News
News
X

Mega154: నెక్స్ట్ బ్లాక్‌బస్టర్‌ లోడింగ్ - 'రౌడీ అల్లుడు' రేంజ్‌లో చిరు సినిమా!

చిరంజీవి 154 సినిమా గురించి చిరు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

FOLLOW US: 
 
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), దర్శకుడు బాబీ(Bobby) కాంబినేషన్ ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే మరికొంతమంది స్టార్స్ ను తీసుకున్నారు. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నారు. 

'రౌడీ అల్లుడు' రేంజ్‌లో చిరు సినిమా:

రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'గాడ్ ఫాదర్' సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో బాబీ డైరెక్ట్ చేస్తోన్న మెగా154 సినిమా గురించి చిరు మాట్లాడారు. నెక్స్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చేది బాబీనే అని.. 'గాడ్ ఫాదర్' సినిమా ఎంత కంపోజ్డ్ గా, కళతో ఉందో.. మెగా154 సినిమా అంత అల్లరిగా ఉంటుందని అన్నారు. ఆ సినిమా కోసం బాబీ తన కాళ్లకు బాగా పని చెప్పారని.. తన నుంచి ఆడియన్స్ కోరుకునే అంశాలతో 'రౌడీఅల్లుడు' లాంటి అల్లరి సినిమా అవుతుందని చిరు అన్నారు. 

ఆ తరువాత మెహర్ రమేష్ సినిమా కూడా పవర్ ఫుల్ సెంటిమెంట్, యాక్షన్ ప్యాక్డ్ గా ఉంటుందని.. వీరిద్దరి(బాబీ, మెహర్ రమేష్) దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' లాంటి సక్సెస్ లు కనిపిస్తున్నాయని చిరు అన్నారు. చిరు మాటలు విన్న ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. 

News Reels

బాబీ డైరెక్ట్ చేస్తోన్న 'మెగా154' చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. పూర్తి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. తెరపై చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.  

ఈ సినిమా కోసం పాటలు పూర్తి చేశారట దేవిశ్రీప్రసాద్. మొత్తం నాలుగు మాస్ సాంగ్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి సినిమాల్లో మాస్ సాంగ్స్ తో పాటు మెలోడీస్ కూడా ఉంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం మెలోడీకి చోటు లేదట. కథ ప్రకారం.. నాలుగు పాటలు ఉంటే.. నాలుగూ కూడా మాస్ సాంగ్స్ అని తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ చాలా బాగా వచ్చిందని చెబుతున్నారు. రవితేజ, చిరంజీవి కాంబినేషన్ లో కూడా ఓ పాట ఉంటుందట. అన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ నటుడు బిజూ మీనన్ ను విలన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ దాదాపు ఫైనల్ చేసినట్లే. 

Also Read: 'మెగా' ఆవేదన - చిరంజీవి పనైపోయిందని ప్రచారం చేసింది ఎవరు?

Also Read: 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లోనూ గరికపాటి గొడవ - మెగా ఫ్యాన్స్ ఫైర్

Published at : 10 Oct 2022 05:42 PM (IST) Tags: Bobby God Father Mega154 Chiranjeevi

సంబంధిత కథనాలు

Pawan Kalyan Next Movie: గ్యాంగ్‌స్టర్‌గా పవన్, జపనీస్ లైన్ అర్థం ఏమిటో తెలుసా? పోస్టర్‌లో హింట్స్ గమనించారా?

Pawan Kalyan Next Movie: గ్యాంగ్‌స్టర్‌గా పవన్, జపనీస్ లైన్ అర్థం ఏమిటో తెలుసా? పోస్టర్‌లో హింట్స్ గమనించారా?

Samantha: ఆమె మహానటి అంటూ టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల ప్రశంసలు, సమంత స్పందన ఇది

Samantha: ఆమె మహానటి అంటూ టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల ప్రశంసలు, సమంత స్పందన ఇది

Prabhas Movie : ఐదు 'కాంతార'లు తీయొచ్చు - ప్రభాస్, మారుతి మూవీ వీఎఫ్ఎక్స్ బడ్జెట్‌తో!

Prabhas Movie : ఐదు 'కాంతార'లు తీయొచ్చు -  ప్రభాస్, మారుతి మూవీ వీఎఫ్ఎక్స్ బడ్జెట్‌తో!

RRR Box Office Japan: జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్‘ వసూళ్ల సునామీ, రజనీకాంత్ ‘ముత్తు‘ రికార్డును చిత్తు చేసేనా?

RRR Box Office Japan: జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్‘ వసూళ్ల సునామీ, రజనీకాంత్ ‘ముత్తు‘ రికార్డును చిత్తు చేసేనా?

Veera Simha Reddy : తమన్‌కు టార్గెట్ ఫిక్స్ చేసిన బాలకృష్ణ ఫ్యాన్స్ - బాక్సులు పగిలిపోవాలంతే

Veera Simha Reddy : తమన్‌కు టార్గెట్ ఫిక్స్ చేసిన బాలకృష్ణ ఫ్యాన్స్ - బాక్సులు పగిలిపోవాలంతే

టాప్ స్టోరీస్

CM KCR : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్, బహిరంగ సభలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

CM KCR : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్, బహిరంగ సభలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

Iran Hijab Protest: హిజాబ్‌ చట్టాన్ని రివ్యూ చేస్తున్నాం, త్వరలోనే మార్పులు - ఇరాన్ అటార్నీ జనరల్

Iran Hijab Protest: హిజాబ్‌ చట్టాన్ని రివ్యూ చేస్తున్నాం, త్వరలోనే మార్పులు - ఇరాన్ అటార్నీ జనరల్

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!