Guppedanta Manasu November 21st: మీడియా ముందు అడ్డంగా బుక్కైన రిషి, వసు- మహేంద్ర ఎంట్రీ అదుర్స్, దేవయాని ప్లాన్ తుస్స్
Guppedantha Manasu November 21th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
వసు గదిలో ఉండగా దేవయాని మనిషి వచ్చి తలుపు గడి పెట్టేసి వెళ్ళిపోతాడు. బయట రిషి వసు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటమ్మా, మహేంద్ర ఎక్కడ అని ఫణీంద్ర జగతిని అడుగుతాడు. కానీ జగతి మాత్రం ఏం మాట్లాడకుండా రాలేదని తలఊపుతుంది. అసలు ఏం జరిగింది, ఈ కోపాలు ఏంటి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి, రిషి ఎంత బాధపడతాడో మీరిద్దరు ఒక్కసారి కూడా ఆలోచించలేదా? మహేంద్ర ఒక్క గంట కనిపించకపోతే ఎంత తల్లడిల్లిపోతాడు, అలాంటిది ఇన్ని రోజులు మహేంద్ర కనపడకపోతే ఎలా ఉంటాడో తన బాధని అర్థం చేసుకోవద్దా అని ఫణీంద్ర జగతితో అంటాడు. వసు బయటకి వచ్చేందుకు తలుపు తీస్తుంది కానీ గడి పెట్టి ఉండటం వల్ల రాదు. వసు ఎవరైనా ఉన్నారా అని పిలుస్తూనే ఉంటుంది కానీ ఎవరికి వినిపించదు.
Also Read: కార్తీక్ ని ఫాలో అవుతున్న మోనిత- తల్లిదండ్రుల కోసం శౌర్య పోస్టర్స్ ప్లాన్
వసు రిషికి ఫోన్ చేసి గదిలో లాక్ అయిపోయినట్టు చెప్తుంది. రిషి వచ్చి తలుపు తీస్తాడు. రిషి లోపలికి వెళ్ళడం చూసిన దేవయాని మనిషి వాళ్ళిద్దరూ గదిలో ఉండగా మళ్ళీ తలుపు గడియ పెట్టేస్తాడు. రిషి బయటకి వెళ్ళడానికి డోర్ దగ్గరకి వెళతాడు కానీ తలుపు రాదు. ఎవరో కావాలని గడి పెట్టారని వసు అంటుంది. దేవయాని మనిషి మీడియా అతని దగ్గరకి వెళ్ళి ప్లాన్ సక్సెస్ అయ్యిందని సైగ చేస్తాడు. అటు గౌతమ్ దేవయాని చేసిన కుట్ర ఏంటో తెలుసుకోవడానికి కాలేజీకి వస్తాడు. రిషి వాళ్ళు లోపల టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే దేవయాని మనిషి మళ్ళీ వచ్చి గడియ తీసేస్తాడు. రిషి ఇంకొక సారి ట్రై చేద్దామని తలుపు తీసేసరికి ఎదురుగా మీడియా వాళ్ళు, జగతి, ఫణీంద్ర అందరూ ఉంటారు. వాళ్ళని చూసి వసు షాక్ అవుతుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు.
మీడియా ఏంటి ఇది అని అడుగుతుంది. మేమిద్దరం లోపలికి వెళ్ళేసరికి ఎవరో గడియ పెట్టారని రిషి చెప్తాడు. మరి మేము వచ్చేసరికి మీరు తలుపు ఎలా తీశారు, మేము వచ్చేసరికి ఇలా కవర్ చేస్తున్నారా? అని తప్పుగా మాట్లాడతాడు. ఒక స్టూడెంట్ తో మీరు గదిలో ఉన్నారు, మేము వచ్చేసరికి గడియ పెట్టారని సింపుల్ చెప్పేశారు, అందరూ అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అని నీచమైన ప్రశ్నలు వేస్తారు. ఆ మాటలకి రిషి కోపంగా అరుస్తాడు. అసలు మీరిద్దరు ఈ గదిలోకి వచ్చారని మళ్ళీ అడుగుతాడు. వసు తన డ్రెస్ మీద జ్యూస్ పడిందని క్లీన్ చేసుకుని వచ్చేసరికి గడియ పెట్టి ఉంది రిషి సర్ కి ఫోన్ చేస్తే వచ్చారు, మళ్ళీ బయటకి వచ్చే టైమ్ కి ఎవరో గడియ పెట్టారని వసు చెప్తుంది. భలే స్టోరీ అల్లారు, కాలేజీ గదిలో దొరికిన స్టూడెంట్ ఇంకా.. అని అతను మాట్లాడుతుంటే ఆపమని రిషి గట్టిగా అరుస్తాడు.
Also Read: అభి-మాళవిక డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్, అంతలోనే షాక్ ఇచ్చిన వేద
వసుధార మీకే ఎందుకు ఫోన్ చెయ్యాలి, ఫ్రెండ్స్ ఉన్నారు కదా మీకే ఎందుకు చేసింది, మీరు ఈ కాలేజీ ఎండీ కదా మీకే ఎందుకు చేసింది, చేస్తే మీరే ఎందుకు వచ్చారు, ఎవరినైనా పంపించొచ్చు కదా చెప్పండి మీరే ఎందుకు రావాలి అని మీడియా అడుగుతుంది. రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి మహేంద్ర ‘నేను చెప్పొచ్చా’ అని వసు వాళ్ళు వచ్చిన గదిలోపల ఉండి అడుగుతాడు. మహేంద్రని చూసి రిషి చాలా ఎమోషనల్ అవుతాడు. ‘రిషి నాకోసం వచ్చాడు, తనని నేనే రమ్మన్నా, గదిలో ఇద్దరం ఉన్నాం ఆలోచనలు మారిపోతాయా, గదిలో ముగ్గురం ఉన్నాం ఏం కావాలి నీకు’ అని గట్టిగా అరుస్తాడు. అందరినీ వెళ్లిపొమ్మని చెప్తాడు. తర్వాత రిషి డాడ్ అని మహేంద్రని కౌగలించుకుని ఎమోషనల్ అవుతాడు. టైమ్ కి వచ్చి మంచి పని చేశావ్ అని ఫణీంద్ర అంటాడు. ఈ గదిలోకి ఎలా వచ్చావ్ అని జగతి అడుగుతుంది. రిషి వాళ్ళు బయటకి వచ్చేది మహేంద్ర చూసి ఆ గదికి ఉండే ఇంకో తలుపు తాళం తీసి లోపలికి వచ్చినట్టు చెప్తాడు. తర్వాత వసు ఇంటర్వ్యూ మొదలువుతుంది.