KGF 2: 'కేజీఎఫ్2' ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది!
జూన్ 3 నుంచి 'కేజీఎఫ్2' సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు.
కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్' సినిమా సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాకి కొనసాగింపుగా వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది ఈ సినిమా.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. 'కేజీఎఫ్1' సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఇప్పుడు 'కేజీఎఫ్2' హక్కులు కూడా అమెజానే కొనుక్కున్నట్లు తెలుస్తోంది. జూన్ 3 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం అమెజాన్ ఈ సినిమాను చూడాలంటే 199 చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది.
ఎర్లీ స్ట్రీమింగ్ కోసం అలా చేశారని తెలుస్తోంది. జూన్ 3 నుంచి ఎలాంటి రెంట్ చెల్లించకుండానే సినిమా చూసే అవకాశం కలుగుతుందన్నమాట. శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా.. రావు రమేష్, ప్రకాష్ రాజ్, రవీనా టాండన్, సంజయ్ దత్ లు కీలకపాత్రలు పోషించారు.
Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేసిన త్రివిక్రమ్ అండ్ కో
Also Read: 'సుడిగాలి' సుధీర్ ప్లేస్‌ను రీప్లేస్ చేసిన రష్మీ, ఇద్దరూ అనుకుని చేశారా?
View this post on Instagram