Sunitha: తల్లి కాబోతున్న సునీత? ఇన్ డైరెక్టుగా హింట్ ఇచ్చారా?
సింగర్ సునీత తల్లి కాబోతున్నారా? ఆ విషయాన్ని ఆమె ఇన్ డైరెక్టుగా చెప్పారా? ప్రేక్షకులకు హింట్ ఇచ్చారా?

సింగర్ సునీత తల్లి కాబోతున్నారట. ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో లేటెస్ట్ హిట్ టాపిక్ ఇదే. సోషల్ మీడియాలో ఈ రోజు ఉదయం (శనివారం, ఏప్రిల్ 23) ఆమె ఒక పోస్ట్ చేశారు. 'బ్లెస్సెడ్' అంటూ చేసిన ఆ పోస్టులో రెండు ఫొటోలు ఉన్నాయి. అందులో మామిడి చెట్టు కింద దిగిన ఫోటో ఒకటి ఉంది. ఇంకో ఫోటో వేరే చెట్టు దగ్గర ఉంది. ప్రెగ్నెంట్ లేడీస్ పులుపు తినడానికి మొగ్గు చూపుతారు. మామిడి కాయలతో ఫొటో దిగడంతో సునీత ప్రెగ్నెంట్ అనే ప్రచారం మొదలైంది. అయితే, ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు.
సాధారణంగా ప్రకృతి ఒడిలో టైమ్ స్పెండ్ చేయడం అంటే సునీతకు ఇష్టం. తరచూ మొక్కల మధ్యలో దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే, మామిడి చెట్టు దగ్గర ఫొటోలు కూడా దిగి ఉండొచ్చు. ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నారా? లేదా? అనేది ఇంకా క్లారిటీ లేదు.
Also Read: సివిల్ కోర్టు జడ్జ్ మీద కేసుకు వర్మ రెడీ - ఆర్జీవీ వర్సెస్ నట్టి కుమార్ గొడవలో కొత్త ట్విస్ట్
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
మ్యాంగో మూవీస్ అధినేత, ప్రముఖ సెలబ్రిటీ రామ్ వీరపనేని - సునీత గత ఏడాది జనవరిలో వివాహం జరిగింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఉంటుందీ జంట. రామ్ వీరపనేనితో కంటే ముందు సునీతకు మరో వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అబ్బాయి పేరు ఆకాష్, అమ్మాయి పేరు శ్రేయ.
Also Read: డీ గ్లామర్ రోల్‌లో కీర్తీ సురేష్ - టీజర్‌లో ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటే సినిమాలో ఎలా ఉంటుందో?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
Before You Go
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
ట్రెండింగ్ వార్తలు






















