తులా రాశి ఈ వారం తులారాశివారికి ప్రత్యేకంగా ఉంటుంది. పెళ్లి సంబంధాలు కుదరడంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఈ వారం ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యంలో పాల్గొనే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ పనితీరుపై ప్రత్యేక దృష్టి ఉంటుంది
వృశ్చిక రాశి మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవలసి ఉంటుంది. ఈ వారం మీరు వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన సొమ్ము తిరిగి రావడం కష్టమే. కార్యాలయంలో పరిస్థితుల కారణంగా ఉద్యోగం మారాలనే ఆలోచన రావొచ్చు. వైవాహిక జీవితంలో విడిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు.
ధనుస్సు రాశి ఈ వారం ప్రారంభంలో మనస్సు ఆనందంగా ఉంటుంది. కొత్త స్నేహితులు ఏర్పడతారు. ఒంటరిగా ఉన్నవారు కొత్త బంధంలోకి అడుగుపెడతారు. జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామి కోసం అన్వేషణ పూర్తవుతుంది. ఎంత కష్టపడితే అంత డబ్బు పొందుతారు. కార్యాలయంలో కొత్త బాధ్యతలు పెరుగుతాయి.
మకర రాశి ఈ వారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శని మీ రాశిలో సంచరిస్తున్నందున జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదించాలని ప్రయత్నించకండి. అలా చేస్తే తీవ్రంగా నష్టపోతారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.
కుంభ రాశి ఈ వారం మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది...వేరే వారి చేతుల్లో మోసపోయే అవకాశం ఉంది . ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మకండి. ఆన్‌లైన్ లావాదేవీలలో జాగ్రత్త అవసరం. కార్యాలయంలో వినియోగించే కంప్యూటర్ నుంచి సరిగ్గా సైన్ ఔట్ చేయండి. చదువు, ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సరికాదు.
మీన రాశి ఈ వారం మీ రాశిలో దేవగురువు బృహస్పతి తిరోగమనం చెందుతున్నాడు. ఎప్పటి నుంచో వెంటాడుతున్న కొన్ని సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. తలపెట్టిన పనుల్లో అడ్డంకులు ఉండవు. దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోతాయి.
నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు