నవంబరు 14 రాశిఫలాలు



మేష రాశి
ఈ రోజు మేషరాశి ఉద్యోగులు కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటారు. ప్రయాణం చేయాల్సిన అవసరం రావొచ్చు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధపెట్టాలి.



వృషభ రాశి
మీరు మరింత పురోగతి చెందేందుకు మీ ప్రవర్తన, పనితీరులో మార్పులు అవసరం అవుతాయి. టైమ్ కి తగ్గట్టు ప్లాన్ చేసుకుని పని పూర్తిచేయడం మంచిది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యుత్ పరికరాలు కొనుగోలు చేస్తారు.నూతన పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించండి.



మిథున రాశి
ఈ రాశివారికి గ్రహాలు అనకూలంగా ఉంటాయి. ఈ రోజు మీ పనిలో వేగం ఉంటుంది. మనసంతా ఆనందంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మీరు మొదలెట్టిన పనులకు కుటుంబం నుంచి సహకారం అవసరం అవుతుంది. అవసరమైన పనిని సమయానికి పూర్తిచేయండి.



కర్కాటక రాశి
మీ విజయం వెనుక మీ కృషితో పాటు చాలా మంది ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఆరోగ్యం కోసం ధనం వెచ్చిస్తారు. కుటుంబంలో కొన్ని సంఘటనలు జరగడం వల్ల సభ్యుల మధ్య ఉన్న దూరం తొలగిపోతుంది.మీ శత్రువర్గం యాక్టివ్ గా ఉంటుంది మీరు అప్రమత్తంగా ఉండాలి



సింహ రాశి
చట్టపరమైన అడ్డంకులు ఎదురవుతాయి. ఏదో ఒక విషయంలో అశాంతి ఉంటుంది. చమురు వ్యాపారులు ఈ రోజు ఎక్కువ లాభాలు పొందుతారు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ముందడుగు వేయండి



కన్యా రాశి
జీవితం చాలా చిన్నది..మీ తప్పులను సకాలంలో సరిదిద్దుకోవడం మంచిది. కుటుంబంలో ఉన్న సమస్యలను ప్రశాంతంగా ఆలోచించి పరిష్కరించండి. ప్రభావవంతమైన వ్యక్తితో సమావేశమవుతారు.



తులా రాశి
ఏదో విషయంపై చింతించడం మానేయండి. ఏం జరిగినా మీ మంచికే జరిగిందని అర్థం చేసుకోండి. ముఖ్యంగా వ్యర్థపు ఆలోచనల నుంచి బయటపడితే కానీ సక్సెస్ దిశగా అడుగేయలేరు. మీ వాక్చాతుర్యంతో పనులు పూర్తిచేయగలుగుతారు. మీ శత్రువులు మీకు హానికలిగించవచ్చు..జగ్రత్తగా ఉండాలి.



వృశ్చిక రాశి
ఈ రోజు వివాదాలు జరిగే సూచనలున్నాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరుచు కునేందుకు వైద్యులను సంప్రదిస్తారు. వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. అనుకోని బహుమతులు అందుతాయి. సమాజంలో పేరున్న వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది.



ధనుస్సు రాశి
సమయం అస్థిరత వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబంలో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయి. వినోదాత్మక రంగాలకు చెందిన వ్యక్తుల గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు పనిచేసే ప్రదేశంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.



మకర రాశి
అపరిచితులను నమ్మవద్దు. అనుకున్న పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు తప్పవు. ఆహారం విషయంలో నియంత్రణ అవసరం. ఆకస్మిక ఖర్చులు పెరగడం వల్ల బడ్జెట్ దెబ్బతింటుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉంటుంది.



కుంభ రాశి
కుంభరాశివారి వ్యాపారాభివృద్ధికి అవకాశాలున్నాయి. చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చేసుకోవద్దు..కాస్త ఆలోచిస్తే సింపిల్ గా పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపారులకు అనుకూల సమయం. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది.



మీన రాశి
ఏ విషయంలో అయినా కాస్త ఓపిక పట్టండి. తొందరపాటు వల్ల నష్టం జరగవచ్చు. న్యాయపరమైన వ్యవహారాల్లో చిక్కుకోవద్దు. చిన్న చిన్న విషయాల్లో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. తోబుట్టువులతో సంతోషంగా గడుపుతారు.