మేష రాశి ఈ వారం మేషరాశివారికి అత్యద్భుతంగా ఉంటుంది. గతంలో ఎదుర్కొన్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కొన్ని నూతన పరిచయాల వల్ల ప్రయోజనం పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం
వృషభ రాశి ఈ వారం వృషభ రాశి వ్యాపారులు ఆశించిన ప్రయోజనం పొందుతారు. పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. ధన సేకరణలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. తప్పుడు ప్రవర్తను మార్చుకుంటే మంచిది. సమయపాలనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
మిథున రాశి ఈ రాశి వ్యాపారులు నష్టపోతారు. తొందరపడి కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. కొంతమంది మీ ఇమేజ్‌కి హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు. అత్తమామలతో మంచి సంబంధాన్ని మెంటైన్ చేయండి. వైవాహిక జీవితంలో ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి..కానీ అవగాహనతో వాటిని మీరు అధిగమిస్తారు.
కర్కాటక రాశి ఈ వారం రాబోయే సవాళ్లను అధిగమించేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. కాస్త ఓపికగా వ్యవహరించండి. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీతో శత్రుత్వం ఉన్నవారు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.
సింహ రాశి బ్యాంకు నుంచి అప్పులు పొందాలి అనుకున్న వారికి సమస్య తొలగిపోతుంది. వ్యాపారానికి సంబంధించి కొత్త వ్యక్తులను కలుస్తారు. స్త్రీ స్నేహితుల వల్ల కొన్ని కొత్త సమస్యలు ఎదుర్కోవలసి రావొచ్చు. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరగుతాయి. కొన్ని కొత్త పనుల భారం మీ భుజంపై పడతాయి.
కన్యా రాశి ఈ వారం ఈ రాశివారు కొన్ని విషయాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. భూమి లేదా ఆస్తి తీసుకోవడం గురించి ఆలోచించవచ్చు. డబ్బు కొరత ఉండడం వల్ల ముఖ్యమైన పనులపై ఆ ప్రభావం పడుతుంది. మీ తెలివితేటలతో అందర్నీ మెప్పిస్తారు.
నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు