News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Karthika Deepam November 25th Update: దీపను షూట్ చేసిన మోనిత, జైలుకెళ్లిన దుర్గ , ఇది ముగింపా -మరో మలుపా!

కార్తీకదీపం నవంబరు 25 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

FOLLOW US: 
Share:

Karthika Deepam November 25th  Episode 1519 (కార్తీకదీపం నవంబరు 25 ఎపిసోడ్)

హిమ చదువుకుంటూ ఉండగా  ఆనందరావు, సౌందర్య అక్కడికి వచ్చి బాగా చదువు హిమ చదివి మీ నాన్న లాగా గొప్ప డాక్టర్ అవ్వు అని అంటారు. అప్పుడు హిమ నేను డాక్టర్ని అవుతాను సౌర్య ఇంటికి వస్తే శౌర్య కలెక్టర్ అవుతుంది మరి తమ్ముడు ఏమవుతాడు నానమ్మ అని అడుగుతుంది.వాడు పెద్దయ్యాక ఏమి అవ్వాలనుకుంటే అది చేద్దాం అని ఆనందరావు చెబితే... సౌందర్య ఇప్పుడు వాడి సంగతి ఎందుకు లే ముందు నువ్వు చదువుకో అంటుంది. ఆ తరువాత హిమ ఆనంద్ తో ఆడుకోవడానికి వెళ్లిపోవడంతో.. శౌర్య గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మోనిత చేసిన పనిని తలుచుకుని సౌందర్య కోపంతో రగిలిపోతూ ఎలా అయినా అక్కడికి వెళ్లాలి అనుకుంటూ ఉంటుంది.

మరొకవైపు మోనిత ఏదో ప్లాన్ వేసి..ఒకామెకు పని అప్పగిస్తుంది. ఆ తర్వాత మోనిత దుర్గ కి ఫోన్ చేసి ఈ రోజు నీపనైపోతుందని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది..దమ్ముంటే నేను చెప్పిన ప్లేస్ కి రా అని లొకేషన్ పంపిస్తుంది. 
అటు దీప మాత్రం..శౌర్య కోసం వెతుకుతూ ఉంటుంది...ఆరోగ్యం ఎందుకు బాగోవడం లేదో, భర్తను దూరం చేశావ్, బిడ్డను దూరం చేశావ్ ఇంకా ఎన్నాళ్లు ఆడుకుంటావ్..కనీసం నేను ప్రాణాలతో ఉన్నప్పుడైనా నా భర్తని పిల్లల్ని నా దగ్గరకు చేర్చు అనుకుంటుంది...
కార్తీక్ కూడా కారులో వెళుతూ  మోనిత ఒక్కతే వెళ్లిందంటే ఏదో ప్లాన్ లో ఉంది అనుకుంటాడు...అటు దీప అక్కడ ఏం చేస్తుందో ఎక్కడెక్కడ తిరుగుతుందో అనుకుంటాడు.ఇంతకీ మోనిత ఎక్కడికి వెళ్లింది అనుకుంటాడు...
మరోవైపు మోనిత పంపిన లొకేషన్ కి వెళతాడు దుర్గ. ఏంటి బంగారం 10 మంది గ్యాంగ్ తో ఉంటామనుకుంటే నువ్వు ఒక్కదానివే ఉన్నావు అని అనడంతో.. కొద్దిసేపు ఆగు అంటుంది మోనిత..నిన్ను పోలీసులకు పట్టిస్తానని మోనిత అంటే నేను చేసిన నేరాలకు సాక్ష్యాలు లేవంటూ ఏదేదో మాట్లాడుతాడు..అవన్నీ ఆ వెనుకే ఉన్న పోలీసులు రికార్డ్ చేస్తారు...దుర్గను లాక్కెళ్లిపోవడంతో... హమ్మయ్య ఓ పీడ విరగడైపోయింది...ఆ వంటలక్క సంగతి తేల్చాలి అనుకుంటుంది మోనిత.. ఇదంతా చెట్టు చాటునుంచి చూసిన కార్తీక్... షాపింగ్ పేరుతో దుర్గ అడ్డు తొలగించుకుందన్నమాట..ఇంకేదో పెద్ద ప్లాన్ లో ఉంది...దీపను జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటాడు.

మోనిత: హమ్మయ్య ఒక పీడ తెగిపోయింది అనుకోండి సంతోష. అయితే అదంతా కూడా కార్తీక్ చూసి బయటికి షాపింగ్ కి అని చెప్పి దుర్గ పీడ వదిలించుకుందన్నమాట ఎలా అయినా దీపను జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుని కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. 

Also Read: రిషి-జగతిని కలిపిన యాక్సిడెంట్, ఆనందంలో మహేంద్ర, టెన్షన్లో దేవయాని

మరొకవైపు సౌందర్య మోనిత దగ్గరికి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు హిమ నానమ్మ మీరు ఫస్ట్ ఎవరి దగ్గరకు వెళతారని అడిగితే... ముందు మోనిత దగ్గరకు, ఆ తర్వాత శౌర్య దగ్గరకు వెళతాను అంటుంది. ముందు మీరు శౌర్య దగ్గరకు వెళ్లండి ఆ తర్వాత మోనిత దగ్గరకు వెళ్లండి అంటుంది. నేను కూడా వస్తానని అడిగితే వద్దంటుంది సౌందర్య. ఇప్పుడది ఎన్ని వేషాలు వేసినా కాళ్లు చేతులు కట్టేసి ఇంటికి తీసుకొస్తానంటుంది సౌందర్య. ఆ తర్వాత  సౌందర్య దీపక్ కార్తీక్,దీప ఫోటో దగ్గరికి వెళ్లి మీ కూతురు మీరు ఉన్నారు అన్న ధైర్యంతో మీకోసం వెతుకుతోంది. తనని ఎలాగైనా ఇక్కడికి తీసుకు వద్దామని వెళుతున్నాను తీసుకొస్తాను అనుకుని బయలుదేరుతుంది...

మోనిత: దుర్గ మళ్లీ తిరిగిరాడు..వాడి తలనొప్పి తీరిపోయింది... ఈ వంటలక్క శౌర్యని వెతుక్కుంటూ సంగారెడ్డి వెళ్లిపోయింది.. ఇదే మంచి సమయం..కార్తీక్ ను మెల్లగా దారిలోకి తెచ్చుకోవాలి..అన్నీ మర్చిపోయి నా గురించే ఆలోచించేలా చేసుకోవాలి..కార్తీక్ ను తీసుకుని వెళ్లిపోవాలి అనుకుంటుంది...ఇంతలో శివ పరిగెత్తుకు వచ్చి... 
శివ: ఆ వంటలక్క కాల్ చేసింది ఫోన్ రాగానే హడావుడిగా కారులో వెళ్లిపోయారని చెబుతాడు... ఎక్కడికి వెళ్లారని అడిగితే ఏమో తెలియదు అంటాడు శివ.  
మోనిత: ఆ శౌర్య కనిపించి నాన్న అని పిలిస్తే కార్తీక్ కీ గతం గుర్తుకువస్తుందని మోనిత టెన్షన్ పడుతుంటుంది.

Also Read: పిల్లలతో సహా సౌందర్య ఆందరావుని కలిసిన దీప-కార్తీక్, గన్ కి పనిచెప్పిన మోనిత, ఇక శుభం కార్డేనా!

దీప-కార్తీక్: మరుసటి రోజు ఉదయం కార్తీక్ దీప ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ శౌర్య గురించి ఎంక్వయిరీ చేస్తూ ఉంటారు. అటు సౌందర్య ఆనందరావు హిమ కూడా శౌర్య గురించి వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత కార్తీక్ దీప వెతుకుతూ ఉండగా అప్పుడు దీప కళ్ళు తిరగడంతో ఓ చోట కూర్చుని ఆలోచిస్తూ శౌర్య గురించి బాధపడుతూ ఉంటుంది. కష్టాలన్నీ పడేబదులు మళ్లీ ఏదైనా ప్రమాదం జరిగి చనిపోవడం మేలనిపిస్తోంది డాక్టర్ బాబు అని బాధపడుతుంది దీప.. అలా మాట్లాడొద్దు దీప అని ధైర్యం చెబుతాడు కార్తీక్...నీ బిడ్డ దొరుకుతుంది...ఇక భర్తగురించి అంటావా..నాకు గతం గుర్తుకురాకపోవచ్చు..వర్తమానం చూస్తున్నాను కదా..నువ్వు పడుతున్న తాపత్రయం చూస్తుంటే నాకు నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోంది..నన్న నీ భర్త అనుకో అంటాడు..దీప షాక్ అయి నిలబడుతుంది...
ఎపిసోడ్ ముగిసింది..

రేపటి(శనివారం) ఎపిసోడ్ లో
ఆనందరావు, సౌందర్య..శౌర్య దగ్గరకు వెళతారు...ఇప్పుడైనా వస్తావా అంటే..అమ్మానాన్నల్ని చూడకుండా నేను రాను రాను అంటుంది...అదే ఊరిలో శౌర్యను వెతుకుతున్న కార్తీక్-దీప ఆ అరుపులు విని ఆ వైపు పరిగెత్తుతారు... అంతా ఓ దగ్గరకు చేరుతారు..

Published at : 25 Nov 2022 09:37 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode 1519 Karthika Deepam Serial November 25th

ఇవి కూడా చూడండి

Sandeep Vanga: మహిళను హింసించడం భావోద్వేగమా? ‘యానిమల్‘ దర్శకుడి కామెంట్స్‌పై నెటిజన్ల ఆగ్రహం

Sandeep Vanga: మహిళను హింసించడం భావోద్వేగమా? ‘యానిమల్‘ దర్శకుడి కామెంట్స్‌పై నెటిజన్ల ఆగ్రహం

Kiraak RP: సైలెంట్‌గా ‘జబర్దస్త్’ కామెడియన్ కిరాక్ ఆర్పీ పెళ్లి - సెలబ్రిటీలు, హడావిడి లేకుండా!

Kiraak RP: సైలెంట్‌గా ‘జబర్దస్త్’ కామెడియన్ కిరాక్ ఆర్పీ పెళ్లి - సెలబ్రిటీలు, హడావిడి లేకుండా!

Hi Nanna Pre Release Event: ‘హాయ్ నాన్న’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్-రష్మిక మాల్దీవుల పిక్స్ - నానిపై రౌడీబాయ్ ఫ్యాన్స్ గుర్రు

Hi Nanna Pre Release Event: ‘హాయ్ నాన్న’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్-రష్మిక మాల్దీవుల పిక్స్ - నానిపై రౌడీబాయ్ ఫ్యాన్స్ గుర్రు

Mrunal Thakur: అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా - ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మృణాల్

Mrunal Thakur: అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా - ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మృణాల్

Animal Movie: 'యానిమల్' బడ్జెట్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ - 'దిల్' రాజుకు ప్రాఫిట్ తెచ్చే సినిమాయేనా?

Animal Movie: 'యానిమల్' బడ్జెట్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ - 'దిల్' రాజుకు ప్రాఫిట్ తెచ్చే సినిమాయేనా?

టాప్ స్టోరీస్

Election News: శభాష్! ఆక్సీజన్ సిలిండర్‌తో పోలింగ్ బూత్‌కు, అలాంటి ఓటర్లు సిగ్గుపడాల్సిందే!

Election News: శభాష్! ఆక్సీజన్ సిలిండర్‌తో పోలింగ్ బూత్‌కు, అలాంటి ఓటర్లు సిగ్గుపడాల్సిందే!

Telangana Assembly Election 2023: 11 గంటలకు 20.64 శాతం పోలింగ్ - హైదరాబాద్ లోనే తక్కువ!

Telangana Assembly Election 2023: 11 గంటలకు 20.64 శాతం పోలింగ్ - హైదరాబాద్ లోనే తక్కువ!

Telangana Polling 2023 : హైదరాబాద్ బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారిందా - 11 అయినా 12 శాతమే పోలింగ్!

Telangana Polling 2023 : హైదరాబాద్ బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారిందా - 11 అయినా 12 శాతమే పోలింగ్!

Revanth Reddy: కేసీఆర్ పన్నాగాలు ఫలించవు, అన్ని దింపుడుకల్లం ఆశలే - సాగర్ ఉద్రిక్తతలపై రేవంత్

Revanth Reddy: కేసీఆర్ పన్నాగాలు ఫలించవు, అన్ని దింపుడుకల్లం ఆశలే - సాగర్ ఉద్రిక్తతలపై రేవంత్