అన్వేషించండి

KV Vijayendra Prasad: ఆ పాత్రకు తమన్నా వద్దన్నాను - ఆ మూవీ హిట్ కొడితే రాజమౌళి ‘మహాభారతం’ తీస్తానన్నాడు: విజయేంద్రప్రసాద్

రాజమౌళికు యాక్షన్ సన్నివేశాలు తీయడం అంటే బాగా ఇష్టమని అన్నారు విజయేంద్రప్రసాద్. అందుకే కథలో కూడా ఎక్కువ యాక్షన్ సన్నివేశాలు రాశామని అన్నారు. ఈ మూవీ సక్సెస్ అయితే..

KV Vijayendra Prasad: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 1,2’ సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు దేశం మొత్తం చూసే విధంగా ఈ సినిమా సత్తా చాటింది. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురింపించింది. ఒక్క తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ ‘బాహుబలి’ తన సత్తా చాటింది. ఈ సినిమాతో రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. మూవీలో చేసిన నటీనటులకు పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది. టాలీవుడ్ ‘బాహుబలి’ కి ముందు తర్వాత అన్న విధంగా సినిమా పేరు తెచ్చిపెట్టింది. చాలా ఏళ్ల తర్వాత మూవీకు కథ అందిందించిన విజయేంద్రప్రసాద్ ‘బాహుబలి’ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

రాజమౌళి స్క్రిప్ట్ అంతా తానే రాసుకుంటాడు: విజయేంద్రప్రసాద్

రాజమౌళి స్క్రిప్ట్ రైటింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఆయన గత సినిమాలు చూస్తే ఆ విషయం క్లియర్ గా తెలిసిపోతుంది. ‘బాహుబలి’ కి కూడా ఆ రేంజ్ స్క్రీన్ ప్లే అందించారు. అయితే రాజమౌళి స్క్రిప్ట్ అంతా తానే రెడీ చేసుకుంటారని చెప్పారు విజయేంద్రప్రసాద్. ఒకవేళ ఏమైనా మార్పులు ఉంటే అవి చిన్ని చిన్నవే ఉంటాయని అన్నారు. ఒకసారి స్క్రిప్ట్ రాశాక పెద్దగా మార్పులు చేయడని, ఒకవేళ చేసినా తనకు ఓసారి చెప్పి బెస్ట్ తీసుకుంటాడని అన్నారు.

మన పురాణాలే స్పూర్తి..

మనం కథలను ఎక్కడనుంచో తీసుకోవాల్సిన అవసరం ఉండదని, మన పురాణాల్లో నుంచే ఎన్నో కథలు ఉంటాయని అన్నారు విజయేంద్రప్రసాద్. ‘బాహుబలి’ లో కూడా ఆ ప్రభావం ఉంటుందని చెప్పారు. శివగామి(రమ్యకృష్ణ)  పాత్రకు రామాయణంలోని కైకేయి, కట్టప్ప పాత్రలో భీష్ముడు, కర్ణుడు ఛాయలు కనిపిస్తాయని, బిజ్జల దేవుడి పాత్రలో శకుని, మందర పాత్రలు కనిపిస్తాయని అన్నారు. 

ఇది పాసైతే మహాభారతం తీస్తానని అన్నాడు..

రాజమౌళికు యాక్షన్ సన్నివేశాలు తీయడం అంటే బాగా ఇష్టమని అన్నారు విజయేంద్రప్రసాద్. అందుకే కథలో కూడా ఎక్కువ యాక్షన్ సన్నివేశాలు రాశామని అన్నారు. రాజమౌళి కావాలనే అలా స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడని చెప్పారు. ఓసారి సినిమా కథ మధ్యలో రాజమౌళి ఓ మాట అన్నాడని గుర్తుచేసుకున్నారాయన. ఈ సినిమా తనకు మహాభారతం తీయడానికి ఒక టెస్ట్ లాంటిదని, ఎప్పటికైనా మహాభారతం తీయాలనే కోరిక ఉందని రాజమౌళి చెప్పాడని చెప్పారు. ఈ మూవీ సక్సెస్ అయితే మహాభారతం తీస్తానని చెప్పాడని అన్నారు విజయేంద్రప్రసాద్. భగవంతుని దయతో అది కూడా జరగచ్చు అని హర్షం వ్యక్తం చేశారు.  

