2023 లో ఈ రాశివారి జీవితంలో కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతాయి
వృషభ రాశిలో జన్మించిన వారి జీవితాల్లో ఈ సంవత్సరం గుర్తించదగిన మార్పులుంటాయి..అన్ని రంగాలవారికి విజయాన్నిస్తుంది
సంవత్సరం ప్రారంభంలో మీరు కొంత మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పై ప్రభావం చూపిస్తుంది.
2023 ప్రారంభంలో మీ రహస్యాలు కొన్ని బహిర్గతం కావచ్చు..ఇది మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది..మానసిక ఒత్తిడిని పెంచుతుంది..ఒత్తిడి తీవ్రస్థాయికి చేరితే అనారోగ్యం పాలవుతారు.
పదో స్థానంలో సంచరిస్తున్న శని కారణంగా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది..అయితే ఈ కృషి మీకు మంచి గుర్తింపునిస్తుంది. భవిష్యత్ కి ఉపయోగపడుతుంది
కష్టపడి పనిచేస్తారు..కష్టానికి తగిన ఫలితం పొందుతారు..తద్వారా ఆర్థిక విజయం సాధ్యమవుతుంది ఈ ఏడాది విహారయాత్రలు చేస్తారు, పవిత్ర నదుల్లో స్నానమాచరిస్తారు
ఏడాదిలో మొదటి నాలుగు నెలలు ఆర్థిక పరిస్థితి బావుంటుంది...రెండో నాలుగు నెలలు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.. చివరి నాలుగు నెలలు పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది
ఈ ఏడాది వ్యాపారులు, విద్యార్థులకు మంచి ఫలితాలుంటాయి. వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి..మానసికంగా దృఢంగా ఉంటారు..కొత్త సంబంధాలు అభివృద్ధి చెందుతాయి
కొత్త ప్రణాళికలు వేసుకునేందుకు ఇదే మంచిసమయం..అనుకున్న ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యంలో కొంత హెచ్చుతగ్గులు ఉంటాయి..మొరటుగా ప్రవర్తించడం మానుకోండి. ఏప్రిల్ మీ జీవితంలో ఆనందం, ప్రేమ ఉంటాయి.
జూన్ నుంచి నవంబరు మధ్య విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. జూలై నుంచి సెప్టెంబరు వరకు మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ చాలా వహించాలి. పనిలో మీకు ఆత్మవిశ్వాసం లేకపోవడం కూడా ఒక అవరోధంగా ఉండవచ్చు.
అక్టోబర్‌లో చాలా మార్పులు వస్తాయి..మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది...డిసెంబరు వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది . అదనంగా ఆస్తి కొనుగోలుకు ప్రత్యేక అవకాశాలు ఉంటాయి.
నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు