నవంబరు 19 రాశిఫలాలు



మేష రాశి
ఆర్థిక ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఈ రాశివారికి ఇదే సరైన సమయం. స్నేహితుల సహకారంతో అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆదాయాన్ని పెంచే వనరులు వెతుక్కుంటారు. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారు..వ్యాపారం బాగా సాగుతుంది.



వృషభ రాశి
ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు ఈ రోజు పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం సూచనలున్నాయి. ఈ రాశి విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు. మీ బాధ్యత పెరుగుతుంది. సృజనాత్మక పనులకు ఈ రోజు మంచి రోజు. మనసులో ఎన్నో కొత్త ఆలోచనలు రావొచ్చు.



మిథున రాశి
ఈ రోజు మీపై ఒత్తిడి తగ్గుతుంది. కళ, రచనలతో అనుబంధం ఉన్నవారికి రాబోయే కాలం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాల ద్వారా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపారం విస్తరిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు పొందవచ్చు.



కర్కాటక రాశి
ఈ రాశివారు కార్యాలయంలో సీనియర్ల నుంచి ఒత్తిడి, ఇంట్లో అసమ్మతి కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇది పనిలో మీ ఏకాగ్రతకు భంగం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది ..అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ సోదరుల నుంచి సహకారం ఉంటుంది.



సింహ రాశి
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఈ రోజు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ముందుకు దూకొద్దు...ఓసారి ఆలోచించి అడుగేయడం మంచిది. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో మీరు ఇబ్బంది పడతారు. పాతవివాదాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.



కన్యా రాశి
ఈ రోజు మీతు శుభవార్తతో ప్రారంభమవుతుంది. విద్యార్థులకు చదువుపరంగా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు కొన్ని ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.



తులా రాశి
ఇతరులను విమర్శించే మీ అలవాటు కారణంగా మీరుకూడా విమర్శలకు గురవుతారు. మీ 'సెన్స్ ఆఫ్ హ్యూమర్'ని సరిగ్గా ఉపయోగించుకోండి. ఆలోచించి మాట్లాడడం వల్ల కఠినమైన సమస్యలను సులువుగా పరిష్కరించుకోగలుగుతారు.



వృశ్చిక రాశి
ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు మిత్రుల సహకారంతో పూర్తి చేస్తారు. ఇంట్లోకి అకస్మాత్తుగా అతిథి రావచ్చు. పాతమిత్రులను కలిసే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఉద్యోగులు పనిలో ఉత్సాహంగా ఉంటారు.



ధనుస్సు రాశి
ఈ రాశివారిపై శని అనుగ్రహం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కన్నా మెరుగుపడుతుంది. మీ గౌరవం పెరుగుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. చిత్తశుద్ధితో, నిజాయితీతో చేసిన పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు.



మకర రాశి
మీ ఆరోగ్యం మెరుగుపడేందుకు మీ ఆహారపు అలవాట్లను మెరుగుపరచండి. త్వరగా డబ్బు సంపాదించాలనే బలమైన కోరిక కలిగి ఉంటారు. బంధువులు లేదా స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. మీ ప్రియమైన వారితో కఠినంగా మాట్లాడటం మానుకోండి..లేదంటే పశ్చాత్తాపపడతారు



కుంభ రాశి
ఈ రోజు అదృష్టం మీకు కలిసొస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. భౌతిక సుఖాల పట్ల మీ ధోరణి మారుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఏదైనా పని గురించి లోతుగా ఆలోచిస్తే ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి.



మీన రాశి
ఈ రోజు మీరు ఓపికగా పనిచేయాలి. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. పనిచేసే ప్రదేశంలో హడావుడి పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. నూతన పెట్టుబడులకు సరైన సమయం కాదు..