Chandramukhi 2: రిలీజ్‌కు మూస్తాబవుతున్న 'చంద్రముఖి 2'
వాసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చంద్రముఖి 2 షూటింగ్ కంప్లీట్ అయినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. కంగనా రనౌత్, లారెన్స్ నటిస్తోన్న ఈ సినిమాకు టీంకు సంబంధించిన ఫొటోను కూడా లైకా ప్రొడక్షన్స్ షేర్ చేసింది
Chandramukhi 2Shooting : బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొట్టిన 'చంద్రముఖి' ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే ఉత్సాహంతో రాబోతున్న చంద్రముఖి 2 పై ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అప్ డేట్ రానే వచ్చింది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్, నటుడు రాఘవ లారెన్స్ జంటగా నటిస్తోన్న 'చంద్రముఖి 2' సినిమా నిర్మాణం పూర్తయిందని లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఈ సందర్భంగా సినిమాలో నటించిన నటులంతా కలిసి ఉన్న ఓ మూవీ టీం ఫొటోను కూడా పంచుకుంది. వడివేలు, రాధికా శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్‌లు లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కూడా నటించిన ఈ తమిళ చిత్రంకు పి వాసు దర్శకత్వం వహించారు. హాస్యభరిత చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ.. 2005లో వచ్చిన 'చంద్రముఖి' (2005)కి సీక్వెల్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఆస్కార్ విజేత MM కీరవాణి 'చంద్రముఖి 2' చిత్రానికి సంగీతం అందించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
And... Cut! Chandramukhi 2 shooting has officially packed up. 🎬 We can't contain our excitement for fans to experience it on the big screen. 🤩🕴🏻🔥 #Chandramukhi2 🗝️ #CM2 🗝️
— Lyca Productions (@LycaProductions) June 20, 2023
🎬 #PVasu
🌟 @offl_Lawrence @KanganaTeam
🎶 @mmkeeravaani
🎥 @RDRajasekar
🛠️ #ThottaTharani
✂️🎞️… pic.twitter.com/cqxHM8ZJ86
అందుకే లారెన్స్ తో...
భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న 'చంద్రముఖి 2'కు విద్యాసాగర్ అందించిన సంగీతం సినిమాకి స్పెషల్ హైలైట్ గా నిలవనున్నట్టు తెలుస్తోంది. ఇక 'చంద్రముఖి పార్ట్ 1' సూపర్ స్టార్ రజనీకాంత్ నటించి, అలరించగా... ఇప్పుడు రాబోతున్న 'చంద్రముఖి 2'లో మాత్రం నటుడు రాఘన లారెన్స్ నటించారు. చంద్రముఖి సినిమాకి సీక్వెల్ చేయడానికి వాసు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. కొన్ని కారణాల వల్ల రజనీ ఒప్పుకోలేదని టాక్ నడుస్తోంది. దాంతో ఆయన అనుమతి తీసుకునే, లారెన్స్ తో సీక్వెల్ ను ప్లాన్ చేసినట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.
అప్పట్లో సూపర్ హిట్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా హార్రర్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన 'చంద్రముఖి' మూవీ.. కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. 2005లో వచ్చిన ఈ సినిమా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రజనీ కాంత్‌తో పాటు నయనతార, ప్రభు, జ్యోతిక కీ రోల్స్ ప్లే చేశారు. హార్రర్‌తో పాటు ఇందులో వడివేలు చేసిన కామెడీ సైతం ప్రక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.