంటే అర్ధమవుతుంది.  

FOLLOW US: 
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్(Krish) 'హరిహర వీరమల్లు'(HariHara VeeraMallu) అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల కమిట్మెంట్స్ తో సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వస్తోంది. మొన్నామధ్య క్రిష్ తో కలిసి స్టోరీ డిస్కషన్స్ లో కూర్చున్నారు పవన్. దానికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకొచ్చాయి. ఆ తరువాత మళ్లీ షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. 

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లుగా దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ట్వీట్ చూస్తుంటే అర్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ తో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేసిన కీరవాణి.. 'నవరాత్రులలో నవ ఉత్తేజం' అంటూ పోస్ట్ పెట్టారు. వారి పక్కన ఉన్న బ్యానర్ లో హరిహర వీరమల్లు -షెడ్యూల్ వర్క్‌షాప్ అని రాసి ఉంది. అంటే షూటింగ్ కి వెళ్లబోయే ముందు చేసే రిహార్సల్స్ అన్నమాట. 

అయితే ఇది షూటింగ్ కు సంబంధించిందా..? లేక మ్యూజిక్ రిలేటెడా..? అనేది తెలియడం లేదు. సాధారణంగా అయితే పవన్ ఇలా వర్క్ షాప్స్ లో పెద్దగా కనిపించరు. కానీ ఈ సినిమా విషయంలో ఎక్ట్రా కేర్ తీసుకున్నారు. ఇక ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సన్నగా ఎంతో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. దీంతో ఈ పిక్ తెగ వైరల్ అవుతోంది.

 ఇక 'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Aggerwal) కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి(Nargis Fakri) కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్(Megaproductions) పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ  భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

News Reels

సినిమా రిలీజ్ అప్డేట్:
మొదట ఈ దసరాకి సినిమా వస్తుందన్నారు. ఆ తరువాత 2023 సంక్రాంతికి విడుదలయ్యే ఛాన్స్ ఉందన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను 2023 మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం(AM Ratnam) రిలీజ్ డేట్ విషయాన్ని బయటపెట్టారు.

ఈ సినిమాతో పాటు తమిళ సినిమా 'వినోదయ సీతమ్'(Vinodhaya Sitham) రీమేక్ లో నటించడానికి పవన్ అంగీకరించారు. సముద్రఖని(Samuthirakani) ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో పవన్ తో పాటు సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) కూడా నటించనున్నారు. మూడు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని పవన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. 

Also Read : 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?

Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?

Published at : 30 Sep 2022 02:39 PM (IST) Tags: keeravani Pawan Kalyan Harihara veeramallu Harihara Veeramallu Movie

సంబంధిత కథనాలు

Gruhalakshmi December 5th: కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోయిన సామ్రాట్- బేరాలు ఆడటంలో మాస్టర్స్ చేసిన తులసి

Gruhalakshmi December 5th: కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోయిన సామ్రాట్- బేరాలు ఆడటంలో మాస్టర్స్ చేసిన తులసి

Guppedantha Manasu December 5th: ఇగో మాస్టర్ నిజంగా జెంటిల్మెన్, గౌతమ్ కి థాంక్స్ చెప్పిన రిషి - వసుధారని ఇరికించేందుకు చూసిన దేవయాని

Guppedantha Manasu December 5th: ఇగో మాస్టర్ నిజంగా జెంటిల్మెన్, గౌతమ్ కి థాంక్స్ చెప్పిన రిషి - వసుధారని ఇరికించేందుకు చూసిన దేవయాని

Hansika-Sohail Wedding: అట్టహాసంగా హన్సిక వివాహ వేడుక, సోహెల్‌తో ఏడడుగులు

Hansika-Sohail Wedding: అట్టహాసంగా హన్సిక వివాహ వేడుక, సోహెల్‌తో ఏడడుగులు

Karthika Deepam December 5th: మోనిత అరెస్ట్ సంగతి తెలుసుకున్న కార్తీక్- దీప రిపోర్ట్స్ చూసి షాకైన డాక్టర్

Karthika Deepam December 5th: మోనిత అరెస్ట్ సంగతి తెలుసుకున్న కార్తీక్- దీప రిపోర్ట్స్ చూసి షాకైన డాక్టర్

Ennenno Janmalabandham December 5th: రొమాంటిక్ గా డాన్స్ చేసిన క్యూట్ కపుల్- యాక్సిడెంట్ గురించి అసలు నిజం తెలుసుకున్న వేద

Ennenno Janmalabandham December 5th: రొమాంటిక్ గా డాన్స్ చేసిన క్యూట్ కపుల్- యాక్సిడెంట్ గురించి అసలు నిజం తెలుసుకున్న వేద

టాప్ స్టోరీస్

Gujarat Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన ప్రధాని మోదీ

Gujarat Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన ప్రధాని మోదీ

వార్డెన్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి- పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

వార్డెన్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి- పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు అయ్యప్ప భక్తులు మృతి, 15 మందికి గాయాలు

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు అయ్యప్ప భక్తులు మృతి, 15 మందికి గాయాలు

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !