Balakrishna - NBK 107: బాలకృష్ణ సినిమాలో కన్నడ నటుడికి పవర్ ఫుల్ రోల్...
నట సింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో ఓ సినిమా రూపొంతోంది. ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్ ఇచ్చింది.
![Balakrishna - NBK 107: బాలకృష్ణ సినిమాలో కన్నడ నటుడికి పవర్ ఫుల్ రోల్... Kannada Actor Duniya Vijay on board for a powerful role in Balakrishna's NBK107 Balakrishna - NBK 107: బాలకృష్ణ సినిమాలో కన్నడ నటుడికి పవర్ ఫుల్ రోల్...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/19/1e734bca5c51c9617faccb0ae1433355_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నట సింహ నందమూరి బాలకృష్ణ, శ్రుతీ హాసన్ (shruti hassan ) జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. గత ఏడాది సంక్రాంతి హిట్ 'క్రాక్' తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని చేస్తున్న చిత్రమిదే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. బాలకృష్ణ 107వ (NBK107) చిత్రమిది. ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్(duniya vijay)కు కీలక పాత్ర దక్కింది. ఆయన పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్టు ఈ రోజు మైతీ మూవీ మేకర్స్ ప్రకటించింది.
View this post on Instagram
కన్నడలో దునియా విజయ్ (duniya vijay telugu debut movie) సుమారు 40 సినిమాలు చేశారు. చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసి, హీరోగా ఎదిగారు. గత ఏడాది 'సలగ' అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఆయనకు తొలి తెలుగు సినిమా ఇది. సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని (gopichand malineni) కథకు తుది మెరుగులు దిద్దుతున్నారు. బాలకృష్ణ(nandamuri balakrishna)కు ఆయన వీరాభిమాని. నందమూరి అభిమానులు కోరుకునే అంశాలతో పాటు కమర్షియల్ హంగులతో సినిమాను రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: త్వరలో తల్లి కానున్న హీరోయిన్... విడాకులు తీసుకున్నారా?
Also Read: 'భీమ్లా నాయక్' డేట్ మీద కన్నేసిన రాజ'శేఖర్'... సంక్రాంతి బరిలో మరో యాంగ్రీ స్టార్!
Also Read: షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లోనే ఏడ్చేసిన దీప్తి సునయన..
Also Read:'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..?
Also Read: సీనియర్ హీరోయిన్ కి పబ్లిక్ గా పెళ్లి ప్రపోజల్.. వెంటనే ట్వీట్ డిలీట్..
Also Read:ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ స్థానం నాకొద్దు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)