అన్వేషించండి

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

జూనియర్ ఎన్టీఆర్... నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ శారండోస్‌కు ఆతిథ్యం ఇచ్చారు.

నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ శారండోస్ టాలీవుడ్‌లో వరుసగా సెలబ్రిటీలను కలుస్తూనే ఉన్నారు. గురువారం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. శుక్రవారం యంగ్ టైగర్, మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి ఆయన లంచ్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశారు. ‘మీకు, మీ టీమ్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది. మన సంభాషణను నేను ఎంజాయ్ చేశాను. సినిమాలు, ఫుడ్ పైన మనకు ఉన్న ప్రేమ గురించి మాట్లాడుతూ మధ్యాహ్నాన్ని అద్భుతంగా గడిపాం.’ అని ట్వీట్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి టెడ్ శారండోస్ తన బృందంతో కలిసి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్, ‘దేవర’ డైరెక్టర్ కొరటాల శివ కూడా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతిని కూడా ఫొటోల్లో చూడవచ్చు.

తారక్ ప్రస్తుతం ‘దేవర’ను ముగించడంలో బిజీగా ఉన్నారు. జనవరి నెలాఖరుకు ‘దేవర’ను పూర్తి చేసి, అనంతరం గ్యాప్ ఇవ్వకుండా బాలీవుడ్ సినిమా ‘వార్ 2’ మీద ఫోకస్ పెట్టాలనేది జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్. ‘వార్ 2’లో జూనియర్ ఎన్టీఆర్ విలన్‌గా కనిపించనున్నారని సమాచారం. ఇటీవల విడుదల అయిన ‘టైగర్ 3’ పోస్ట్ క్రెడిట్ సీన్‌లో కూడా ఇదే హింట్ ఇచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ప్రస్తుతం ‘దేవర: పార్ట్ 1’ పూర్తి చేయనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది. అనంతరం ‘వార్ 2’ మీదకు వెళ్లనున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ‘వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్’లో భాగంగా ‘వార్ 2’ రూపొందనుంది. 2019లో వచ్చిన ‘వార్’కు ఇది డైరెక్ట్ సీక్వెల్. ఇందులో హృతిక్ రోషన్‌తో జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ‘వార్ 2’ 2025 ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కానుంది.

2024 ద్వితీయార్థం నుంచి ప్రశాంత్ నీల్ సినిమా‌ను తారక్ షురూ చేయనున్నాడు. ఈ సినిమా ఎప్పుడు రానుందనే విషయం మాత్రం తెలియరాలేదు. కానీ ప్రశాంత్ నీల్ వర్కింగ్ స్టైల్‌ను బట్టి చూస్తే 2025 చివరి నుంచి 2026 సమ్మర్‌లోపు ఎప్పుడైనా సినిమా విడుదల అవుతుందని అంచనా వేయవచ్చు. మరి ‘దేవర: పార్ట్ 2’ ఎప్పుడు అన్న సంగతి మాత్రం తెలియరాలేదు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget