News
News
X

Ennenno Janmalabandham November 21st: అభి-మాళవిక డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్, అంతలోనే షాక్ ఇచ్చిన వేద

సులోచనకి యాక్సిడెంట్ చేసింది మాళవిక అని వేదకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
 

యష్ వేదని చూస్తూ మైమరిచిపోతాడు. తన షర్ట్ బటన్స్ కూడా తిక్క తిక్కగా పెట్టుకోవడం వేద గమనిస్తుంది. వెంటనే వెళ్ళి వాటిని సరిచేస్తుంది. ఎప్పుడు పరద్యానంగా ఉంటే రోజు చేసుకునే పని కూడా సరిగా చేసుకోలేరని అంటుంది. ‘నా మీద పీకల దాకా కోపం ఉంది, కానీ చేయాల్సినవన్నీ చేస్తుంది, నా భార్యే ఇలా ఉంటుందా అందరి భార్యలు ఇలానే ఉంటారా’ అని యష్ మురిసిపోతాడు. మళ్ళీ యష్ తన కోట్ తిరగతిప్పి వేసుకుంటుంటే వేద వచ్చి దాన్ని సరిగా వేస్తుంది. మాలిని యష్ ని కొట్టినందుకు ఫీల్ అవుతుంది. ఆఫీసుకి వెళ్లబోతుంటే మాలిని ఆపి తినమని చెప్తుంది కానీ యష్ వద్దని వెళ్ళిపోతాడు.

అభిమన్యు వచ్చి మాళవికకి సర్ ప్రైజ్ ఇస్తాడు. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నాం అని చెప్పడంతో మాళవిక చాలా హ్యపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే సెక్యూరిటీ వచ్చి కొన్ని పేపర్స్ ఇస్తాడు. సులోచన యాక్సిడెంట్ కేసులో కోర్టుకి రమ్మని సమన్లు వచ్చాయని మాళవిక అంటుంది. వెళ్ళి వెళ్ళి ఆ వేదని కెలికావ్ అది నన్ను పట్టుకుంటుంది, ఇది దాని పనే, ఎఫ్ఐఆర్ రాయించింది, కోర్టుకి రప్పిస్తుంది. నీకోసం ఆ యశోధర్ ని వదిలేసి వచ్చాను, కానీ తను నాకు హెల్ప్ చేస్తున్నాడు. కానీ నువ్వు నాకోసం ఏమి చేయలేదు’ అని మండిపడుతుంది. ‘నీ గురించి వేదకి చెప్పి తప్పు చేశాను, యష్ తో నువ్వు పిక్నిక్ కి వెళ్ళేసరికి జలస్ ఫీల్ అయ్యి చేశాను. కానీ ఇప్పుడు ఏమైంది మంచి లాయర్ ని పెడతాను అని అభి చెప్తాడు.

మాళవిక: ఖుషి కస్టడీ కూడా మనకే వచ్చేలా చేస్తాను అని చెప్పావ్ కానీ ఏం జరిగింది ఆ వేదకి అప్పగించేలా చేశావ్ ఇప్పుడు నిన్ను నేను నమ్ముకోను, యశోధర్ కరెక్ట్ పర్సన్, కరెక్ట్ గా డీల్ చేస్తాడు

అభి: అంత నమ్మకం ఏంటి వాడి మీద

News Reels

మాళవిక: నమ్మకం యశోధర్ మీద కాదు నా కొడుకు ఆదిత్య మీద, నా ఆది కోసం ఏమైనా చేస్తాడు.. ఇప్పుడే వెళ్ళి యశోధర్ ని నిలదీస్తాను అని వెళ్ళిపోతుంది.

Also Read: దీప-కార్తీక్ బతికే ఉన్నారని ఫిక్సైన సౌందర్య-ఆనందరావుకి, కుట్రల్లో మరింత ముదిరిపోయిన మోనిత

అప్పుడే ఆఫీసులో యష్ వసంత్ ని తిడుతూ ఉంటే మాళవిక వచ్చి పిలుస్తుంది. మాలిని ఇంట్లో యష్ గురించి బాధపడుతూ ఉంటే వేద వచ్చి పలకరిస్తుంది. యష్ ని కొట్టినందుకు తన బాధని వేదతో పంచుకుంటుంది. వాడి కోసం నువ్వు చేసిన త్యాగానికి వాడు నీకిచ్చిన విలువ ఇదేనా అని మాలిని బాధపడుతుంది. మీరు చేసింది తప్పు కాదు, కొడుకు చేసిన తప్పు సరిదిద్దుతున్నారు అందులో తప్పేమీ లేదని వేద నచ్చజెపుతుంది. యష్ భోజనం చేయలేదని బాధపడుతుంటే తనే క్యారేజీ తీసుకెళ్ళి తినిపిస్తాను అని వేద చెప్తుంది. ఆ మాటకి మాలిని చాలా సంతోషపడుతుంది.

యష్: ఎందుకు ఆఫీసుకి వచ్చావ్

మాళవిక: మొత్తం నేనే చూసుకుంటాను అని హామీ ఇచ్చావ్ కదా మరి ఇదేంటి.. కోర్టు సమన్లు, ఆ వేద వాళ్ళ అమ్మకి జరిగిన యాక్సిడెంట్ కేసులో విచారణ ఉంది, దానికి రెండ్రోజుల్లో కోర్టుకి హాజరుకమ్మని వచ్చాయి. ఇవి వచ్చే టైమ్ కొ ఆది ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏంటి పరిస్థితి

యష్: ప్రతిసారి ఆది పేరు చెప్పి నన్ను బెదిరించకు, నేను ఏమి చేసిన ఆది కోసమే చేస్తున్నా.. అయినా ఎందుకు వచ్చి నిలదీస్తున్నావ్, నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగుతాడు కదా వాడిని వెళ్ళి అడగొచ్చుగా

Also Read:  వసుకి బొట్టుపెట్టిన రిషి, మహేంద్రకి లెటర్ రాసి పెట్టేసి వెళ్లిపోయిన జగతి

మాళవిక: ఇంతక ముందు నువ్వు విరుచుకుపడే వాడివి ఇప్పుడు ఆ వేద వంతు వచ్చింది.. అయినా ఆదికి నేనంటే ఇష్టం నీకు ఆది అంటే ప్రాణం కదా వాడి కోసం ఏమైనా చేస్తాను అన్నావ్ కదా ఇప్పుడు నా కోసం కాదు నీ ముద్దుల కొడుకు కోసం ఏం చెయ్యాలో అది చెయ్యి.. నువ్వు ఇలా మమ్మల్ని మధ్యలో వదిలేస్తే మేము ఏమైపోతాం అని చెయ్యిపట్టుకుని అడుగుతుంది.

యష్: గతంలో అభిమన్యు దగ్గరకి వెళ్తు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. మధ్యలో వదిలేయడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా, ఆరేళ్లుగా ఆదిని అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావ్

మాళవిక: ఆదిని ఈ కేసులోకి తీసుకొచ్చింది నువ్వు , ఆదిని కాపాడతాను అని మాట ఇచ్చి, ఒట్టేసింది నువ్వు, ఆదికి నేనంటే ఇష్టం వాడి కోసం నువ్వు నన్ను కాపాడతాను అన్నావ్ ఎందుకంటే ఆ యాక్సిడెంట్ నేను చేశాను కాబట్టి

యష్: షటప్.. ఆపు నీ అబద్ధాలు, నీ నాటకాలు, నాకు తెలియదు అనుకుంటున్నావా నిజం ఏంటో.. అసలు ఈ యాక్సిడెంట్ చేసింది నువ్వు కాదు ఆదిత్య

 అప్పుడే వేద ఎంట్రీ ఇస్తుంది.

Published at : 21 Nov 2022 07:44 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial November 21st Episode

సంబంధిత కథనాలు

Veera Simha Reddy : తమన్‌కు టార్గెట్ ఫిక్స్ చేసిన బాలకృష్ణ ఫ్యాన్స్ - బాక్సులు పగిలిపోవాలంతే

Veera Simha Reddy : తమన్‌కు టార్గెట్ ఫిక్స్ చేసిన బాలకృష్ణ ఫ్యాన్స్ - బాక్సులు పగిలిపోవాలంతే

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Mahesh Babu: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - తిరిగి రంగంలోకి దిగిన మహేష్!

Mahesh Babu: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - తిరిగి రంగంలోకి దిగిన మహేష్!

స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!

స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!

టాప్ స్టోరీస్

Janasena Slow : జోరుగా ప్రచారాలు - అభ్యర్థులపై కసరత్తులు, ఎన్నికకు సిద్ధం అయిన వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ ! జనసేన వెనుకబడిందా ?

Janasena Slow : జోరుగా ప్రచారాలు - అభ్యర్థులపై కసరత్తులు, ఎన్నికకు సిద్ధం అయిన వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ ! జనసేన వెనుకబడిందా ?

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Rahul Gandhi on BJP: 'పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'

Rahul Gandhi on BJP: 'పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'

IND vs BAN 1st ODI: నేడు భారత్- బంగ్లా తొలి వన్డే- బంగ్లా పులులపై టీమిండియా పైచేయి సాధిస్తుందా!

IND vs BAN 1st ODI:  నేడు భారత్- బంగ్లా తొలి వన్డే- బంగ్లా పులులపై టీమిండియా పైచేయి సాధిస్తుందా!