News
News
X

Karthika Deepam November 22nd Update: శౌర్య ఎక్కడుందో మోనితకి తెలిసిపోయింది, ఎగిరిపోయిన పోస్టర్ కార్తీక్-దీప చూస్తారా!

కార్తీకదీపం నవంబరు 22 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

FOLLOW US: 

Karthika Deepam November 22nd  Episode 1516 (కార్తీకదీపం నవంబరు 22 ఎపిసోడ్)

శౌర్య ఎక్కడికి వెళ్లిందో అని ఇంద్రుడు-చంద్రమ్మ ఆలోచిస్తుంటారు..ఇంతలో పోస్టర్స తీసుకొచ్చి షాక్ ఇస్తుంది శౌర్య. పోస్టర్లో అమ్మ నాన్న ఫోటోలు వేయిద్దాం అంటే నా దగ్గర వాళ్ళ ఫొటోస్ లేవు అందుకే నా ఫోటో వేయించి నీ ఫోన్ నెంబర్ ఇచ్చాను బాబాయ్ ఈ సంగారెడ్డి మొత్తం ఈ పోస్టర్లు అతికిద్దాం  అమ్మ నాన్నలు ఇక్కడికి వస్తే నీకు  కచ్చితంగా ఫోన్ చేస్తారు అనడంతో ఇంద్రుడు ఏం మాట్లాడాలో తెలియక సరే అమ్మ అని అంటాడు. ఇప్పుడే వెళ్లి అతికిద్దాం అని శౌర్య అంటే..రేపు ఉదయాన్నే వెళదాం అని సర్దిచెప్పి పంపిస్తారు..

మరోవైపు హాస్పిటల్లో కార్తీక్..ఓ పేషెంట్ కి ఆపరేషన్ చేస్తాడు.. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది నాలుగు రోజుల్లో డిస్చార్జ్ చేయొచ్చు అని చెప్పడంతో ఆ డాక్టర్ థాంక్స్ చెప్పి కార్తీక్ కి డబ్బులు ఇస్తాడు. అప్పుడు ఆ డబ్బులు చూసిన కార్తీక్ మొన్న చైన్ అమ్మానని చెప్పాను ఇప్పుడు ఉంగరం అమ్మానని మోనిత కు చెప్పాలి లేకపోతే అనుమానం వస్తుంది అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు మోనిత కార్తీక్ ని ఫాలో అవుదాం అనుకుంటే కార్తీక్ మిస్ అయిపోయాడు అనుకునే టెన్షన్ పడుతూ ఉంటుంది.

Also Read: మీడియా ముందు అడ్డంగా బుక్కైన రిషి, వసు- మహేంద్ర ఎంట్రీ అదుర్స్, దేవయాని ప్లాన్ తుస్స్

News Reels

అటు కార్తీక్ కోసం దీప ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది మోనిత. అప్పుడు మోనిత శౌర్య ఇంద్రుడు దంపతులు ఉన్న ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కార్తీక్ మాటలు చూస్తే గతం గుర్తుకు రానట్లే ఉన్నాయి కానీ చేష్టలు చూస్తే గతం గుర్తుకు వచ్చిందన్న డౌట్ వస్తోంది అని ఆలోచిస్తూ ఉంటుంది మోనిత. ఇంతలో దీప అక్కడికి వచ్చి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ మోనిత చేతిలో ఉన్న ఆ ఫోటోని లాక్కుంటుంది. అప్పుడు నీ కూతురు కనిపించిందా వంటలక్క అని అడుగుతూ ఉండగా ఇంతలోనే కార్తీక్ అక్కడికి వచ్చి ఇదిగో చూడు కార్తీక్... దీప కూతురు అని అనడంతో వెంటనే కార్తీక్ వంటలక్క కూతురు నీకు కనిపించిందా అని మోనిత ని ఎదురు ప్రశ్నిస్తాడు. ఇంతకుముందెప్పుడూ చూడలేదా అని పదే పదే ప్రశ్నించినా  లేదు కార్తీక్ చూడలేదని సీరియస్ అవుతుంది. తిరిగి నువ్వెక్కడికి వెళ్లావ్ అని మోనిత అడగడంతో ఉంగరం తాకట్టు పెట్టడానికి వెళ్లానులే అంటాడు. ఈ వంటలక్క కోసమేనా అని అరిచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత. ఈ ఫోటోని జాగ్రత్తగా పెట్టుకో మోనిత కంట కనపడకుండా ఉండాల్సింది సరే జాగ్రత్తగా ఉండు అని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు దీప బట్టలు సర్దుతూ ఉండగా ఒక్కసారిగా కళ్ళు తిరుగుతాయి. 

Also Read: కార్తీక్ ని ఫాలో అవుతున్న మోనిత- తల్లిదండ్రుల కోసం శౌర్య పోస్టర్స్ ప్లాన్

ఇంద్రుడు సౌర్య కలసి గోడలకి పోస్టర్స్ అతికిస్తూ ఉంటారు.  చంద్రమ్మ మాత్రం  శౌర్య పోటోలకు రంగులు వేస్తూ ఆ ఫోటోలు నెంబర్లు కనిపించకుండా చేస్తూ ఉంటుంది.  క్షమించు సౌర్యమ్మ ఇలా చేస్తున్నందుకు అని అనుకుంటుంది. కానీ అన్నింటిలో ఓ ఫొటో ఊడి ఎగిరిపోతుంది( అది ఎవరైనా చూస్తారేమో మరి) 

దీప- కార్తీక్
కార్తీక్ వెళ్లేసరికి దీప పడుకుని ఉంటుంది..ఏమైందని అడిగితే.. ఈ మధ్య నాకు బాగుండడం లేదని చెబుతుంది. హాస్పిటల్ కి వెళదాం అనగానే...నా కూతురు కనిపిస్తే నేను బాగా అయిపోతాను డాక్టర్ బాబు అనగానే..ఫస్ట్ శౌర్య గురించి ఆలోచించడం మానేయ్ శౌర్య దొరుకుతుందని ధైర్యం చెబుతాడు. 
 
మోనిత-దుర్గ
మోనిత ఇంటికెళ్లేసరికి తాళం వేసి ఉంటుంది...ఎవరు వేశారని ఆలోచిస్తూ కొంపతీసి సౌందర్య ఆంటీ ఏమైనా వచ్చిందా అని అనుమాన పడుతుంది..ఇంతలో కిటికీ లోంచి దుర్గ..బంగారం అని పిలుస్తాడు. బయట తాళాలు వేసి లోపల ఏం చేస్తున్నావురా అని అరుస్తుంది మోనిత. అప్పుడు దుర్గ నువ్వు ఇంటి బయట ఎవరి తల పగలగొట్టావో చెబితే తాళం తీస్తానంటాడు. నాకేం తెలియదని మోనిత చెప్పినా దుర్గ అస్సలు వదలడు. నువ్వు చెప్పకపోతే కార్తీక్ సార్ కి ఇంకా అనుమానం పెంచుతానని బెదిరిస్తాడు. ఇంతలో కార్తీక్ అక్కడకు వస్తాడు..

రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
నాకు తొందరగా మిమ్మల్ని చూడాలని ఉందని శౌర్య ఆలోచిస్తుంటుంది...మరోవైపు దీప సంగారెడ్డి వెళ్లేందుకు బయలుదేరుతుంది. అక్కడే ఉందని నమ్మకం ఏంటని కార్తీక్ అడిగితే... ఇక్కడ ఏ నమ్మకంతో వెతికానో అక్కడా అదే నమ్మకంతో వెతుకుతాను..ప్రతిగడపా వెతుకుతాను అంటుంది..

Published at : 22 Nov 2022 09:24 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode 1516 Karthika Deepam Serial November 22nd

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu November 30th: తన ఐపీఎస్ కల నెరవేర్చమని అడిగిన రామా- అలా అయితేనే ఐపీఎస్ చదవాలని కండిషన్ పెట్టిన జానకి

Janaki Kalaganaledu November 30th: తన ఐపీఎస్ కల నెరవేర్చమని అడిగిన రామా- అలా అయితేనే ఐపీఎస్ చదవాలని కండిషన్ పెట్టిన జానకి

Gruhalakshmi November 30th: సామ్రాట్ ని దొంగలాగా పరుగులు పెట్టించిన తులసి- క్షమించమని కన్నీటితో వేడుకున్న అనసూయ

Gruhalakshmi November 30th: సామ్రాట్ ని దొంగలాగా పరుగులు పెట్టించిన తులసి- క్షమించమని కన్నీటితో వేడుకున్న అనసూయ

Guppedantha Manasu November 30th Update: జగతి ఆనందంపై నీళ్లు చల్లేసిన రిషి, మరో కుట్ర ప్లాన్ చేస్తోన్న దేవయాని!

Guppedantha Manasu November 30th Update: జగతి ఆనందంపై నీళ్లు చల్లేసిన రిషి, మరో కుట్ర ప్లాన్ చేస్తోన్న దేవయాని!

Karthika Deepam November 30th Update: కార్తీక్ ని ప్రశ్నించిన దీప, మోనితను తీసుకెళ్లిపోయిన సౌందర్య, ఇంద్రుడిలో మార్పు -ఇదే కీలక మలుపు

Karthika Deepam November 30th Update: కార్తీక్ ని ప్రశ్నించిన దీప, మోనితను తీసుకెళ్లిపోయిన సౌందర్య, ఇంద్రుడిలో మార్పు -ఇదే కీలక మలుపు

Ennenno Janmalabandham November 30th: యష్ మీద తనకున్న ప్రేమ బయటపెట్టిన వేద- కొడుకు మీద కోపంతో ఊగిపోతున్న మాలిని

Ennenno Janmalabandham November 30th: యష్ మీద తనకున్న ప్రేమ బయటపెట్టిన వేద- కొడుకు మీద కోపంతో ఊగిపోతున్న మాలిని

టాప్ స్టోరీస్

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?