Janaki Kalaganaledu May 18th: జ్ఞానంబ దగ్గర మల్లికని ఇరికించిన మలయాళం- వెన్నెల్లో విహరిస్తున్న రామ, జానకి
జానకి మీద మనోహర్ పగ తీర్చుకోవాలని అనుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
![Janaki Kalaganaledu May 18th: జ్ఞానంబ దగ్గర మల్లికని ఇరికించిన మలయాళం- వెన్నెల్లో విహరిస్తున్న రామ, జానకి Janaki Kalaganaledu Serial May 18th Episode 582 Written Update Today Episode Janaki Kalaganaledu May 18th: జ్ఞానంబ దగ్గర మల్లికని ఇరికించిన మలయాళం- వెన్నెల్లో విహరిస్తున్న రామ, జానకి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/18/aa0e4c4fae76e602dc55a984993678221684384296723521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
జ్ఞానంబ కొడుకు, కోడల్ని తన అక్క భవానీ ఇంటికి పంపిస్తుంది. ఇద్దరూ సరదాగా గడుపుతారు. అటు మనోహర్ తన ఉద్యోగం ఊడగొట్టిన జానకి మీద పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు. ఒక రౌడీని పిలిచి జానకిని చంపేందుకు సుపారీ ఇస్తాడు. జానకి చెట్టుకున్న మామిడి కాయ కావాలని భర్తని అడుగుతుంది. నేను కోయను మీరే రాయితో కొట్టమని చెప్తాడు. అప్పుడే ఐపీఎస్ అవుతారని అంటాడు. జానకి పండుని రాయితో కొట్టి సంతోషపడుతుంది. రామ, జానకి సంతోషంగా ఉంటడం చూసి భవానీ మురిసిపోతుంది. రామ పనస పొట్టు కూర అంటే చాలా ఇష్టమని తననే వండి పెట్టమని జానకి కి భవానీ ఆర్డర్ వేస్తుంది. జానకి దాన్ని ముందు పెట్టుకుని ఏం చేయాలా అని తల పట్టుకుంటుంది.
Also Read: నందు, తులసిని అల్లాడించిన లాస్య- తల్లికి ఎదురుతిరిగిన విక్రమ్
రామ వచ్చి పనస పొట్టు ఎలా తీయాలో చూపిస్తూ రొమాన్స్ చేసేస్తారు. మలయాళం వంట చేస్తుంటే మల్లిక వాడు చూడకుండా ఫోన్ తీసుకుని బయటకి వెళ్తుంది. బుట్ట కింద కోడి తప్పించుకుంటుంది ఎటు పోతుందో తెలుసుకోవాలి ప్రాణం పోయినా సరే ఏదో ఒకటి చేసి అడ్డం పడాలని అనుకుంటాడు. మల్లిక ఆన్ లైన్ లో ఏదో ఆర్డర్ పెట్టుకుని ఎవరికీ కనిపించకుండా చాటుగా దాన్ని లోపలికి తీసుకెళ్తుంది. అది కాస్త మలయాళం కంట పడుతుంది. మలయాళం నీకు కూడా చికెన్ కావాలా ఇదిగో తీసుకోమని ఇస్తుంది. వాడి వెనుక జ్ఞానంబ ఉండటం చూసి షాక్ అవుతుంది. ఇంత వెన్నుపోటు పొడుస్తావా అయిపోయావ్ అని మనసులో తిట్టుకుంటుంది.
Also Read: భర్తతో విడాకులు ఇప్పించి ప్రేమించిన వాడితో పెళ్లి చేయమన్న ముకుంద- కృష్ణకి ప్రపోజ్ చేసిన మురారీ
నేను చెప్పే మాటలు అంత వెటకారంగా ఉన్నాయా? ఈరోజు ప్రత్యేకంగా తెప్పించిన మందు వేయించాను కక్కాముక్క తీనొద్దని చెప్పాను కదా అని జ్ఞానంబ తిడుతుంది. వేసిన మందు పని చేయాలంటే ఇవి తినొద్దని అంటుంది. మల్లిక చేతిలో ఉన్నవి లాక్కుని బయట పడేయమని జ్ఞానంబ ఆర్డర్ వేస్తుంది. నోటి దగ్గర కూడు లాక్కున్న వాళ్ళు ఎవరూ బాగుపడలేదని మల్లిక తిట్టుకుంటుంది. భవానీ రామ దంపతులిద్దరికీ కలిపి ఒక ప్లేట్ లోనే భోజనం పెడుతుంది.
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)