Project K: మిక్కీ జె మేయర్ ని తప్పించి.. అతడికి ఛాన్స్ ఇస్తున్నారా..?

ప్రభాస్ సినిమా 'ప్రాజెక్ట్ K'లో ముందుగా మిక్కీ జె మేయర్ ను సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన్ను తప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

FOLLOW US: 

'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ కి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చింది. ఆయన ఒప్పుకుంటున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కథలే. భారీ బడ్జెట్, ఇంట్రెస్టింగా ఉన్న కథలనే ఒప్పుకుంటున్నాడు ప్రభాస్. 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్', 'సలార్'లో వంటి సినిమాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు నాగశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. దీనికి 'ప్రాజెక్ట్ కె' అనే వర్కింగ్ టైటిల్ ను పెట్టారు. ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించబోతున్నాడని సమాచారం. 

Also Read: ప్రేమ విషయాన్ని బయటపెట్టింది.. కానీ పెళ్లి మాత్రం..

ఇదిలా ఉండగా.. ఈ సినిమా కోసం ముందుగా మిక్కీ జె మేయర్ ను సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన్ను తప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ను మిక్కీ స్థానంలో తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నేపధ్య సంగీతం కోసం మాత్రమే సంతోష్ నారాయణన్ ను తీసుకుంటున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. రజినీకాంత్ నటించిన 'కబాలి', 'కాలా' వంటి సినిమాలకు సంతోష్ మ్యూజిక్ అందించారు. కోలీవుడ్ లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు  ఆయన్నే ప్రభాస్ సినిమా కోసం తీసుకుంటున్నారని టాక్. మరి దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. 

ఇక ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తయింది. ఇందులో అమితాబ్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలోనే కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ దాదాపు రెండు వందల రోజులు కేటాయించినట్లు తెలుస్తోంది. 

భారీ బడ్జెట్ తో.. అత్యాధునిక టెక్నాలజీతో విజువల్ వండర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దడానికి రెడీ అవుతున్నారు. సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ఈ సినిమాకి క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. 

Also Read:'శ్యామ్ సింగ రాయ్' హిందీ రైట్స్‌ అమ్మేశారు! ఎంత వచ్చిందో తెలుసా?

Also Read: సందీప్ కిషన్ - విజయ్ సేతుపతి పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా ఫేమస్ తమిళ దర్శకుడు

Also Read: కైకాల ఆరోగ్య పరిస్థితి.. ఇప్పటికీ విషమంగానే..

Also Read: ఫైనల్ వ‌ర్క్స్‌లో బాలకృష్ణ 'అఖండ'... ఫినిషింగ్ టచ్ ఇస్తున్న తమన్!

Also Read:రవిపై దారుణమైన ట్రోలింగ్.. ఫ్యామిలీను కూడా లాగుతూ..

Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Nov 2021 03:51 PM (IST) Tags: Prabhas Nag Ashwin Project K Mickey J Meyer Santosh Narayanan

సంబంధిత కథనాలు

Prashanth Neel-Ramya: నరేష్ మూడో భార్యతో 'కేజీఎఫ్' డైరెక్టర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి?

Prashanth Neel-Ramya: నరేష్ మూడో భార్యతో 'కేజీఎఫ్' డైరెక్టర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి?

Krishna Vamsi: రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్ - కృష్ణవంశీపై అంత నమ్మకమా?

Krishna Vamsi: రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్ - కృష్ణవంశీపై అంత నమ్మకమా?

Anjali special song: అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడు నితిన్ తో అంజలి స్పెషల్ సాంగ్

Anjali special song: అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడు నితిన్ తో అంజలి స్పెషల్ సాంగ్

Actress Arrested: పోలీస్ ఆఫీసర్ ని కరిచిన నటి - పూణేలో అరెస్ట్

Actress Arrested: పోలీస్ ఆఫీసర్ ని కరిచిన నటి - పూణేలో అరెస్ట్

Samanta on Liger poster: వాటిని కూడా బ్రేక్ చేయగలడు - విజయ్ దేవరకొండ ‘లైగర్’ పోస్టర్‌పై సమంత కామెంట్

Samanta on Liger poster: వాటిని కూడా బ్రేక్ చేయగలడు - విజయ్ దేవరకొండ ‘లైగర్’ పోస్టర్‌పై  సమంత కామెంట్

టాప్ స్టోరీస్

Vi Hotstar Plan: రూ.151కే మూడు నెలల హాట్‌స్టార్ - డేటా కూడా - వీఐ సూపర్ ప్లాన్!

Vi Hotstar Plan: రూ.151కే మూడు నెలల హాట్‌స్టార్ - డేటా కూడా - వీఐ సూపర్ ప్లాన్!

Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !

Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !

Piyush Goyal On CM KCR : తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్, సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు చెక్ - కేంద్రమంత్రి పీయూష్ గోయల్

Piyush Goyal On CM KCR : తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్, సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు చెక్ - కేంద్రమంత్రి పీయూష్ గోయల్

Single-Use Plastic Ban: ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయాల ఉత్పత్తులపై జీస్‌టీ తగ్గించాలి, దిల్లీ మంత్రి విజ్ఞప్తి

Single-Use Plastic Ban: ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయాల ఉత్పత్తులపై జీస్‌టీ తగ్గించాలి, దిల్లీ మంత్రి విజ్ఞప్తి