Karthika Deepam November 23rd Update: శౌర్య అంటించిన పోస్టర్ చూసిన దీప, కార్తీక్ ను కొట్టబోయిన మోనిత!
కార్తీకదీపం నవంబరు 23 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Karthika Deepam November 23rd Episode 1517 (కార్తీకదీపం నవంబరు 23 ఎపిసోడ్)
ఇంటి తాళాలు వేసి లోపలున్న దుర్గ..తాళాలు తీయాలంటే నువ్వు ఎవరి తలపగులగొట్టావో చెప్పు అని నిలదీస్తాడు. నాకు తెలీదని గట్టిగా అరుస్తుంది...ఏం తెలీదు అని ఎంట్రీ ఇస్తాడు కార్తీక్..
దుర్గ: నువ్వు లోపలే ఉండు ఇప్పుడే వస్తానని తాళం వేసి నాకు తాళం చెవి ఇచ్చిపోయింది సర్
మోనిత: రేయ్ నిన్ను చంపేస్తా కార్తీక్ వాడి మాటలు నమ్మద్దు కార్తీక్ వాడు వంటలక్క మనిషి వాడి మాటలు నమ్మొద్దు
కార్తీక్: అలా మాట్లాడడానికి సిగ్గుండాలి..నీ ఫ్రెండ్, నీ బంధువు అని చెప్పి ఇప్పుడు మాట మారుస్తావా...
మోనిత: దీప ఆడిస్తున్న డ్రామా
కార్తీక్: నోరు ముయ్యి ... అక్కడ గుడిసెలో బిడ్డకోసం, భర్తకోసం తపన పడుతోంది వంటలక్క...ఇక్కడ ఇంట్లో ఓ మగాడిని పెట్టి డ్రామాలు ఆడుతున్నావ్..ఎవర్ని నమ్మాలి.. ఛీ అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు...
Also Read: మహేంద్రకి గడువు విధించిన రిషి - దేవయాని కుట్ర బయటపెట్టే పనిలో గౌతమ్
శౌర్య.. పోస్టర్లు చూస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. భోజనానికి పిలిచినా ఆకలి లేదంటుంది. ఆకలి లేకపోవడం ఏంటి అమ్మానాన్న గురించి ఆలోచిస్తూ తండి కూడా తినకపోతే ఎలా అంటారు. నేను తర్వాత తింటా అని చెప్పడంతో నువ్వు తినకుండా మేం ఎప్పుడైనా తిన్నామా అన్న చంద్రమ్మ...మాకు పుట్టి చనిపోయిన పాప పుట్టినరోజు రేపు..అందుకే గుడికి వెళదాం.. ఆ లోటు తీర్చడానికి దేవుడు నిన్ను మా దగ్గరకు పంపించాడు..నాదొక కోరిక తీరుస్తావా..అమ్మా అని పిలుస్తావా అని ఎమోషనల్ గా దగ్గరయ్యేందుకు ట్రై చేస్తుంది. కానీ శౌర్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
కార్తీక్-దీప: మరోవైపు దీప బట్టల సర్దుకుంటూ ఉండగా ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అనడంతో సంగారెడ్డికి వెళ్తున్నాను సౌర్యని వెతకడం కోసం అని అంటుంది దీప. ఏ నమ్మకంతో వెళతావు అని అడిగితే...ఇక్కడ ఏ నమ్మకంతో అయితే వెతికానో అక్కడ కూడా అదే నమ్మకంతో వెతుకుతాను అంటుంది దీప. ఈ ఒక్క రోజు రెస్ట్ తీసుకో అని కార్తీక్ అనడంతో నాకు నా బిడ్డ కావాలి అనిబాధపడుుంది దీప. అప్పుడే అక్కడకు వచ్చిన మోనిత వారి మాటలు విని...దీప సంగారెడ్డి వెళ్లొచ్చేలోగా కార్తీక్ ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతాను అనుకుంటుంది. దీప కన్నీళ్లు చూసి బాధపడిన కార్తీక్..డబ్బులిచ్చి జాగ్రత్తగా వెళ్లు అని పంపిస్తాడు
Also Read: శౌర్య ఎక్కడుందో మోనితకి తెలిసిపోయింది, ఎగిరిపోయిన పోస్టర్ కార్తీక్-దీప చూస్తారా!
సౌందర్య-ఆనందరావు: మోనిత దగ్గరకు వెళ్లేందుకు బట్టలు సర్దుకుంటూ ఉంటుంది సౌందర్య...ఏంటి అప్పుడే వెళతావా అని అడిగితే...వద్దండీ మీరు రావొద్దు మిమ్మల్ని చూస్తే శౌర్య వేషాలేస్తుంది వద్దు అనేస్తుంది. అప్పుడు హిమ నేనుకూడా వస్తాను అనడంతో ఇక్కడే ఉండి చదువుకో అని చెబుతారు. మరో వైపు దీప సంగారెడ్డి లో ఒక ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ రాజ్యలక్ష్మి వాళ్ళ డాక్టర్ అన్నయ్య చెప్పిన ఇంటి దగ్గరికి వెళ్తుంది. అక్కడ కార్తీక్ ఫోటోకి దండ వేసి ఉండడం చూసి..పరుగుల వెళ్లి కార్తీక్ ఫోటో పట్టుకుని ఎవరు చేశారు ఈ పని అని ఎమోషనల్ అవుతుంది. ఈ ఇంటికి డాక్టర్ బాబుకి సంబంధం ఏంటని ఆలోచిస్తుంది....
మోనిత-కార్తీక్: ఈ దీప ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఇన్ని రోజులు ఎదురు చూశాను ఇప్పుడు ఎలా అయినా కార్తీక్ ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి అనుకుంటుంది మోనిత. కార్తీక్ అక్కడికి రావడంతో టిఫిన్ చెయ్యి కాఫీ అనడంతో నువ్వు చేసే పనులకు కడుపు నిండిపోతుంది అని అంటాడు కార్తీక్. అప్పుడు దుర్గ గురించి ప్రస్తావన తీసుకురావడంతో మోనిత సీరియస్ అవుతుంది. కార్తీక్ ని కొట్టబోతుంది. అప్పుడు మోనిత దొంగ ఏడుపులు ఏడుస్తూ నన్ను నమ్ము కార్తీక్ ఆ దుర్గకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని కార్తీక్ చేతులు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటుంది.