Sanjay Dutt: 'నా పొటెన్షియల్ ఏంటో తెలిసేలా చేసింది' - 'కేజీఎఫ్2' సినిమాపై సంజయ్ దత్ కామెంట్స్
సంజయ్ దత్.. అధీరా అనే విలన్ రోల్ లో కనిపించారు. ఆయన నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు.
కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్ చాఫ్టర్2' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో రవీనా టాండన్, సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ హీరోలు నటించారు. ప్రధాన మంత్రి పాత్రలో రవీనా పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. అలానే సంజయ్ దత్.. అధీరా అనే విలన్ రోల్ లో కనిపించారు. ఆయన నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. అతడి గెటప్, కాస్ట్యూమ్స్ షాకిచ్చాయి. ఇంకా చెప్పాలంటే.. ఒక రాక్షసుడిలా ఆయన్ను చూపించారు.
ఈ పాత్రతో సంజయ్ కి మంచి పేరొచ్చింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఒక థాంక్యూ నోట్ ను షేర్ చేశారు. కొన్ని సినిమాలు ఎప్పటికీ స్పెషల్ గా మిగిలిపోతాయని.. అలాంటి సినిమాల్లో 'కేజీఎఫ్2' ఒకటని అన్నారు. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు లాగే సినిమాల కోసం చూస్తుంటాను.. 'కేజీఎఫ్2' అలాంటి సినిమానే అని పేర్కొన్నారు. ఈ సినిమా తన పొటెన్షియల్ ఏంటో తెలిసేలా చేసిందని.. చాలా ఎంజాయ్ చేశానని అన్నారు.
సినిమా అనేది ఒక ప్యాషన్ అని ఈ సినిమా మరోసారి రుజువు చేసిందని.. 'అధీరా' రోల్ అంత బాగా రావడానికి కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్ అని చెప్పుకొచ్చారు. మొత్తం క్రెడిట్ ఆయనకే దక్కుతుందని.. కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా.. ఆయన కలను మేమంతా తెరపై చూపించగలిగామని అన్నారు. ఆ తరువాత అభిమానులకు, కురుమ సభ్యులకు, శ్రేయోభిలాషులకు థాంక్స్ చెబుతూ.. వారే తన బలమని రాసుకొచ్చారు.
Also Read:సివిల్ కోర్టు జడ్జ్ మీద కేసుకు వర్మ రెడీ - ఆర్జీవీ వర్సెస్ నట్టి కుమార్ గొడవలో కొత్త ట్విస్ట్
View this post on Instagram