Mahesh Fans Disappointed: మహేష్ బాబు ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేసిన త్రివిక్రమ్ అండ్ కో
మహేష్ బాబు అభిమానులను గురూజీ త్రివిక్రమ్ డిజప్పాయింట్ చేశారా? ఫ్యాన్స్ మదిలో అటువంటి ఫీలింగ్ ఉందా?
నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు (Krishna Ghattamaneni Birthday). ప్రతి ఏడాది ఆయన బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు కొత్త సినిమాకు సంబంధించిన ఏదో ఒక కొత్త కబురును అభిమానుల చెవిలో వేయడం ఆనవాయితీ. ఈ ఏడాది అటువంటి కబురు ఏదీ రాలేదు. దాంతో అభిమానులు డిజప్పాయింట్ అయ్యారని టాక్.
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన 'సర్కారు వారి పాట' కొన్ని రోజుల క్రితం విడుదలైంది. ప్రస్తుతం ఆ సినిమా థియేటర్లలో ఉంది. మహేష్ విదేశాల్లో ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి జర్మనీ టూర్ వేశారు. ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ - త్రివిక్రమ్ సినిమా టైటిల్ లేదంటే హీరో పేరు ఈ రోజు అనౌన్స్ చేస్తారని భావించారు. అయితే, అటువంటివి ఏవీ లేవని తెలుస్తోంది. కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఒక ట్వీట్ చేసింది. దాంతో ఏదో ఒక అప్‌డేట్ ఉంటుందని ఆశించిన ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. అదీ సంగతి!
Also Read: విజయ్ దేవరకొండతో పూజా హెగ్డే - ముంబైలో ములాఖత్, షూటింగ్ ఫిక్స్ చేసిన పూరి
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ & హారిక అండ్ హాసిని - పూజా హెగ్డే, త్రివిక్రమ్ & హారిక అండ్ హాసిని - తమన్ కాంబినేషన్ లో కూడా హ్యాట్రిక్ చిత్రమిది. త్రివిక్రమ్ దర్శకత్వంలో, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో 'అరవింద సమేత వీరరాఘవ', 'అల వైకుంఠపురములో' చేశారు పూజా హెగ్డే. సో... ఇది హ్యాట్రిక్ మూవీ. ఆ రెండు చిత్రాలకూ సంగీతం అందించిన తమన్, ఈ సినిమాకూ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మది, కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఎ.ఎస్. ప్రకాష్.
Also Read: 'సుడిగాలి' సుధీర్ ప్లేస్‌ను రీప్లేస్ చేసిన రష్మీ, ఇద్దరూ అనుకుని చేశారా?
View this post on Instagram