Janaki kalaganaledu July 13th Update: జానకి శోభనం చెడగొట్టేందుకు మల్లిక ప్లాన్- రివర్స్ లో గురకపెట్టి నిద్రపోయిన విష్ణు
జానకి వాళ్ళ శోభనం చెడగొట్టేందుకు మల్లిక ప్రయత్నిస్తుంది. కానీ అది రివర్స్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
పోలేరమ్మ మా గదిని అలంకరించినట్టే జానకి వల్ల గదిని కూడా అలంకరించి ఉంటుందా అని మల్లిక అనుకుంటుంది. ఎలాగిన జానకి వాళ్ళ శోభనం చెడగొట్టి వల్ల కంటే ముందే నేను పిల్లల్ని కని ఆస్తిని కొట్టేయాలని ఆలోచిస్తుంది. తిరనాళ్లలో తప్పిపోయిన పిచ్చిదానిలా ఏమి ఆలోచిస్తున్నావ్ అని విష్ణు అడుగుతాడు. అదేమీ లేదండీ ఈ చీర ఏంటా అని ఆలోచిస్తున్న అని చెప్తుంది. వెనకటికి నీ లాంటిదే బడికి వెళ్ళి సినిమాకి టిక్కెట్స్ ఉన్నాయా అని అడిగిందంట వెళ్ళి రెడీ అవమని చెప్పి విష్ణు వెళ్ళిపోతాడు. ఇక జానకి వాళ్ళ శోభనం ఆపేందుకు మల్లిక పాలల్లో ఏదో పౌడర్ కలుపుతుంది. అప్పుడే అక్కడికి జానకి రావడంతో చూసిందేమో అని కంగారు పడుతుంది. కానీ జానకి మామూలుగా మాట్లాడటం చూసి చూడలేదని ఊపిరిపీల్చుకుంటుంది. ఇక ఆ పాలు తాగి మీరు నిద్రపోతారు నేను మాత్రం మీ కంటే ముందు పిల్లల్ని కనేసి ఐదు సెంట్ల స్థలాన్ని కొట్టేస్తానని తెగ సంబరపడుతుంది.
జానకి తెల్లని చీర కట్టుకుని మల్లెపువ్వు లాగా అందంగా రెడీ అయి శోభనం గదిలోకి అడుగుపెడుతుంది. అలా జానకిని చూసి రామా మైమరచిపోతాడు. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఆనందంగా గడుపుతారు. వాళ్ళిద్దరూ పాలు తాగి బెడ్ మీద పడి నిద్రపోతారు. పడిపోయారు పడిపోయారని మల్లిక గట్టిగా అరుస్తూ తెగ ఆనందపడుతుంది. తర్వాత తెరుకుని ఇదంతా నా కలా అయిన అక్కడ అదే జరుగుతుందిలే అని ఎగురుతుంది. తీరాచూస్తే పక్కన విష్ణు బెడ్ మెడ పడిపోయి నిద్రపోతూ ఉంటాడు. మల్లిక ఏమైందా అని ఆలోచించగా పొరపాటున పౌడర్ కలిపిన గ్లాస్ తనే తీసుకుని వచ్చినట్టు గుర్తుచేసుకుంటుంది.
Also Read: తులసి తలకి గన్, కిడ్నాప్ కేసులో ఇరుక్కున్న అనసూయ, పరంధామయ్య
ఓరి దేవుడా కంగారులో పౌడర్ కలిపిన గ్లాస్ నేనే తీసుకొచ్చానా అని లబోదిబోమని ఏడుస్తుంది. ఇక నా ఐదు సెంట్ల స్థలం పోయినట్లే అని ఏడుస్తుంది. విష్ణు ని లేపడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ లేవకపోయేసరికి ఏడుస్తూ కూర్చుంటుంది. ఇక జానకి పాల గ్లాస్ తెచ్చి రామాని తీసుకోమంటుంది. జానకి గారు మీరు మీ చదువు కంటే అమ్మ మాట కంటే ఎక్కువ విలువ ఇస్తున్నారని అర్థం అవుతుంది, కానీ నాకు మాత్రం మీరు ఐపీఎస్ అవ్వడమే ముఖ్యం అప్పటి వరకు మనం దూరంగా ఉండాలని అంటాడు. అందుకు సరే అని జానకి మళ్ళీ పాలు తాగమని రామకి అందిస్తుంది. నేను ఇంత చెప్పిన కూడా మీరు మళ్ళీ పాలు తాగమంటారు ఏంటి అని అడుగుతాడు. పాలు తాగినంత మాత్రాన పిల్లలు ఏమి పుట్టారులే తాగమని చెప్పడంతో ఇక చేసేది లేక తాగుతాడు. కాసేపు ఇద్దరి మధ్య రొమాన్స్ నడుస్తుంది.