అన్వేషించండి

Kalki Release Date: ఆ రోజే ప్రభాస్ 'కల్కి' విడుదల - అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన టీమ్

Prabhas Kalki 2989 AD release date: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కల్కి 2989 ఏడీ' విడుదల తేదీని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ 'కల్కి 2989 ఏడీ'. క్లాసిక్ హిట్ 'మహానటి' తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సినిమా విడుదల తేదీని ఇవాళ అధికారికంగా వెల్లడించారు.

మే 9న ప్రభాస్ 'కల్కి' విడుదల
మే 9, 2024లో 'కల్కి' సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ తెలిపింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు విదేశీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. విడుదల తేదీతో పాటు ప్రభాస్ కొత్త స్టిల్ కూడా విడుదల చేశారు. 

'కల్కి'ని మే 9న ఎందుకు విడుదల చేస్తున్నారు? ఆ రోజు స్పెషాలిటీ ఏమిటి? అంటే... చిరంజీవి, శ్రీదేవి జంటగా వైజయంతి మూవీస్ ప్రొడ్యూస్ చేసిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఆ రోజే విడుదల అయ్యింది.

Also Read: గుంటూరు కారం రివ్యూ : మహేష్ ఎనర్జీ, ఆ మాస్ సూపర్, మరి సినిమా?

మే 9న నాగ్ అశ్విన్ 'మహానటి' కూడా! 
మే 9కి, 'కల్కి' సినిమాకు మరొక అనుబంధం ఏమిటంటే... దర్శకుడు నాగ్ అశ్విన్. ఆయన దర్శకత్వం వహించిన సావిత్రి బయోపిక్ 'మహానటి' విడుదలైనది కూడా ఆ రోజే. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ ఆ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. దర్శక, నిర్మాతలకు బాగా కలిసి వచ్చిన రోజు కావడంతో మే 9న 'కల్కి'ని విడుదల చేస్తున్నారు. మెగా సెంటిమెంట్ అండ్ డైరెక్టర్ సెంటిమెంట్ కూడా!

Also Read: హనుమాన్ రివ్యూ: తేజ సజ్జ & ప్రశాంత్ వర్మ సినిమా గుంటూరు కారం కంటే బావుందా? అసలు ఎలా ఉంది?

'కల్కి 2989 ఏడీ' చిత్రాన్ని రూ. 400 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... ప్రభాస్ 'సలార్' డిసెంబర్ 23న థియేటర్లలోకి వచ్చింది. ఆ సినిమా విడుదల తేదీ వెల్లడించిన సమయంలో సంక్రాంతికి విడుదల కాదని ప్రేక్షకులకు సైతం అర్థమైంది. వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

'కల్కి' సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రభాస్, దీపిక నటిస్తున్న తొలి చిత్రమిది. తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన 'లోఫర్'... హిందీలో 'ఎంఎస్ ధోని', 'బాఘీ 2', 'భారత్', 'ఏక్ విలన్ రిటర్న్స్' సినిమాలు చేసిన దిశా పటానీ కీలక పాత్ర చేస్తున్నారు. ఆమెది సెకండ్ హీరోయిన్ రోల్ అని టాక్. భారతీయ చిత్ర పరిశ్రమలో లెజెండరీ హీరోలు బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ సైతం 'కల్కి 2989 ఏడీ' సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నారని సమాచారం.

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: హోటల్‌గా మారిన బిగ్‌బాస్ హోస్‌! స్టార్స్ కోసం కంటెస్టంట్స్ గొడవ! చీట్ చేసిన లవర్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: హోటల్‌గా మారిన బిగ్‌బాస్ హోస్‌! స్టార్స్ కోసం కంటెస్టంట్స్ గొడవ! చీట్ చేసిన లవర్స్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 28th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి మాటలకు వణికిపోయిన అంబిక! మహా, విహారిలను చంపాలని ప్లాన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి మాటలకు వణికిపోయిన అంబిక! మహా, విహారిలను చంపాలని ప్లాన్!
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ramayana First Review - 'రామాయణ' ఫస్ట్ రివ్యూ: హాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్టైల్‌లో... సినిమా చూసిన ఎన్నారై క్రిటిక్ ఏం చెప్పారంటే?
'రామాయణ' ఫస్ట్ రివ్యూ: హాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్టైల్‌లో... సినిమా చూసిన ఎన్నారై క్రిటిక్ ఏం చెప్పారంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget