Guppedantha Manasu November 24th Update: రిషి-జగతిని కలిపిన యాక్సిడెంట్, ఆనందంలో మహేంద్ర, టెన్షన్లో దేవయాని
Guppedantha Manasu November 24th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్ ( Guppedantha Manasu November 25th Today Episode 617)
మహేంద్ర-జగతి: రిషి దగ్గరకు వెళదాం అని రెడీ అయిన తర్వాత..మహేంద్ర ఇంతకీ మనం వచ్చిన పని సక్సెస్ అయిందంటావా అని అడుగుతాడు. అదేంటి కొత్తగా మాట్లాడుతున్నావ్ మళ్లీ మనసు మార్చుకున్నావా అన్న జగతి..ఓ రకంగా దేవయాని అక్కయ్య ఓడిపోయింది..రిషి నిన్నేం అడగలేదు కదా ఇంకేం ఆలోచించకు..రిషి నీకోసం ఎదురుచూస్తుంటాడు వెళదాం పద అని అడుగుతుంది జగతి....నీ మనసులో ఉన్న ప్రశ్నలు అన్నిటికీ రిషి ప్రేమే సమాధానం, రిషికోసం ఏదైనా చేయొచ్చు.. గెలవొచ్చు, ఓడిపోవచ్చు కానీ రిషి ప్రేమ కోల్పోవద్దు మహేంద్ర అని ఏమోషనల్ గా చెబుతుంది..
రిషి-వసు: అక్కడ రిషి..ఇల్లంతా సందడి చేస్తుంటాడు..తండ్రి రూమ్ మొత్తం సర్దుతుంటాడు..ఏంటి సార్ ఇంకా తెల్లారలేదు మీరసలు పడుకోలేదా అని అడుగుతుంది వసుధార.. రిషి ఏదేదో సందడిగా మాట్లాడుతాడు.. మహేంద్ర సార్ వాళ్లు రాకపోతే పరిస్థితి ఏంటో..ఎలాగైనా వాళ్లు రావాలని కోరుకుంటుంది వసుధార..మరోవైపు దేవయాని కోపంతో రగిలిపోతుంటుంది..వాళ్లు వస్తే మళ్లీ నాకలలు నిజం కాకుండా పోతాయ్..అలా జరగకూడదు అనుకుంటుంది...
అటు జగతి-మహేంద్ర బయలుదేరుతారు..కార్లో వస్తూ రిషి గురించి సంతోషంగా మాట్లాడుకుంటారు. ఇంకెప్పుడూ రిషిని వదిలి దూరంగా వెళ్లను, విడిచి ఉండనని మహేంద్ర అంటే..నేను కోరుకునేది అదే అంటుంది జగతి. వెళ్లగానే రిషి అలా చేస్తాడు.. ఇలా చేస్తాడు అంటూ సందడిగా మాట్లాడుతాడు మహేంద్ర...చూసి మురిసిపోతుంది జగతి..ఇంతలో అనుకోకుండా ఓ లారీ ఎదురుగా వచ్చి ఢీ కొట్టి వెళ్లిపోతుంది...
Also Read: పిల్లలతో సహా సౌందర్య ఆందరావుని కలిసిన దీప-కార్తీక్, గన్ కి పనిచెప్పిన మోనిత, ఇక శుభం కార్డేనా!
తండ్రి వస్తాడా రాడా అని రిషి ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటాడు...జగతి-మహేంద్రని హాస్పిటల్ కి తీసుకెళతారు... కిందకు వచ్చిన రిషి..పెద్దమ్మా డాడ్ వాళ్లు ఇంకా రాలేదేంటని అడుగుతాడు...
దేవయాని: రావాలి అనుకుంటే కదా వచ్చేది , నిన్ను కాదనుకుని వెళ్లినవారి గురించి నువ్వెందుకు బాధపడతావ్, వాళ్లకు ప్రేమలు లేవు, వాళ్లు రారనుకుంటాను
ఈవిడగారి నోటినుంచి ఒక్క మంచి మాట కూడా రాదనుకుంటా అనుకుంటుంది ధరణి
రిషి: పెద్దమ్మా అలా మాట్లాడకండి..వాళ్లు తప్పనిసరిగా వస్తారు
దేవయాని: ఏంటి చూస్తూ నిలబడ్డావ్ పో అని ధరణిని కసురుకుంటుంది
అటుగౌతమ్ కూడా వీళ్లింకా రాలేదేంటో అని ఆలోచిస్తాడు...రిషి టెన్షన్ పడుతున్నాడు...అంకుల్ కి ఫోన్ చేసి అడుగుదాం అని కాల్ చేద్దాం అనుకుని ఫీలవుతారేమో అనుకుని ఆగిపోతాడు..ఇంతలో మహేంద్ర-జగతిని అడ్మిట్ చేసిన హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. యాక్సిడెంట్ జరిగింది..ఆ కారులో మీ విజిటింగ్ కార్డ్ దొరికింది కాల్ చేశాను అని కాల్ కట్ చేస్తుంది. పాపం ఎవరో ఏంటో..నా విజిటింగ్ కార్డ్ చాలామందికి ఇచ్చాను అనుకుంటూ వెళతాడు గౌతమ్..
Also Read: జగతి-మహేంద్ర కారుకి యాక్సిడెంట్, తండ్రి కోసం ఇంట్లో రిషి ఎదురుచూపులు, టెన్షన్లో గౌతమ్
రిషి-వసుధార కూర్చుని ఆలోచిస్తుంటారు..
రిషి: డాడ్ వాళ్లు ఇంకా రాలేదేంటి టెన్షన్ గా ఉంది
వసు: టెన్షన్ ఎందుకు సార్ వస్తూ ఉంటారు..ఫోన్ చేద్దామా
రిషి: డాడ్ వాయిస్ వినాలి అనుకోవడం లేదు..డాడ్ ని మనింట్లో చూడాలి అనుకుంటున్నా
వసు: కాఫీ ఏమైనా కావాలా
రిషి: డాడ్ తప్ప ఇంకేం వద్దు...
ఇంతలో గౌతమ్ కిందకొచ్చి..నేను బయటకు వెళ్లొస్తానంటే..ఇప్పుడెక్కడికి డాడ్ వాళ్లు వస్తున్నారు ఉండు అనిరిషి అంటాడు.. ఎవరికో యాక్సిడెంట్ అయిందట నా నంబర్ వాళ్ల దగ్గర ఉందని కాల్ చేశారు..తప్పనిసరై వెళ్లాల్సి వస్తోంది అంటాడు.. డాడ్ వాళ్లు వస్తున్నారు కదా నేను రాలేను నువ్వెళ్లు అంటే..వాళ్లు రాగానే కాల్ చేయి అని చెప్పేసి వెళతుంటాడు... అరేయ్ గౌతమ్ డాడ్ వాళ్లు వస్తారు కదా అని సందేహంగా అడుగుతుంటే..నువ్వు టెన్షన్ పడకు అంకుల్ వాళ్లు తప్పకుండా వస్తారని ధైర్యం చెప్పేసి వెళతాడు గౌతమ్... రిషి మాత్రం అదే ఆలోచనలో ఉంటాడు..కాఫీ తెచ్చి ఇచ్చినా కానీ.. నేను డాడ్ తో కలసి కాఫీ తాగుతాను అంటాడు...డాడ్ వాళ్లు వస్తారు కదా వస్తారు నాకు తెలుసంటూ చిన్నపిల్లాడిలా అదే విషయం మాట్లాడుతాడు.. ఇంతలో కారు హారన్ వినిపించడంతో బయటకు చూస్తాడు..కానీ అది తండ్రి కారు కాదు...
హాస్పిటల్ కి వెళ్లిన గౌతమ్ కి...అక్కడున్నది మహేంద్ర-జగతి అని తెలియడంతో షాక్ అవుతాడు. రిషికి ఎలా చెప్పాలి అనుకున్నా చెప్పకతప్పదని కాల్ చేస్తాడు...ఆ ఫోన్ దేవయాని చూసి..వాళ్లు వచ్చారో లేదో తెలుసుకునేందుకేమో అనుకుంటూ కాల్ కట్ చేస్తుంది. అదేంటికాల్ కట్ అయిందని గౌతమ్ అనుకుని మళ్లీ కాల్ చేస్తాడు..దేవయాని కాల్ కట్ చేస్తుంది..
రేపటి(శుక్రవారం) ఎపిసోడ్ లో
గౌతమ్ నీకేమైంది అంటూ హాస్పిటల్ కి వెళతారు రిషి-వసు... అక్కడ మహేంద్ర జగతిని చూసి షాక్ అవుతారు... జగతికి అర్జెంటుగా బ్లడ్ అవసరం అని డాక్టర్ చెప్పడంతో నాది సేమ్ బ్లడ్ గ్రూప్ అంటాడు రిషి...వసు-మహేంద్ర రిషి ని చూస్తుంటారు..