Krishna Mukunda Murari July 8th: మురారీకి ఊహించని షాక్- ముకుంద ప్రేమించింది ఎవరినో కనుక్కోమన్న భవానీ దేవి
కృష్ణ కూడా మురారీని ప్రేమిస్తుందని ముకుందకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
చాలా రోజుల తర్వాత భవానీ దేవి ఇంటికి వస్తుంది. తనని చూసి ఇంట్లో వాళ్ళందరూ సంతోషిస్తారు. ముకుంద ఎక్కడని రేవతిని భవానీ అడుగుతుంది. నేను గెస్ చేసింది కరెక్ట్ అయితే పెద్దత్తయ్య తనకే సపోర్ట్ చేసి మాట్లాడుతుందని అనుకుని మొహం బాధగా పెట్టుకుని గదిలో నుంచి ముకుంద కిందకి వస్తుంది. తనని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అర్థంఅయ్యింది ఒంటరితనంతో నువ్వు ఎంత కుమిలిపోతున్నావో ఇక నేను వచ్చాను కదా భవానీ దేవి భరోసా ఇస్తుంది. ఇక నుంచి కథ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుందని మధుకర్ మనసులో అనుకుంటాడు. మురారీ, కృష్ణ ఇద్దరూ ఒకేసారి ఇంటికి వస్తారు. ఎక్కడికి వెళ్లావని మురారీ అడిగితే గీతికని కలిసి వస్తున్నానని అనేసరికి షాక్ అవుతాడు. గీతికని ఎందుకు కలిశావని అడిగితే సమాధానం మాత్రం చెప్పదు.
Also Read: కావ్య మీద బెట్టుతో కూడిన ప్రేమ చూపించిన రాజ్- అప్పుని విడిపించిన కళ్యాణ్
మురారీ వాళ్ళు ఇంట్లోకి రాగానే భవానీని చూసి సంతోషంగా పలకరించి ఆశీర్వాదం తీసుకోబోతుంటే ఆగమని అంటుంది. నేను ఆశ్రమానికి వెళ్లేటప్పుడు ఏం చెప్పాను. నువ్వు ఏం చేస్తున్నావ్? అసలు ఏం జరుగుతోంది ఈ ఇంట్లో.. ఉమ్మడి కుటుంబం అంటే ఒకరి కష్టాలు మరొకరు పంచుకోవడం అంతే కానీ ఎవరి గదుల్లో వాళ్ళు ఉండటం కాదని అంటుంది. ఈ ఇంటి కోడలితో కంట తడి పెట్టించకూడదు అది కుటుంబానికి అరిష్టం. ఏం చేస్తే తన కళ్ళలో ఆనందం చూడగలమో తెలుసు. అది వదిలేసి నువ్వు ఈ తింగరి పిల్ల కలిసి ఫామ్ హౌస్, రెస్టారెంట్లు అని తిరుగుతున్నారు. ఇదేనా నీ బాధ్యత. తన గోడు ఈ ఇంట్లో ఎవరికీ పట్టదా? అని నిలదీస్తుంది. ఆదర్శ్ ని వెతకడానికి టీం ని ఏర్పాటు చేశానని మురారీ చెప్తాడు. సందు దొరికింది కదా అని ముకుంద ఏడుస్తూ భవానీని కౌగలించుకుంటుంది. అది చూసి కృష్ణ అయ్యో పాపం అనుకుంటుంది.
Also Read: మాళవిక తొలి విజయం- హాల్లోకి చేరిన యష్ పెళ్లి ఫోటో, మౌనంగా చూస్తూ ఉండిపోయిన వేద
ముకుంద ఏడుస్తుంటే అందరూ ఓదారుస్తారు. వాళ్ళ అమ్మకి బాగోలేదని తెలిసినప్పటి నుంచి డల్ గానే ఉంటుందని ప్రసాద్ చెప్తాడు. అమ్మకి ఏమి కాదు తనకి ఏం కాదని ధైర్యం చెప్తుంది. ఇంకెప్పుడూ నీ కళ్ళలో కన్నీళ్ళు చూడకూడదు. నీకు నేనున్నానని భవానీ దేవి భరోసా ఇస్తుంది. గోపి మురారీ గురించి, గీతిక కృష్ణ గురించి ఆలోచిస్తూ ఒకరికొకరు బైక్స్ మీద ఎదురుపడతారు. కృష్ణ మురారీ ప్రేమించింది ఎవరోనని అడిగిందని గీతిక చెప్తుంది. ఇప్పుడు చెప్పు నువ్వేం ఆలోచిస్తున్నావో అని గీతిక అడిగితే విషయం దాటేసి గోపి తప్పించుకుంటాడు. మురారీ మనసులో తన స్థానం ఏంటో అడగాలని కృష్ణ డిసైడ్ అవుతుంది. మీరు ఇంట్లో వాళ్ళందరూ బాగా నచ్చారు వెళ్లిపోవాలని అనుకోవడం లేదు. మిమ్మల్ని వదిలేసి వెళ్లలేనని ఇన్ డైరెక్ట్ గా చెప్పాలని మనసులో అనుకుంటుంది. అప్పుడే మురారీ వచ్చి కృష్ణతో తన ప్రేమ విషయం చెప్పేసి అందరి ముందు మళ్ళీ గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు.