By: ABP Desam | Updated at : 24 Apr 2023 04:21 PM (IST)
సింహాద్రి (Image Credits: Simhadri/Twitter)
Simhadri : 2003లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'సింహాద్రి' సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ₹8.5 కోట్ల బడ్జెట్ తో అప్పట్లో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా మరోసారి థియేటర్లలో రిలీజ్ అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా మెల్‌బోర్న్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ (IMAX ) స్క్రీన్‌లో ఈ సినిమా విడుదల కానుందని మూవీ టీం వెల్లడించింది.
టాలీవుడ్‌లో సూపర్ హిట్ చిత్రాలను మళ్లీ విడుదల చేసే ట్రెండ్ కొనసాగుతోంది. అందులో భాగంగా ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఖుషి', ప్రిన్స్ మహేశ్ బాబు 'ఒక్కడు', యంగ్ రెబల్ స్టార్ 'వర్షం', మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆరెంజ్, బాలకృష్ణ చెన్నకేశవ రెడ్డి.. లాంటి ఎన్నో సినిమాలు రీరిలీజ్ అయ్యి, మరోసారి బాక్సాపీస్ వద్ద రికార్డు సృష్టించాయి. కాసుల వర్షం కురిపించాయి. ఈ లెక్కన చూసుకుంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'సింహాద్రి' కూడా మే 20న థియేటర్లలో గ్రాండ్ గా రీరిలీజ్ అవుతుందని నందమూరి ఫ్యాన్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా మెల్‌బోర్న్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ (IMAX) స్క్రీన్‌లోనూ 'సింహాద్రి' సినిమా విడుదల కానుందని మూవీ టీమ్ వెల్లడించింది. ఈ మూవీ రీ-రిలీజ్ వెనుక టీమ్ చేసిన క్రేజీ మూవ్ ఇది అని నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ షోకి సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. అయితే డాల్బీ అట్మాస్ ఆడియోతో 4కెలో 'సింహాద్రి' సినిమా తెరకెక్కనుండడం మరో ముఖ్యమైన అంశంగా తెలుస్తోంది.
ఓ పక్క‘సింహాద్రి’ రీ-రిలీజ్ అవుతున్న సంతోషం.. మరో పక్క ఈ సినిమా మెల్‌బోర్న్ ఐమ్యాక్స్ స్క్రీన్ మీద ప్రదర్శితమవ్వబోతోందన్న ఆనందం.. ఇవి రెండూ నందమూరి ఫ్యాన్స్ కు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. మామూలుగా ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అంటేనే అభిమానుల తాకిడి, ఆ ప్రేమ తట్టుకోవడం కష్టం. అలాంటిది ఇప్పుడు మెల్‌బోర్న్ ఐమ్యాక్స్ స్క్రీన్ పైనా తమ అభిమాన హీరో కనిపిస్తుండడంతో తారక్ ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. ఇప్పటికే ఐమ్యాక్స్ మెల్‌బోర్న్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేసింది. ఈ విషయాన్ని ఐమ్యాక్స్ మెల్‌బోర్న్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఇక ఇంతకుముందు చెప్పినట్టు 'సింహాద్రి' మూవీ ద్వారా వసూలయ్యే కలెక్షన్లను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎన్టీఆర్ అభిమానులకు అందించనున్నట్టు గత కొన్ని రోజుల క్రితమే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కి కూడా చెప్పామని, ఆయన కూడా తమకు మద్దతు తెలిపినట్టు వెల్లడించారు. అంతే కాదు ఇంత మంచి పని చేస్తున్నందుకు జూనియర్ ఎన్టీఆర్ తమని అభినందించారని వారు ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.
మాస్టర్ స్టోరీ టెల్లర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా, భూమిక చావ్లా, అంకిత కథానాయికలుగా నటించారు. ముఖేష్ రిషి, నాజర్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, శరత్ సక్సేనా ముఖ్యమైన పాత్రలు పోషించారు. వి. విజయ్ కుమార్ వర్మ నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
Also Read: డాక్టర్ అఖిల్‌ను గంటసేపు మట్టిలో కూర్చోబెట్టమన్నారు: నాగార్జున
LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!
Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!
Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?
10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!
OTT Actors: వెబ్‌సీరీస్‌ల్లో అత్యధిక పారితోషికం తీసుకొనే మూవీ స్టార్స్ వీళ్లే - టాప్‌లో ఉన్నది ఎవరో తెలుసా?
Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!
IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!
YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి
Noise Buds Trance: రూ. వేయి లోపే ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ - లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ నాయిస్!