మేష రాశి కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్న కలహాలకు ఈ రోజు ఫుల్ స్టాప్ పడుతుంది. ముఖ్యమైన పనుల నిర్వహణలో నిమగ్నమై ఉంటారు. విద్యార్థులకు ఇది మంచి సమయం కాదు. మితిమీరిన అహంకారం వల్ల నష్టపోతారు..
వృషభ రాశి మీ ఆలోచనలకు రూపం ఇవ్వండి. గాలిలో కోటలు కట్టడం మానేయడం మంచిది. మీరు తలపెట్టిన పనులకు జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగం మరింత కాలం తిరగాల్సి ఉంటుంది. భూమి కొనుగోలు , భవనం కోసం పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది.
మిథున రాశి జీవితంలో ఏం చేయాలో ఏం చేయకూడదో అనే పరిస్థితి నుంచి బయటికి రండి.ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి అదే సమయంలో తొందరపాటు నిర్ణయాలు కూడా వద్దు. వాహనం కొనాలనే ఆలోచనలో ఉంటారు. అనుకూల ఆలోచనలు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతాయి. స్నేహితులను కలుస్తారు.
కర్కాటక రాశి ఇతరుల గురించి చెడుగా ఆలోచించవద్దు. ఆహారాన్ని మితంగా తీసుకోవాలి..లేదంటే ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మీకున్న సమయం తక్కువ..పని ఎక్కువ..అందుకే అంకిత భావంతో పని చేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. జీవిత భాగస్వామి కారణంగా సంతోషంగా ఉంటారు.
సింహ రాశి అనవసరంగా సమయం వృధా చేసుకోవద్దు. ఇతరుల కారణంగా మీ చదువుని అశ్రద్ధ చేయవద్దు. ప్రశాంతంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. జీవనాధారం పెరిగే అవకాశాలున్నాయి. పాత పెట్టుబడి నుంచి లాభం ఉంటుంది.
కన్యా రాశి అదనపు పని పెట్టుకోవడం వల్ల అవసరమైన పని పూర్తికాదు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగులు పనివిషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు మరింత శ్రద్ధ పెట్టాలి. ధాన ధర్మం మనసుకి ప్రశాంతత ఇస్తుంది
తులా రాశి మీ తెలివి తేటలతో అనుకున్న పని అనుకున్నట్టు పూర్తిచేయగలుగుతారు. వ్యాపారంలో కీర్తి, సంపద పెరుగుతాయి. క్రీడా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఇది అనుకూల సమయం. ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
వృశ్చిక రాశి ప్రస్తుత సమయం మీకు శుభఫలితాలు ఇవ్వబోతోంది. అనవసర మాటలు నియంత్రించండి..లేదంటే చేసిన పని చెడిపోవచ్చు. మీ ఆలోచన విధానం మార్చుకునేందుకు ప్రయత్నించండి కానీ..ఇతరుల అభిప్రాయం మార్చడానికి ప్రయత్నించవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి
ధనుస్సు రాశి పిల్లల పెళ్లి విషయంలో ఆందోళన ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడుల వల్ల లాభపడతారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు సమయం ఫలవంతంగా ఉంటుంది. మీ హక్కులను దుర్వినియోగం చేయవద్దు, లేకుంటే నష్టం జరగవచ్చు.
మకరరాశి వ్యాపార విస్తరణ ప్రణాళిక విజయవంతమవుతుంది. అనవసర చింతలు వదిలి ఆరోగ్యంగా ఉండండి. అవసరమైన సమయంలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమ. శత్రువర్గం ఈ రోజు చురుకుగా ఉంటుందని గుర్తుంచుకోండి..మీరు అప్రమత్తంగా ఉండండి.
కుంభ రాశి మీ ప్రవర్తనతో సహోద్యోగులు సంతోషిస్తారు. ఇది జీవితంలో కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు మంచి సమయం. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆకస్మికంగా పెద్ద ఖర్చులు పెట్టాల్సి రావొచ్చు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు
మీన రాశి ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కెరీర్‌కు సంబంధించి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. జాగ్రత్తగా ఉండండి..ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనేక సందిగ్ధతలు మనస్సును కలవరపరుస్తాయి. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది.