అన్వేషించండి

Karthika Deepam ఫిబ్రవరి 24 ఎపిసోడ్: ఆ నిజం దీపకి కూడా తెలిసిపోయింది, ఇక కార్తీక్-పిల్లలే మిగిలారు, కార్తీకదీపం గురువారం ఎపిసోడ్

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ ఫిబ్రవరి 24 గురువారం 1284 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

కార్తీకదీపం ఫిబ్రవరి 24 గురువారం ఎపిసోడ్:

ఇంట్లో ఉన్న బాబు మోనిత కొడుకే అని సౌందర్య..తన భర్త ఆనందరావుకి చెబుతుంది. ఈ విషయం నీకెలా తెలిసిందని అడిగితే అప్పారావ్ దగ్గర కోటేష్ ఫొటో, బాబును ఎత్తుకెళ్లిన వీడియో ఫుటేజ్ చూసిన విషయం చెబుతుంది. ఇన్నాళ్లు వాళ్లు లేరని బాధపడ్డాం, ఇప్పుడు వచ్చారని సంతోష పడేలోగా వాళ్లవెంట వచ్చిన బిడ్డ మోనిత కొడుకు అని తెలిసింది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదంటుంది. ఇక అత్తమామలకు కాఫీ తెచ్చి ఇస్తుంది దీప. సంతోషంగా కనిపిస్తున్న దీపని చూసి కష్టాలు పోయినట్టే పోయి నీ వెనుకే వచ్చాయి దీప అనుకుంటుంది సౌందర్య. ఇంతలో అక్కడకు వచ్చిన కార్తీక్.. మోనిత కొడుకుని ఎత్తుకెళ్లిన సీసీ ఫుటేజ్ నీ దగ్గర ఉందికదా చూపించు అంటాడు. మీకెక్కడ దొరుకుడు,మీకేం పని, దాని తెలివి తేటలు, క్రిమినల్ బ్రెయిన్ మీకు తెలియనిదేం కాదుకదా అంటుంది దీప. నా మాట విని ఇంతటితో వదిలేయండని దీప అంటే..నా ప్రయత్నం నేను చేస్తానంటాడు కార్తీక్. దీప చెప్పింది వినొచ్చు కదా అని సౌందర్య అంటే... నేను మోనితకు సపోర్ట్ చేయడం లేదు ఆమె బాధ వదిలించుకుందామని ప్రయత్నిస్తున్నా అని క్లారిటీ ఇచ్చి సీసీ ఫుటేజ్ ఇమ్మని అడుగుతాడు. అది ఎక్కడుందో ఏమో, ఉందో లేదో కూడా తెలీదు అనేస్తుంది. సరే అని వెళ్లిపోతాడు.మోనిత బిడ్డ విషయంలో ఈ ఇంట్లో మళ్లీ ఇంట్లో తుఫాన్ వచ్చేట్టుందని సౌందర్య బాధపడుతుంది.

Also Read: మీరే నా ప్రాబ్లెమ్ సర్ అని రిషికి క్లాస్ రూమ్ లో షాకిచ్చిన వసుధార, గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
బయట ఉయ్యాల్లో కూర్చుని శౌర్య-హిమ బాబుతో ఆడుకుంటారు. అక్కడకు వచ్చిన మోనిత నా ఆనందరావు అనుకుంటూ...హిమా ఎవరీ బాబు అని అడుగుతుంది. మా తమ్ముడు అని చెబుతారు. మీకు తమ్ముడు లేడు కదా అంటే వీడు మా తమ్ముడే అని చెబుతుంది. మోనిత ఇమ్మని అడిగినా ఇవ్వను అనేస్తుంది. బాబుని చేతుల్లోంకి తీసుకనేందుకు ప్రయత్నించగా దీప వచ్చి లాక్కుంటుంది. ఎందుకొచ్చావ్ అని దీప అడిగితే..క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు వచ్చా అంటుంది మోనిత. పిల్లల్ని లోపలకి పంపించేస్తుంది దీప. ఈ బాబుని చూస్తే నా బాబు గుర్తొచ్చి ఎత్తుకోబోయాను అంటే వీడు నా మా బంగారు కొండ అని సమాధానం చెబుతుంది దీప. ఓ రకంగా నవ్విన మోనిత అంతదాకా వెళ్లారా ఎవరి బిడ్డనో తెచ్చుకుంటేనో అంటుండగా..వీడు మా బిడ్డ మా ఇంటి సభ్యుడు అన్న దీప మాటలు విని...అవును మీ ఇంటి సభ్యుడే అంటుంది మోనిత. అడ్డుగోలుగా గర్భం ధరించి, అర్థాంతరంగా బిడ్డను వదిలేసిన నువ్వు అమ్మవా అని క్లాస్ వేస్తుంది. 

నీకు పుట్టిన బిడ్డకు తండ్రిని కాదని అప్పట్లో నీతో అన్నాడు... ఇప్పుడు నాతోనూ అదే అంటున్నాడు. నా బిడ్డ పుట్టాకే నిన్ను నమ్మాడు. నిన్ను నమ్మాకే నన్ను కూడా నమ్ముతాడు చూస్తుండు అంటుంది. నా బిడ్డను వెతుకుతా అన్నాడు కదా కొన్ని విషయాలు చెప్పాలని మోనిత అనడంతో దీప ఫైర్ అవుతుంది. తండ్రి ప్రేమే కార్తీక్ తో బిడ్డను వెతికిస్తుందంటుంది. బిడ్డను ముట్టుకునేందుకు ప్రయత్నించినా దీప ముట్టుకోనివ్వదు. అన్నీ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని ఆనందరావుతో అంటుంది సౌందర్య. మోనిత అనే వ్యక్తి మన ఫ్యామిలీని అతలాకుతలం చేస్తోంది, తన గురించి ఆలోచిస్తుంటే పరిష్కారం దొరకడం లేదు ఇలాంటి సమయంలో టెన్షన్ పడకుండా ఎలా ఉంటాం సౌందర్య, ఇప్పుడు ఈ బాబు విషయంలో ఏం జరుగుతుందో ఏంటో అంటాడు ఆనందరావు. దీనికో పరిష్కారం ఉండాలి కదా అంటే సీసీ ఫుటేజ్ చూపించలేం,నిజాన్ని దాచలేం, ఈ విషయం దీపకి తెలిస్తే ఏం చేస్తుంది, ఇంత అపురూపంగా చూస్తున్న బాబుని వదిలి ఉండగలదా అంటుంది సౌందర్య.

Also Read: ఆపరేషన్ బ్లడ్ రిలేషన్, మోనిత కొడుకు చుట్టూ తిరుగుతున్న కథ, కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
మోనిత ఆంటీ రాగానే మమ్మల్ని ప్రతిసారీ పక్కకు వెళ్లమంటారేంటని పిల్లలు వచ్చి నానమ్మ, తాతయ్యని అడుగుతారు. డాడీ-మోనిత ఆంటీ మంచి ఫ్రెండ్స్ కదా ఇప్పుడేమైందని అడుగుతారు. అవతలకు వెళ్లండని సౌందర్య అంటే... సమాధానం చెప్పేస్తే మళ్లీ మళ్లీ అడగం కదా అంటారు. నానమ్మని ఎందుకు ఇబ్బంది పెడతున్నారని ఆనందరావు క్వశ్చన్ చేస్తాడు. ఎందుకు శౌర్య నువ్వెందుకు కామ్ గా ఉంటున్నావ్, ఆపరేషన్ అయిన తర్వాత నువ్వు మారిపోయావ్ అంటుంది. అదేం లేదు హిమ అంటుంది శౌర్య. ఏం దేనికీ మనింట్లో పెద్దోళ్లు సమాధానం చెప్పరని తెలుసా నీకు అంటూ కోపంగా వెళ్లిపోతుంది హిమ. మరోవైపు కార్లో వెళుతూ ఆనందరావుగారు నన్ను గెలిపిస్తారు అనుకుంటుంది. బరితెగించి డాక్టర్ బాబు వెంట పడుతున్నావ్ అన్న దీప మాటలు గుర్తుచేసుకుని నీ తిట్లలో తీవ్రత ఉంటుంది...నువ్వు తిట్టావ్, నేను పడ్డాను ఇప్పుడేమైంది, మా ప్రేమకు ప్రతిరూపమైన ఆనంద్ నువ్వు పెంచుతున్నావ్, ఎవరి కొడుకును ఎవరు పెంచుతున్నారో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది దీపక్కా అనుకుంటూ నవ్వుకుంటుంది. నేను బిడ్డని కంటే నువ్వు పెంచుతున్నావ్ ఇంతకన్నా విజయం ఏం కావాలి .... కన్న ప్రేమ కార్తీక్ ది-పెంచిన ప్రేమ నీది- ఆనందం మోనితది...ఇప్పుడు మోనిత ఆట ఆడుతుంది చూడు అనుకుంటూ క్రూరంగా నవ్వుకుంటుంది.

మోనిత కళ్లలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది, తాటాకు చప్పుళ్లలా మాట్లాడడం లేదు ...ఆ ధైర్యానికి కారణం ఏంటి అనుకుంటుంది. ఇంతలో హిమ వచ్చి బాబుని తీసుకుంటుంది. తాడికొండలో ఫంక్షన్ చేయలేదు కదా ఇప్పుడు తమ్ముడికి భారీగా ఫంక్షన్ చేద్దాం అంటారు పిల్లలు. ఇంతలో అక్కడకు వచ్చిన సౌందర్య.. తాడికొండ వెళ్లొచ్చినప్పటి నుంచీ మీరు మారిపోయారంటుంది సౌందర్య. దీపూ గాడిని ఎప్పుడైనా ఓ గంట సేపు ఎత్తుకున్నారా , దీపూ గాడు మీకు తమ్ముడు అని సౌందర్య చెబుతుంటే...వీడే మాకు సొంత తమ్ముడు అని రిప్లై ఇస్తుంది హిమ.  ఎపిసోడ్ ముగిసింది...

రేపటి (శుక్రవారం) ఎపిసోడ్ లో
మోనిత కార్ నంబర్ చూసి దీపకు ఏదో గుర్తొస్తుంది. కోటేష్ డైరీలో ఈ నంబర్ ఎందుకు రాసి పెట్టుకున్నాడని ఆలోచనలో పడుతుంది. కారు క్లీన్ చేస్తున్న లక్ష్మణ్ ని చూసి ఎవరిది ఈ కారు అని అడుగుతుంది. మోనితది అని చెప్పడంతో షాక్ అవుతుంది. ఆ తర్వాత కానిస్టేబుల్ రత్నసీతను కలసి సీసీ ఫుటేజ్ చూసి షాక్ అవుతుంది. ఇన్నాళ్లూ మోనిత బిడ్డని మా దగ్గర ఉంచుకున్నామా అనుకుంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ -  జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Non Detention Policy: 5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ -  జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Non Detention Policy: 5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
Allu Arjun Father-in-law: కాంగ్రెస్‌ పెద్దలతో అల్లు అర్జున్ మామ సమావేశం, సంధ్య థియేటర్ ఎపిసోడ్‌లో నెక్ట్స్ ఏం జరగబోతోంది?
కాంగ్రెస్‌ పెద్దలతో అల్లు అర్జున్ మామ సమావేశం, సంధ్య థియేటర్ ఎపిసోడ్‌లో నెక్ట్స్ ఏం జరగబోతోంది?
Paatal Lok 2: సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 'పాతాళ్‌ లోక్‌' సీజన్‌ 2 - స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసిందోచ్ 
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 'పాతాళ్‌ లోక్‌' సీజన్‌ 2 - స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసిందోచ్ 
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Sania Mirza And Shami : దుబాయ్‌లో జంటగా కనిపించిన సానియా మీర్జా, షమీ - సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందా ?
దుబాయ్‌లో జంటగా కనిపించిన సానియా మీర్జా, షమీ - సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందా ?
Embed widget