తమన్నాను వద్దన్నాను, కానీ తర్వాత అలా చూసి ఆశ్చర్యపోయాను..

ఇక సినిమాలోని పాత్రల ఎంపిక గురించి విజయేంద్రప్రసాద్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శివగామి పాత్ర కోసం రాజమౌళి ముందు శ్రీదేవిను అనుకున్నాడని అన్నారు. కానీ తానే ఈ పాత్రకు రమ్యకృష్ణనే కరెక్ట్ అని చెప్పానని అన్నారు. అలాగే తమన్నా పాత్ర విషయంలో తాను కూడా పొరబడ్డానని చెప్పారు. తమన్నా పాత్ర గురించి రాజమౌళి చెప్పినపుడు వద్దని చెప్పానని అన్నారు. కానీ తర్వాత ఓ రోజు సెట్ లో రిహాసెల్స్ చేస్తుంటే ఆమె  నటన, ఆహార్యం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారాయన. అలాగే మూవీలో కీలక పాత్ర అయిన కట్టప్ప పాత్రకు కూడా సత్యరాజ్ లేదా మోహన్ లాల్ అనుకున్నామని తర్వాత ఆలోచించుకొని సత్యరాజ్ ని ఓకే చేశామంటూ అప్పటి విశేషాలను చెప్పుకొచ్చారాయన. 

Also Read : రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే  

టాప్ హెడ్ లైన్స్

Cult First Weekend Collections : విశ్వక్ సేన్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మాస్ కా దాస్ వయలెంట్ యాక్షన్ మూవీ ఎంత వసూళ్లు సాధించిందంటే?
విశ్వక్ సేన్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మాస్ కా దాస్ వయలెంట్ యాక్షన్ మూవీ ఎంత వసూళ్లు సాధించిందంటే?
Nayanthara Simbu: మాజీ ప్రేమికులు మళ్లీ సినిమా చేస్తారా? - శింబు నయనతారలతో యంగ్ డైరెక్టర్ కొత్త మూవీ
మాజీ ప్రేమికులు మళ్లీ సినిమా చేస్తారా? - శింబు నయనతారలతో యంగ్ డైరెక్టర్ కొత్త మూవీ
Illu Illalu Pillalu Serial Today November 2nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌ని కొంగుకు కట్టేసుకున్న ప్రేమ! వల్లీకి అండగా నర్మద! కొంప ముంచేసిన భద్రావతి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌ని కొంగుకు కట్టేసుకున్న ప్రేమ! వల్లీకి అండగా నర్మద! కొంప ముంచేసిన భద్రావతి!
Gundeninda Gudigantalu Nov2: దసరా నవరాత్రులు చివరిరోజు మీనాకు బాలు సర్‌ఫ్రైజ్‌ గిప్ట్‌..బంగారు పుస్తెలతాడు భార్య మెడలో వేసిన బాలు
గుండెనిండా గుడిగంటలు:దసరా నవరాత్రులు చివరిరోజు మీనాకు బాలు సర్‌ఫ్రైజ్‌ గిప్ట్‌..బంగారు పుస్తెలతాడు భార్య మెడలో వేసిన బాలు

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amit Shah Telangana BJP Padayatra: తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
KTR: కరువు పరిస్థితులకు రేవంత్ రెడ్డిదే బాధ్యత.. రైతులకు రూ.60 వేలు చెల్లించాలి: కేటీఆర్
కరువు పరిస్థితులకు రేవంత్ రెడ్డిదే బాధ్యత.. రైతులకు రూ.60 వేలు చెల్లించాలి: కేటీఆర్
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
Rohit Will Play Domestic Cricket: వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
Hot Water For Blood Pressure : వేడి నీళ్లతో బీపీ తగ్గుతుందా? తాగితే మంచిదా? స్నానం చేస్తే బెటరా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
వేడి నీళ్లతో బీపీ తగ్గుతుందా? తాగితే మంచిదా? స్నానం చేస్తే బెటరా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
2027లో ఈ అద్భుతమైన బైక్స్ ఎంట్రీ.. మీరు కొరుకునే లగ్జరీ బైక్స్ ఉన్నాయా చూడండి
2027లో ఈ అద్భుతమైన బైక్స్ ఎంట్రీ.. మీరు కొరుకునే లగ్జరీ బైక్స్ ఉన్నాయా చూడండి
Embed widget