అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Karthika Deepam December 15th Update: పండరి మోనిత మనిషా, కార్తీక్-దీప మళ్లీ విడిపోతారా, సౌందర్య ఏం చేయబోతోంది!

కార్తీకదీపం డిసెంబరు 15 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Karthika Deepam  December 15th  Episode 1536 (కార్తీకదీపం డిసెంబరు 15 ఎపిసోడ్)

హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత శౌర్య పేపర్ చదువుతూ కూర్చుంటుంది. అదిచూసిన చంద్రమ్మ నువ్వు స్కూల్ కి వెళ్లి చదువుకుంటావా అని అడుగుతుంది. వద్దు పిన్నీ..అమ్మా నాన్న దగ్గరకు వెళ్లాకచదువుకుంటా అని రిప్లై ఇస్తుంది. ఆ తర్వాత చారుశీల గురించి అడుగుతుంది శౌర్య. నీకు ఆ డాక్టర్ తెలుసా పిన్నీ అని అడిగితే..గతంలో వాళ్లింట్లో పనిచేశాను, ఆ సమయంలో దొంగతనం చేశాం అంటుంది. మరి ఏమీ అనలేదా అని శౌర్య అడిగితే.. కావాలంటే డబ్బులు అడగండి ఇలా చేయొద్దన్నారని చెప్పి బాధపడుతుంది. ఆ డాక్టర్ అంత మంచివారా..నేను ఆమెతో స్నేహం చేసి మానాన్నని వెతుకుతా అంటుంది శౌర్య..

మరోవైపు దీప.. ఇంద్రుడు-చంద్రమ్మ తప్పించుకుని పోవడంపై దీప ఆవేశపడుతుంది. ఎంత దూరం వెళతారులే దొరకుతారు అని కార్తీక్ సర్దిచెబుతాడు. వాళ్లిద్దరూ బాగానే ఉన్నారు అయినా హాస్పిటల్ కి వచ్చారెందుకు.. అంటే శౌర్యకి ఏమైనా అయిందా అని దీప అడగడంతో..అలా అయితే మాకు తెలిసిపోతుంది కదా అని కవర్ చేసిన కార్తీక్..నువ్వు పూర్తిగా కోలుకున్నాక శౌర్యని వెతుకుదాం అని చెబుతాడు.
 
Also Read: ఈ మనిషే నీవాడు వసుధార, చిన్న పిల్లాడిలా మురిసిన రిషి - ఆఖరి నిముషంలో ఝలక్ ఇచ్చిన దేవయాని

హోటల్ రూమ్ కి చేరుకున్న సౌందర్య..ఆనందరావుకి కాల్ చేసి వెతికి వెతికి ఇప్పుడే వచ్చానని చెబుతుంది. కార్తీక్-దీప ఆచూకీ దొరకలేదు మీరన్నదే నిజం అవుతుందేమో అని బాధపడుతుంది. ఊర్లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ చెక్ చేస్తాను ఏదో ఒక హాస్పిటల్లో నా కార్తీక్ కనిపిస్తాడనే నమ్మకం ఉందని ఆనందరావుకిచెప్పి కాల్ కట్ చేస్తుంది. 
ఆనందరావు: అసలు మీరు ఉన్నారా లేదా ఉంటే ఎందుకు కనిపించడం లేదు..మీరు బతికే ఉంటే ఆ నిజం చెప్పకుండా దాక్కునేంత పెద్ద కష్టం ఏమొచ్చింది మీకు. నేనంటే గుండె రాయిచేసుకుని బతికేస్తున్నా..కానీ సౌందర్య పిచ్చిదానిలా తిరుగుతోంది...ఎక్కడున్నా కనిపించండి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు..

గతంలో శౌర్యని కలిసిన సందర్భాలన్నీ గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప. మరోవైపు కార్తీక్ కూడా అదే పరిస్థితిలో ఉంటాడు. ఏ ముహూర్తాన నాజీవితంలోకి వచ్చావో కానీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏడుస్తూనే ఉన్నావ్.. నాకు గతం గుర్తుకురాకపోయి ఉంటే వేరే బాధలు ఎలా ఉన్నా కూతురికి దూరంగ ఉండే బాధ ఉండేది కాదనుకుంటాడు. ఏడుస్తున్న దీప దగ్గరకు వెళ్లి ఓదార్చుతాడు.  నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకూడదని చెబుతాడు..

Also Read: దీపను పండరి నిజంగా శౌర్య దగ్గరకే తీసుకెళుతోందా, ఇంద్రుడు చెప్పింది విని షాక్ అయిన కార్తీక్

దీపను నిద్రలేపుతుంది పండరి..ఎప్పటికీ లేవకపోవడంతో అక్కడినుంచి వెళ్లిపనిచేసుకుంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి దీప దగ్గరకు వెళుతుండగా నిద్రపోతోంది లేపొద్దని చెబుతుంది. మీకు ఏం కావాలని అడిగితే..ఇంతకీ నీకు ఎంతమంది పిల్లలు అని కార్తీక్ అడుగుతాడు..కానీ పండరి మాత్రం సమాధానం చెప్పకుండా తప్పించుకుని వెళ్లిపోతుంది.దీప చెప్పింది నిజమే ఈమె తన గురించి ఏ విషయాలు చెప్పడం లేదనుకుంటాడు కార్తీక్..

బయటకు వెళ్లేందుకు సౌందర్య బయటకు రావడంతో..అంజి అప్పటి వరకూ మాట్లాడిన వ్యక్తితో మళ్లీ కలుస్తానని చెప్పి పంపించేస్తాడు. ఈ ఊర్లో నీకెవరు తెలుసు అని అడిగితే..ఈ ఊర్లో అణువణువూ నాకు తెలుసు మేడం అదో పెద్ద కథ మళ్లీ చెబుతాను అంటాడు అంజి. దీపకు గుడికి వెళ్లే అలవాటు ఉంది..అందుకే ఊర్లో ఉన్న పెద్ద గుడులన్నిటికీ తీసుకెళ్లు అని చెప్పేసి కారెక్కుతుంది...

మరోవైపు పండరి.. కూరగాయల ముక్కలన్నీ కట్ చేసి తేనె వేసి తీసుకొచ్చి ఇస్తుంది. ఇప్పటికే ఓ డాక్టర్ బాబుతో పడలేకపోతున్నా నువ్వు కూడా తయాయ్యావా అంటుంది. అసలు నాకు ఏమైంది..ఎందుకు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. శౌర్య కనిపించేలోగా నాకు ఏమైనా అయితే అని బాధపడుతుంటే.. నువ్వు శౌర్య గురించి ఆలోచించడం మానెయ్ అంటాడు. మీకు ఏమైంది..గతం గుర్తుకు రాకముందు శౌర్య గురించి ఆలోచించారు ఇప్పుడేమైందని దీప అనడంతో నిన్ను ఆలోచించొద్దు అన్నాను నేను ఆలోచించను అనడం లేదంటాడు.  అసలు అత్తయ్య వాళ్ల దగ్గరకు ఎందుకు తీసుకెళ్లలేదు.. ఆరోగ్యం బాగోపోతే అయినవాళ్లకి దూరంగా ఉండాలా..ముందు వాళ్ల దగ్గరకు వెళదాం.. ఆ తర్వాత అందరం కలిసొచ్చి శౌర్యను వెతుకుదాం అంటుంది. కార్తీక్ సర్దిచెప్పబోతుంటే మీలో ఏదో మార్పు కనిపిస్తోంది అంటుంది. మరోవైపు హాస్పిటల్లో చారుశీల ఓ పేషెంట్ తో మాట్లాడుతుంది. ఇంతలో శౌర్య అక్కడకు రావడంతో చారుశీల కంగారుపడుతుంది. 

రేపటి( గురువారం) ఎపిసోడ్ లో
ఇంద్రుడు-చంద్రమ్మతో కలసి శౌర్య దిగిన ఫొటో పండరికి చూపిస్తుంది దీప. పాప చక్కగా ఉంది కానీ వీళ్ళతో ఉందేంటని అడుగుతుంది. వాళ్ళు నా పాపని తీసుకుని వెళ్ళిపోయారు ఎక్కడ ఉంటారో తెలియదు అంటుంది . నాకు తెలుసు మా ఇంటి దగ్గరే ఉంటారు పదా తీసుకుని వద్దాం అని దీపను ఆటోలో తీసుకెళుతుంది పండరి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget