By: ABP Desam | Updated at : 15 Feb 2023 09:13 AM (IST)
'ఐరన్ మ్యాన్'గా రాబర్ట్... 'కాంగ్ ది కాంకరర్'గా జోనాథన్ మేజర్స్
అవెంజర్స్ సినిమాలకు ఎందరు అభిమానులు ఉన్నారో... మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన సినిమాల్లో 'ఐరన్ మ్యాన్' (Iron Man) కు అంత మంది అభిమానులు ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. టోనీ స్టార్క్ / 'ఐరన్ మ్యాన్'గా నటించిన రాబర్ట్ డౌనీ జూనియర్ (Robert Downey Jr) కూడా అంతే మంచి అభిమానులు సొంతం చేసుకున్నారు. లేటెస్ట్ హాలీవుడ్ బజ్ ఏంటంటే... ఫిబ్రవరి 17న 'ఐరన్ మ్యాన్' ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడట!
'యాంట్ మ్యాన్ 3'లో 'ఐరన్ మ్యాన్'?
ఫిబ్రవరి 17... ఈ శుక్రవారం 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా' (Ant-Man and the Wasp : Quantumania) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో 'ఐరన్ మ్యాన్'గా రాబర్ట్ డౌనీ జూనియర్ కనిపిస్తారట. 'యాంట్ మ్యాన్' టైటిల్ పాత్రలో పాల్ రూడ్ నటించారు. స్కాట్ లాంగ్‌గానూ ఆయన కనిపించనున్నారు. హోప్ వాన్ డీన్, వాస్ప్ పాత్రలో ఎవాంజలీన్ లీ నటించారు. విలన్ కింగ్ ది కాంకరర్ పాత్రలో నటించిన జోనాథన్ మేజర్స్ (Jonathan Majors) నటించారు.
'యాంట్ మ్యాన్ 3'లో పాల్ రూడ్, జోనాథన్ మేజర్స్ క్యారెక్టర్స్ మధ్య యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి. అప్పుడు 'యాంట్ మ్యాన్'కు సహాయం చేయడానికి 'ఐరన్ మ్యాన్' గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారని టాక్.
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో 31వ సినిమా 'యాంట్ మ్యాన్ 3'. ఇందులో 'ఐరన్ మ్యాన్'గా రాబర్ట్ నటించాడని వార్తలు రావడానికి రీజన్ ఏంటంటే... విలన్ కింగ్ ది కాంకరర్ పాత్ర ఉంది కదా! ఆ రోల్ చేసిన జోనాథన్ మేజర్స్ తనకు 'ఐరన్ మ్యాన్' ఇన్స్పిరేషన్ అని చెబుతున్నాడు. అంతే కాదు... 'ఐరన్ మ్యాన్'తో పోటీ పడాలని, ఫైట్ చేయాలని ఉందని వెల్లడించారు. ఏమో? ఎక్కడి నుంచి అయినా సరే ఐరన్ మ్యాన్ రావచ్చని చెబుతున్నారు. దాంతో హాలీవుడ్ జనాలకు కొత్త అనుమానాలు వస్తున్నాయి.
'అవెంజర్స్ : ది కాంగ్ డైనాస్టీ', 'అవెంజర్స్ : సీక్రెట్ వార్స్'లో కాంగ్ ది కాంకరర్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ సినిమాల్లో కూడా 'ఐరన్ మ్యాన్' క్యారెక్టర్ ఉండొచ్చట.
Also Read : ప్రేమికుల రోజున స్టార్ హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారంటే?
'యాంట్ మ్యాన్', 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్' తర్వాత ఆ సిరీస్‌లో వస్తున్న సినిమా . ఈ శుక్రవారమే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అమెరికాతో పాటు ఇండియాలో ఒకే రోజు విడుదల అవుతోంది. ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి భారతీయ ప్రేక్షకులు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాంతో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బావున్నాయి. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ థియేటర్లలో సేల్ అయిన టికెట్స్ నంబర్ చూస్తే ఎవరైనా సరే ఆ విషయాన్ని ఈజీగా చెబుతారు.
పీవీఆర్, సినీ పోలీస్, ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లలో ఫిబ్రవరి 17న బుకింగ్స్ చూస్తే... 'యాంట్ మ్యాన్ 3' టికెట్స్ 43,907 సేల్ అయ్యాయి. ఇది మంగళవారం ఉదయానికి! రోజు రోజుకూ బుకింగ్స్ పెరుగుతున్నాయి. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారతీయ ప్రేక్షకుల ముందుకు 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా' వస్తోంది.
Also Read : స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?
Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్
Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ
NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్
Dasara Movie Controversy : వివాదంలో ‘దసరా’ మూవీ, ఆ సీన్లు తొలగించాలంటూ అంగన్ వాడీల ఆందోళన
Sai Dharam Tej On Accident : మాట విలువ తెలిసింది... ప్రమాదం ఓ పీడకల కాదు, అదొక స్వీట్ మెమరీ - సాయి ధరమ్ తేజ్
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం
IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు