Guppedantha Manasu November 23rd Update: జగతి-మహేంద్ర కారుకి యాక్సిడెంట్, తండ్రి కోసం ఇంట్లో రిషి ఎదురుచూపులు, టెన్షన్లో గౌతమ్
Guppedantha Manasu November 23rd Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu November 23rd Today Episode 615)
తండ్రి మహేంద్రని ఇంటికి రమ్మని అడుగుతాడు రిషి. మిమ్మల్ని చూడగానే ఆనందంగా గెంతులు వేయాలి అనిపించింది..నాకోసం మా డాడ్ వచ్చారని గట్టిగా అరిచి చెప్పాలి అనుకున్నా కానీ అప్పుడున్న ఆ పరిస్థితి వేరు ఆ టెన్షన్ వేరు అని చాలా ఏమోషనల్ అవుతాడు...ఇంత మాట్లాడుతున్నా ఇంకా ఆలోచిస్తున్నారా అని రిషి అడిగుతాడు...నా కళ్లలోకి చూసి చెప్పండి మీరు ఇంటికి వస్తున్నారా లేదా...
మహేంద్ర: నేను...అది...అని ఏమీ మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుకుంటాడు
రిషి: సరే డాడ్..బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి...ఈ రిషిని మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో ఈ రోజు రాత్రంతా ఆలోచించుకోండి..మీ మనసు ఏం చెబితే అది చేయండి..మీ మనసులో రిషి ఉన్నాడు అది గుర్తుపెట్టుకోండి..
మహేంద్ర: నాన్నా రిషి అనగానే...
రిషి: డాడ్ ప్లీజ్..ఇంకేం చెప్పొద్దు..మిమ్మల్ని దోషిగా నిలబెట్టి నేను ప్రశ్నించలేను..నాకు మీ ప్రేమ కావాలి..మీరు కావాలి..ఆలోచించుకోండి డాడ్..టైం తీసుకోండి.. ఈ రోజు రాత్రంతా ఆలోచించండి.. రావాలని అనిపిస్తే పొద్దున్నే సూర్యోదయం కన్నా ఇంటికి రండి..ఆ సూర్యుడి కన్నా మీరే ముందు దర్శనమివ్వాలి..ఇద్దరం మనింట్లో కలసి టిఫిన్ చేద్దాం.. ఇన్నాళ్లూ ఆ ఇంట్లో మీరు లేకుండా ఉండగలిగాను..కానీ ఈ ఒక్కరాత్రికి భరిస్తాను..మీరు వచ్చి గుడ్ మార్నింగ్ రిషి అని చెప్పాలి..అప్పుడే నాకు నిజమైన గుడ్ మార్నింగ్ అవుతుంది..ఇద్దరం కలసి కాఫీ తాగుదాం కబుర్లు చెప్పుకుందాం... మీరు వస్తారని అనుకుంటున్నాను...అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతూ...పరిగెత్తుకుని వెనక్కు వచ్చి మహేంద్రని హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు...మహేంద్ర స్పందించేలోగా రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు..
Also Read: శౌర్య అంటించిన పోస్టర్ చూసిన దీప, కార్తీక్ ను కొట్టబోయిన మోనిత!
ఇంటికి వెళ్లిన తర్వాత కూడా రిషి తండ్రి గురించే ఆలోచిస్తుంటాడు...ఎంత త్వరగా తెల్లారుతుందో అని ఆలోచిస్తూ వసుధార ఏం చేస్తోందో అనుకుంటాడు..అదే సమయంలో వసుధార కూడా అదే విషయంపై ఆలోచిస్తుంది.మహేంద్ర ఇంటికి వస్తారా రారా అనే విషయంపై కాసేపు చాటింగ్ చేస్తారు...బాల్కనీలోకి రండి అన్న వసు మెసేజ్ చూసి అక్కడకు వెళతాడు.. తండ్రి గురించి బాధపడుతున్న రిషిని ఓదార్చుతుంది వసుధార..
రిషి: ఇన్నాళ్లూ డాడ్ ని చూడకుండా ఉండగలిగాను కానీ రేపు ఉదయం వరకూ వెయిట్ చేయడం కష్టంగా ఉంది.. ఒకవేళ రాకపోతే ఎలా అనే భయం ఉంది..వస్తారనే నమ్మకమూ ఉంది..
వసు: భయపడకండి సార్..మహేంద్ర సార్ వస్తారు..జగతి మేడం దగ్గరుండి తీసుకొస్తారు.. తప్పకుండా వస్తారు..మీరిప్పుడు ఎంత ఎదురుచూస్తున్నారో మహేంద్ర సార్ కూడా అంతే ఎదురు చూస్తుంటారు
రిషి: డాడ్ ఎదురుచూస్తూ ఉంటారా..ఆలోచిస్తూ ఉంటారా...
అటు మహేంద్ర-జగతి కూర్చుని ఇదే విషయంపై మాట్లాడుకుంటారు...
జగతి: ఏం నిర్ణయించుకున్నావ్ మహేంద్ర
మహేంద్ర: నేను నీతోనే వస్తాను..వస్తున్నాను అని చెప్పేలోగా టైమ్ ఇచ్చాడు.. రిషి దగ్గరకు ఎప్పుడు వెళదామా అని నా మనసు ఉవ్విళ్లూరుతోంది..
జగతి: చెప్పొచ్చు కదా మరి
మహేంద్ర: రిషి మాట నేనెందుకు కాదనాలి..రేపటి వరకూ వాడి గురించే ఆలచిస్తూ ఉండిపోతాను
జగతి: ఎన్నింటికి నిద్రలేపాలి
మహేంద్ర: రిషి దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాక నిద్ర ఎలా పడుతుంది..
జగతి: మరి ఇన్నాళ్లూ ఎలా ఉన్నావ్
మహేంద్ర: వాడు సముద్రం అయితే నేను అల లాంటివాడిని..ఎంత ముందుకు వెళ్లినా మళ్లీ వెనక్కు వెళ్లక తప్పదు
Also Read: మహేంద్రకి గడువు విధించిన రిషి - దేవయాని కుట్ర బయటపెట్టే పనిలో గౌతమ్
వసు-రిషి మాట్లాడుకుని లోపలకు వస్తుండగా దేవయాని నిలదీస్తుంది...ఇప్పటి వరకూ ఏం చేస్తున్నారని అడుగుతుంది
రిషి: తనను ఏమీ అనొద్దు..నేను డాడ్ గురించి బాధపడుతుంటే వసుధార వచ్చి మాట్లాడింది
దేవయాని: అంత ఆలోచన ఎందుకు రావాలి అనుకుంటే వస్తారు లేదంటే లేదు
రిషి: అలా అనొద్దు పెద్దమ్మా..డాడ్ కి నేనంటే చాలా ఇష్టం కదా
దేవయాని: అసలు నువ్వంటే ఇష్టం ఉంటే వెళ్లడం ఎందుకు..వాళ్లు వస్తారని ఎదురు చూడడం ఎందుకు
వసు: జరిగిన దానికన్నా జరగబోయేది తెలుసుకుని సంతోషించాలి
దేవయాని: వస్తే సరే..మరి రాకపోతే...
రిషి: అలా అనొద్దు పెద్దమ్మా...
సరే వెళ్లి నిద్రపో అని దేవయాని అంటే..నాకు నిద్రరావడం లేదని రిషి అంటాడు..మన మనసులో భావాలు అందరికీ అర్థం కావులెండి సార్ అని వసు కౌంటర్ ఇస్తుంది..
వసు: రేపు పొద్దున్న మహేంద్ర సార్-జగతి మేడం రాకతో ఈ ఇల్లు పులకరిస్తుంది..గుడ్ నైట్ మేడం అనేసి వెళ్లిపోతుంది వసుధార...
అక్కడ మహేంద్ర-జగతి కూడా నిద్రపోకుండా ఎప్పుడెప్పుడు వెళదామా అని రెడీ అయి కూర్చుంటారు...
మహేంద్ర: మనం ఓడిపోయామా గెలిచామా
జగతి: బంధాల మధ్య గెలుపు ఓటములు ఉండవ్
మహేంద్ర:ఇన్నాళ్లూ రిషిని బాధపెట్టామ్..మరి అనుకున్నది సాధించామా..ఇదంతా వృధా ప్రయాసేనా..
జగతి: ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావ్ మళ్లీ మనసు మార్చుకున్నావా
ఎపిసోడ్ ముగిసింది
రేపటి( గురువారం ఎపిసోడ్ లో)
తండ్రి కోసం రిషి ఆతృతగా ఎదురుచూస్తుంటాడు..అక్కడ జగతి మహేంద్ర కారుకి యాక్సిడెంట్ అవుతుంది. గౌతమ్ కాల్ చేసినా రిషి లిఫ్ట్ చేయడు, దేవయాని కావాలనే కాల్ కట్ చేస్తుంది..ఇప్పుడేం చేయాలనే ఆలోచనలో పడతాడు గౌతమ్..
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి