కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ వారం తులా రాశి నుంచి మీన రాశి వరకూ ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
తులా రాశి ఈ వారం తులారాశి వారికి అనుకూల ఫలితాలున్నాయి. చాలా కాలంగా ఉద్యోగం మార్పు, బదిలీ గురించి ఆలోచిస్తున్న వారి కోరిక ఈ వారంలో నెరవేరే అవకాశం ఉంది. అదనపు ఆదాయ వనరులు చేకూరతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ వారం ప్రత్యేకంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోండి.
వృశ్చిక రాశి ఈ రాశివారికి ఈవారం ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సంతోషం కోసం చేసే పనులు సక్సెస్ అవుతాయి. వ్యాపారులు ఏదైనా పెద్ద డీల్ మాట్లాడుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే మంచిది. మీ జీవిత భాగస్వామి భావాలను, అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
ధనస్సు రాశి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం ధనస్సురాశివారికి శుభఫలితాలున్నాయి. అనుకున్న పనులకు చిన్న చిన్న అడ్డంకులున్నా పూర్తవుతాయి. కార్యాలయంలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఈ వారం ఫలించే అవకాశం ఉంది. కాస్త ఓర్పుగా వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి.
మకర రాశి ఈ రాశివారికి ఈ వారం ఆరంభంలో కన్నా ద్వితీయార్థం బావుంటుంది. సన్నిహితుల కారణంగా మంచి జరుగుతుంది.కీలక విషయాల్లో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వారం ప్రారంభంలో కార్యాలయంలో అదనపు భారం ఉన్నప్పటికీ రాను రాను రిలీఫ్ గా ఉంటుంది. పని విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించవద్దు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.
కుంభ రాశి ఈ వారంలో చేసే పనుల్లో ఆంటకాలు ఉన్నప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగితే సక్సెస్ అవుతారు. మీ బాధ్యతలు పెరుగుతాయి. పని విషయంలో ఒత్తిడి పెరిగినప్పటికీ మీప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు ఆశించిన లాభాలు పొందుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి.
మీన రాశి ఈ వారం మీ కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. విదేశాల్లో వృత్తి, వ్యాపారాలు చేయాలనే ఆలోచనలో ఉన్న వారు సమస్యల్ని అధిగమించి ముందడుగు వేస్తారు.నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు పరిష్కరించుకోవడం మంచిది.
ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు