మేష రాశి ఓ ప్లాన్ ప్రకారం మందుకెళితే అనుకున్న పనులు పూర్తవుతాయి.కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం తీసుకుంటే ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కొన్ని సందర్భాల్లో మీ మాటతీరుని బట్టి ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది..ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.
వృషభ రాశి ఈ వారం మనోధైర్యంతో ముందుకుసాగండి. ఆర్థిక వ్యవహారాల విషయంల జాగ్రత్తగా వ్యవహరించండి.మీ ప్రణాళిలను బహిర్గతం చేయొద్దు. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. వేరేవారి విషయాల్లో తలదూర్చవద్దు..వివాదాలకు దూరంగా ఉండండ మంచిది.
వృషభ రాశి ఈ వారం మనోధైర్యంతో ముందుకుసాగండి. ఆర్థిక వ్యవహారాల విషయంల జాగ్రత్తగా వ్యవహరించండి.మీ ప్రణాళిలను బహిర్గతం చేయొద్దు. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. వేరేవారి విషయాల్లో తలదూర్చవద్దు..వివాదాలకు దూరంగా ఉండండ మంచిది.
కర్కాటక రాశి ఈ వారం కర్కాటక రాశివారికి అనుకూలంగా ఉంటుంది. మీరు పనిచేసే రంగాల్లో మీదే పైచేయిఅవుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారల నుంచి సహకారం అందుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకానికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం రెండూ బావుంటాయి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి
సింహ రాశి సింహ రాశి వారికి ఈ వారం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. వారం ప్రారంభంలో ఓ శుభవార్త వింటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు కలిసొస్తాయి. భూములు-భవనాలు కొనుగోలు చేయాలి అనుకున్న వారికి ఇదే సరైన సమయం. విదేశాలలో ఉద్యోగం, విద్య కోసం ప్రయత్నించే వారికి ఇదే శుభసమయం.
కన్యా రాశి వారం ప్రారంభంలో ప్రయాణాలు చేస్తారు. తలపెట్టిన పనుల్లో లాభం అనుకున్న దానికన్నా తక్కువే ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాటపడడం తప్పదు. వృత్తి లేదా ఉద్యోగం- కుటుంబానికి మధ్య సమతుల్యత పాటించండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.
నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు