త్వరలో తల్లి కానున్న హీరోయిన్... విడాకులు తీసుకున్నారా?
తాను ప్రెగ్నెంట్ అని ఓ హీరోయిన్ వెల్లడించారు. అలాగే, విడాకులు తీసుకున్నట్టు వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకోండి.

చందమామ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అని, ఈ ఏడాది తల్లి కానున్నారని ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూ వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్‌లో కాజల్ పెళ్లి చేసుకున్నారు. ఫ్యామిలీ లైఫ్ ప్లాన్ చేయడంతో నాగార్జున 'ద ఘోస్ట్' సినిమాను కూడా వదులుకున్నారు. కాజల్ కంటే ముందు గత ఏడాది ఏప్రిల్‌లో హీరోయిన్ సంజనా గల్రాని వివాహం అయిన సంగతి తెలిసిందే. ఆమె కూడా ప్రస్తుతం ప్రెగ్నెంట్. ఈ ఏడాది మే నెలలో డెలివరీ కావచ్చని ఆమె చెప్పారు. అబ్బాయి పుడతాడని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
"మాతృత్వం అనేది ఓ అందమైన అనుభూతి. ఇప్పుడు నాకు ఐదో నెల. డెలివరీకి కొన్ని రోజుల ముందు వరకూ యాక్టివ్‌గా ఉండాలని అనుకుంటున్నాను. కొంత మంది మహిళలు డెలివరీకి రెండు వారాల ముందు వరకూ పని చేస్తారు" అని సంజనా గల్రాని తెలిపారు. రీసెంట్‌గా తిరువనంతపురంలో మలయాళ సినిమా 'చోరన్' ప్రచార కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. డెలివరీకి కొన్ని రోజుల ముందు వరకూ సినిమా వర్క్ చేస్తానని సంజనా గల్రాని పేర్కొన్నారు. అలాగే, తాను విడాకులు తీసుకున్నట్టు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు.
View this post on Instagram
సంజనా గల్రాని డ్రగ్స్ కేసు గురించి అవాస్తవాలు రాయడంతో ఆమె విడాకులు తీసుకున్నారని ఓ కన్నడ వెబ్ మీడియా రాసుకొచ్చారు. ఆ వార్తలను సంజనా గల్రాని ఖండించడంతో పాటు సదరు వార్త రాసిన విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "స్టాప్ ఫేక్ జర్నలిజం. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి చెత్త వార్తలను సహించలేను" అని ఆమె పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. సంజనా భర్త అజీజ్ పాషా డాక్టర్.
Also Read: 'భీమ్లా నాయక్' డేట్ మీద కన్నేసిన రాజ'శేఖర్'... సంక్రాంతి బరిలో మరో యాంగ్రీ స్టార్!
Also Read: షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లోనే ఏడ్చేసిన దీప్తి సునయన..
Also Read:'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..?
Also Read: సీనియర్ హీరోయిన్ కి పబ్లిక్ గా పెళ్లి ప్రపోజల్.. వెంటనే ట్వీట్ డిలీట్..
Also Read:ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ స్థానం నాకొద్దు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..
Also Read:తల్లి కాబోతున్న కాజల్.. అసలు విషయం చెప్పేసిన గౌతమ్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

