Guppedantha Manasu November 22nd Update: మహేంద్రకి గడువు విధించిన రిషి - దేవయాని కుట్ర బయటపెట్టే పనిలో గౌతమ్
Guppedantha Manasu November 22th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu November 22nd Today Episode 614)
యూనివర్శిటీ టాపర్ గా వసుధార రావడంతో ఆ ఫంక్షన్ కాలేజీలో ఘనంగా జరుగుతుంది. అందరూ బొకేలు ఇస్తారు..వసు మెడలో రిషి పూలమాల వేస్తాడు. జగతి-మహేంద్ర ఆనందానికి హద్దుండదు... ఆ తర్వాత ఇంటర్యూ మొదలు పెట్టండి అంటుంది జగతి. ఇంతలో వసుధార ఓ రిక్వెస్ట్ అంటుంది. నన్ను ప్రోత్సహించి నన్ను నడిపించిన రిషి సార్-జగతి మేడం నా పక్కనే ఉండాలి అంటుంది. జగతి-రిషి ఇద్దరూ సరే అంటారు. జగతి కాళ్లకి నమస్కరించి ఇంటర్యూకి కూర్చుంటుంది వసుధార. నన్ను నడిపించంది జగతి మేడం అయితే ఈ ప్రయాణంలో ధైర్యం నింపింది రిషి సార్ అంటూ ఇద్దర్నీ పొగుడుతూ ఇంటర్యూలో సమాధానాలు చెబుతుంది వసుధార.
కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి
వసుధార: ఎక్కడో ఓ మూలనున్న అందమైన పల్లెటూరు...అమ్మా-నాన్న అక్కయ్యలు ఇదే నా కుటుంబం. జీవితంపై ఎన్నో ఆశలతో కలలతో ఈ కాలేజీకి చేరుకున్నాను. ఇల్లు-కుటుంబం-ఊరుని వదిలేసి ఒంటరిగా ఇక్కడకు వచ్చాను, పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ చదువుకున్నాను..చివరికి నా కష్టానికి ఫలితం దక్కింది..
Also Read: శౌర్య ఎక్కడుందో మోనితకి తెలిసిపోయింది, ఎగిరిపోయిన పోస్టర్ కార్తీక్-దీప చూస్తారా!
యూనివర్శిటీ టాపర్ అవ్వాలంటే ఏం చేయాలంటే మీరు స్టూడెంట్స్ కి ఏం చెబుతారు
వసుధార: విజయానికి మూడు సూత్రాలు...శ్రమ-శ్రమ-శ్రమ....వెళ్లేదారిలో కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు ఇలా ఎన్నెన్నో ఉంటాయి అన్నింటినీ భరించాలి..అవసరమైన చోట ఎదిరించాలి..అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి...
మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి
ఎక్కడికీ వెళ్లను..ఇక్కడే ఉంటాను..
ఏదైనా పెద్ద ఉద్యోగంలో స్థిరపడతారా
అవును..స్టూడెంట్స్ కి చదువుచెప్పే ఉద్యోగంలో స్థిరపడతాను...( గతంలో లెక్చరర్ అవుతానని వసు అన్న మాటలు గుర్తుచేసుకుంటాడు రిషి)
మీరేం భావిస్తున్నారన్న ప్రశ్నకు..
రిషి: వసుధార అందరికీ ఆదర్శంగా నిలిచింది..తను జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నానంటూ ఇంటర్యూ పూర్తిచేస్తాడు...
ఆ తర్వాత రిషి..వసుతో... నువ్వు ఈ కాలేజీకే కాదు నాక్కూడా చాలా ముఖ్యం అని చెప్పాలనిపిస్తోంది అంటాడు..వద్దు సార్ ఇది సందర్భం కాదంటుంది వసుధార...ఆ తర్వాత అందరూ సెల్ఫీలు తీసుకుంటారు... మహేంద్ర జగతికి సైగ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తాడు... వసుధార జగతి చేయి వదలదు...మహేంద్ర వెళుతుండగా రిషి వెళ్లి చేయి పట్టుకుంటాడు...నన్ను వదిలి వెళ్లొద్దని అడుగుతాడు...ఇంతలో రిపోర్టర్ వచ్చి రిషిని మాటల్లో పెడతాడు... మహేంద్ర అక్కడి నుంచి జారుకునేందుకు ప్రయత్నిస్తాడు...ఇంతలో జగతి ఎదురుపడుతుంది రిషికి..
రిషి: డాడ్ ఏ విషయంలో నాపై కోపం పెంచుకున్నారో తెలియదు కానీ తనని మీరు జాగ్రత్తగా చూసుకోండి మేడం..
జగతి: అది నా బాధ్యత రిషి
రిషి: మీరు నాకో సాయం చేయాలి మేడం..పదండి డాడ్ దగ్గరకు వెళదాం అని రిషి అంటాడు..ఈ లోగా స్టూడెంట్స్ వచ్చి సెల్ఫీ పేరుతో చుట్టుముడతారు...
బయటకు వచ్చిన జగతి మనం వెళ్లాలా మహేంద్ర అని అడుగుతుంది...కొన్ని తప్పవు అంటూ మహేంద్ర కారు డోర్ తీస్తుండగా రిషి వచ్చి చేయిపట్టుకుంటాడు...మీతో మాట్లాడాలి అంటాడు..
Also Read: మీడియా ముందు అడ్డంగా బుక్కైన రిషి, వసు- మహేంద్ర ఎంట్రీ అదుర్స్, దేవయాని ప్లాన్ తుస్స్
అటు ఇంట్లో అందరూ కాలేజీలో జరిగిన ఫంక్షన్ గురించి చెప్పుకుని మురిసిపోతుంటే దేవయాని రగిలిపోతుంది.. అసలు ఎక్కడికి వెళ్లారు, ఎందుకెళ్లారో అడిగారా అంటే..నిదానంగా వాళ్లే చెబుతారులే అంటాడు. అసలు ఎవర్ని సాధించారని వెళ్లారని దేవయాని అడిగితే..ఆ విషయం వదిలేద్దాం..రిషి రాగానే ఇవన్నీ అడగొద్దు అంటాడు ఫణీంద్ర..
గౌతమ్: అసలు అదేం కుట్రో..రిషి-వసుని అందరి ముందూ తలదించుకునేలా చేద్దాం అని ఎవరు అనుకుంటున్నారో...
ఫణీంద్ర: రిషి-వసు ఒకర్నొకరు కోరుకుంటున్నప్పుడు వాళ్లిద్దర్నీ ఇబ్బంది పెట్టాలని ఎవరు అనుకుంటారు
గౌతమ్: కొంచెం గ్రౌండ్ వర్క్ చేస్తే అసలు విషయం బయటపడుతుంది కదా
దేవయాని: హర్ట్ అయిన దేవయాని..ఇంక ఆపుతావా అని అరిచి లేచి వెళ్లిపోతుంది...
రిషి-మహేంద్ర ఓ దగ్గర...వసు-జగతి మరొ దగ్గర నిల్చుంటారు...
రిషి: డాడ్..ఏం జరిగిందని మీరు ఎందుకు వెళ్లారని నేను అడగను మిమ్మల్ని దూరం చేసుకుని మీరు లేని రిషి ఎలా ఉంటాడో ఆ బాధ ఎలా ఉందో నాకు మాత్రమే తెలుసు..మీరెప్పుడూ నాతోనే ఉండాలి
మహేంద్ర: కాలం-పరిస్థితులు ఈ రెండూ మనుషుల కన్నా బంధాల కన్నా బలమైనవి... అవి ఆడిస్తాయి..అవే శాసిస్తాయి.. ఇప్పుడు జరిగింది కూడా ఇదే..కొన్ని ప్రమేయం లేకుండా జరుగుతాయి..వాటికి మనం బాధ్యులం కాదు బాధితులం మాత్రమే అవుతాం..
రిషి: డాడ్..మీరు ఎన్ని చెప్పినా సరే..జరిగిందేదో జరిగింది..నాపై కోపం వచ్చిందో, నేనేదైనా తెలియక తప్పుచేశానో.. పెద్దమ్మ ముందు మమ్మల్ని హర్ట్ చేశానో..ఏదేమైనా ఈ రిషి మిమ్మల్ని వదిలి ఉండలేడు డాడ్..
మహేంద్ర: చెట్లకు కాయలు కాస్తాయి..కొన్నాళ్లకి ఆ కాయలే చెట్లనుంచి విడిపోతాయి..అది ప్రకృతి ధర్మం..కొన్ని బంధాలు కూడా ఇలాగే దూరమైపోతాయి..అయ్యాయి కూడా...
రిషి: నేను జరిగిపోయిన దానిగురించి అడగడం లేదు..జరగాల్సిన దానిగురించి ఆశపడుతున్నాను...
మహేంద్ర: మేం ఎందుకు వెళ్లామో ఆ పరమార్థం కూడా ఇంకా అసంపూర్ణంగా మిగిలిపోయింది
రిషి: మీరు వెళ్లిన దానిగురించి కాదు..మీరు నాతోపాటూ ఇంటికి రావాలని ఆశపడుతున్నాను...కానీ మీరు మళ్లీ వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు కదా... ఏంటి డాడ్ ఇది..నాకు విధించిన శిక్ష సరిపోలేదు అనుకుంటున్నారా...అన్నీ పోగొట్టుకోవడం అందర్నీ దూరం చేసుకోవడం చిన్నప్పటి నుంచీ జరుగుతూనే ఉందికదా..నాకున్నది మీరే కదా..మిమ్మల్ని మించి నాకెవరున్నారు... నేనోదే తెలిసో, తెలియక అంటే వెళ్లిపోతారా..ఇంత పెద్ద శిక్ష వేస్తారా
మహేంద్ర: శిక్ష వేశాను అని నువ్వు అనుకుంటున్నావ్..నాకు నేనే శిక్ష విధించుకున్నానని నేను భావిస్తున్నాను
రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
ఈ రోజు రాత్రంతా ఆలోచించుకోండి..మీ మనసు ఏం చెబితే అదే చేయండి.. రావాలని అనిపిస్తే సూర్యోదయంగా ఇంటికి రండి అంటాడు... నేనొకటి నిర్ణయించుకున్నాను అని మహేంద్ర అంటాడు...అటు రిషి రేపు పొద్దున్న డాడ్ వస్తారంటావా అని వసుధారని అడుగుతాడు...