మేష రాశి మీ అలవాట్ల వల్ల మీ సన్నిహితులు, బంధువులు,స్నేహితులు ఇబ్బంది పడతారు. సోమరితనం కారణంగా ముఖ్యమైన పనులు పెండింగ్‌లో ఉంచుతారు. పిల్లల ప్రవర్తన వల్ల మనసు బాధగా ఉంటుంది.
వృషభ రాశి ఈ రోజు మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రత్యేక వ్యక్తితో పరిచయం మీకు కొత్త శక్తినిస్తుంది. తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం..తొందరపాటు వద్దు.
మిథున రాశి కుటుంబ సభ్యులతో సంబంధాలు బలహీనంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల వల్ల ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. సోదరుల సహకారం లేకపోవడం వల్ల పనులు పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి.
కర్కాటక రాశి అనవసరంగా కోపం తెచ్చుకోకండి. మీలో సహజంగా ఉంటే మర్యాదపూర్వక ప్రవర్తనను కొనసాగించండి. ఇతరులతో అస్సలు పోల్చుకోవద్దు. అవివాహితులకు వివాహాల్లో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారులు పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఆర్థిక నష్టం ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికందుతుంది.
సింహ రాశి ఈ రోజు మీకు మంచి రోజు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రేమ, గౌరవం పొందుతారు. తల్లి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది జాగ్రత్త. ఆర్థికంగా కొంత తగ్గుదల ఉంటుంది. భూములపై పెట్టుబడి పెట్టడం శుభప్రదం
కన్యా రాశి ఉద్యోగాలు చేస్తున్నవారు కొంత ఒత్తిడికి గురవుతారు. ఇల్లు మారే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దు. తలపెట్టిన పనులకు జీవిత భాగస్వామి మద్దతు లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. ఆందోళన పెరుగుతుంది.
తులా రాశి మీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మంచిది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులకు ఇది మంచి సమయం. మీ ఆలోచనలను మార్చుకుని సానుకూల ఆలోచనను కొనసాగించడం సముచితంగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి.
వృశ్చిక రాశి తక్కువ మాట్లాడండి..పని ఎక్కువ చేయండి. పిల్లల వివాహానికి సంబంధించి మీపై కొంత ఒత్తిడి ఉంటుంది. అనుకున్న పనులు ముందుకు సాగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆస్తులకు సంబంధించిన వివాదాలను సకాలంలో పరిష్కరించుకోకుంటే చాలాకాలం పెండింగ్ లోకి వెళ్లిపోతాయి
ధనుస్సు రాశి ఉన్నత స్థితికి చేరుకోవాలనే తపనతో ఇతరులు చేసే ఉపకారాలను విస్మరించవద్దు. ఎవ్వరినీ తక్కువ చేసి మాట్లాడకండి. పనిపై శ్రద్ధ పెట్టండి. పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి ఒకేసారి నాలుగైదు పనులు తలపెట్టడంతో ఒత్తిడికి లోనవుతారు. జీవిత భాగస్వామి పొరపాటు కారణంగా మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఏదైనా ప్రత్యేక సమస్యలు తల్లిదండ్రులతో చర్చిస్తారు. కెరీర్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది.
కుంభ రాశి కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహించండి. చాలా కాలంగా ఉన్న కుటుంబ సమస్యలు తీరుతాయి.
మీన రాశి వ్యాపారంలో మార్పుల మధ్య స్నేహితుల సహకారం ఉంటుంది. ఏదో తెలియని భయంతో బాధపడతారు. ఆర్థిక శ్రేయస్సుతో పాటు, డబ్బు పెట్టుబడికి అనుకూలమైన సమయం. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది.