News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Guppedantha Manasu November 18th Update: వసుకి బొట్టుపెట్టిన రిషి, మహేంద్రకి లెటర్ రాసి పెట్టేసి వెళ్లిపోయిన జగతి

Guppedantha Manasu November 18th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  November 18th  Today Episode 611)

రిషి మెయిల్ పెట్టడంతో జగతి సంబరంలో ఉంటుంది. కానీ మహేంద్ర మాత్రం నిన్ను అమ్మగా పిలవలేదు..వసుకి తోడుగా పిలిచాడని చెబుతాడు. మనం గెలవడానికి మూడు అడుగుల దూరంలో ఉన్నాం ఇప్పుడు మనం వెళ్లొద్దని మహేంద్ర చెబుతున్నా..ఇప్పుడు నేను వెళ్లకపోతే రిషి ఎప్పటికీ క్షమించడు అంటుంది. మీడియా ముందు వసు మాట్లాడుతుంటే వసు విజయాన్ని గర్వంగా చూడాలంటుంది. నేను చెప్పేది చెప్పాను ఆపై నీ ఇష్టం అంటాడు మహేంద్ర.

వసు-రిషి: వసుధార రెడీ అవుతూ తనని తాను పొగుడుకుంటూ ఉంటుంది. ..నువ్వు మంచి అమ్మాయివి,రిషి సార్ ని నొప్పించొద్దు అని మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో రిషిరావడంతో సార్ వెళదాం పదండి అంటుంది. అప్పుడు రిషి వసుధార నుదుటిపై బొట్టు లేకపోవడం చూసి వసుధారకు దగ్గరగా వెళ్లి అద్దం దగ్గర ఉన్న బొట్టు తీసిపెడతాడు. వసుధార ఆల్ ది బెస్ట్ ఎవరు వచ్చినా రాకపోయినా కొన్ని జరుగుతూ ఉంటాయి..నీ వెనుక నేనున్నాను అని ధైర్యం చెబుతాడు. మీరెప్పటికీ నాకు తోడుగా ఉంటారు సార్ ఈ విషయం నాకు తెలుసు..కానీ మనసులో జగతి మేడం వస్తే బావుండును అని చిన్న కోరిక మిగిలిపోయింది అంటుంది... ఇద్దరూ చేతిలో చేయివేసి మాట్లాడుకుంటూ ఉండగా దేవయాని వచ్చిమీ పెదనాన్న బయలుదేరారని చెబుతుంది.. మేంకూడా వెళుతున్నాం వసుధారకి ఆల్ దిబెస్ట్ చెప్పండి అంటాడు రిషి. చేసేది లేక కోపంగానే ఆల్ ది బెస్ట్ చెబుతుంది దేవయాని. 

Also Read: సౌందర్య తల పగులగొట్టిన మోనిత, దీప-కార్తీక్ లో మొదలైన అనుమానం!

కాలేజీలో సందడి: మరొకవైపు వసుధార ప్రెస్ మీట్ కోసం ఘనంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. మీడియా ముందు ఎలా మాట్లాడావో ప్రిపేర్ అయ్యావా అని రిషి అడిగితే..వాళ్లు అడిగిన దానికి సమాధానం చెప్పడమే ప్రిపేర్ అవడం ఏముంటుంది అంటుంది. ఓ చిన్నపని ఉంది ఇప్పుడే వస్తానంటూ వసుని తీసుకెళ్లిపోతాడు రిషి...ఇంతలో మహేంద్ర..గౌతమ్ కి కాల్ చేస్తాడు.. ఆ ఫోన్ ఫణీంద్ర లిఫ్ట్ చేస్తాడు..తన అన్నయ్య వాయిస్ విన్న మహేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలోగౌతమ్ అక్కడకు రావడంతో నీకు ఏదో కాల్ వచ్చింది మహేంద్ర వాయిస్ లా అనిపించిందని ఫణీంద్ర అనడంతో రిషి-వసు షాక్ అవుతారు. అప్పుడు రిషి బలవంతంగా గౌతమ్ ఫోన్ తీసుకుని తిరిగి కాల్ చేస్తాడు.. రిషి వాయిస్ విని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు..ఫోన్ కట్ చేస్తాడు. గౌతమ్ మాత్రం ఏదో చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటాడు.

Also Read: గోరుముద్దలు తినిపించుకున్న రిషిధార, జగతిని ఆలోచనలో పడేసిన రిషి మెయిల్

ఆ తర్వాత వసుధార... జగతి గురించి ఆలోచిస్తుంటుంది.  ప్రెస్ మీట్ లో మేడం వాళ్ళు ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. గౌతమ్ ని పిలిచి అడుగుదాం అనుకున్నా..గౌతమ్ తప్పించుకుని వెళ్లిపోతాడు. ఇంతలో వసు దగ్గరకు వచ్చిన రిషి...మేడం గురించి ఆలోచిస్తున్నావా అంటాడు. మేడం వస్తారా రారా అనే విషయం పక్కన పెట్టి నువ్వు ధైర్యంగా మీడియా ముందు ఇంటర్వ్యూ కి అటెండ్ అవు అని ధైర్యం చెబుతాడు. కాసేపు సరదాగా ఇంటర్యూ చేస్తాడు..జగతి మేడంగురించి వసు ఏమోషనల్ గా మాట్లాడుతుంటుంది..జగతి కాలేజీలోకి ఎంట్రీ ఇస్తుంది...

మరొకవైపు మహేంద్ర జగతి కోసం వెతుకుతూ ఉండగా అప్పుడు జగతి ఒక లెటర్ రాసిపెట్టి ఉంటుంది. నేను వెళ్ళిపోతున్నాను మహేంద్ర అని లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయి ఉంటుంది జగతి. మరొకవైపు వసుధార రిషి మాట్లాడుతూ ఉండగా జగతి కోసం బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వసు కి ధైర్యం చెబుతూ ముందుగానే ప్రెస్ మీట్ ఎలా ఉంటుంది తాను రిపోర్టర్ అంటూ వసుధార ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు రిషి. ఇప్పుడు వసుధర అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటుంది. మరొకవైపు జగతి వసదార కోసం వస్తూ ఉంటుంది.

Published at : 18 Nov 2022 09:27 AM (IST) Tags: Guppedantha Manasu Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Rasagnya Reddy jyothi roy Guppedantha Manasu November 18th Guppedantha Manasu Today Episode 611

ఇవి కూడా చూడండి

‘హాయ్ నాన్న’ రివ్యూ, ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘హాయ్ నాన్న’ రివ్యూ, ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Balakrishna New Movie: బాలకృష్ణ కొత్త సినిమాలో తెలుగమ్మాయికి ఛాన్స్

Balakrishna New Movie: బాలకృష్ణ కొత్త సినిమాలో తెలుగమ్మాయికి ఛాన్స్

Devil: థియేటర్లలోకి 'డెవిల్' వచ్చేది ఆ రోజే - కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండ్ కిక్!

Devil: థియేటర్లలోకి 'డెవిల్' వచ్చేది ఆ రోజే - కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండ్ కిక్!

Abhiram Daggubati Marriage : ఓ ఇంటివాడైన దగ్గుబాటి వారసుడు - అభిరామ్ పెళ్లి ఫోటోలు చూశారా?

Abhiram Daggubati Marriage : ఓ ఇంటివాడైన దగ్గుబాటి వారసుడు - అభిరామ్ పెళ్లి ఫోటోలు చూశారా?

Bigg Boss 7 Telugu: ‘స్పై’ బ్యాచ్ చేసేవి డ్రామాలు అన్న అమర్, ఓటు అప్పీల్ విషయంలో అర్జున్‌కే దక్కిన సపోర్ట్!

Bigg Boss 7 Telugu: ‘స్పై’ బ్యాచ్ చేసేవి డ్రామాలు అన్న అమర్, ఓటు అప్పీల్ విషయంలో అర్జున్‌కే దక్కిన సపోర్ట్!

టాప్ స్టోరీస్

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం

revanth reddy take oath as telangana cm  :  మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై  రేవంత్ తొలి సంతకం